మనిషి జీవితమే యాంత్రికంగా మారిపోతోంది. అలాంటిది ఇప్పుడు సెక్స్ కూడా యంత్రాలతోనే చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అదేంటి అంటే సేఫ్ సెక్స్. ఎలాంటి సమస్యలు ఉండవు. పోలీసు కేసులు ఉండవు. ఎవరితో గొడవ ఉండదు అని చెబుతున్నారు. 2050 నాటికి అమ్‌స్టర్‌డ్యామ్‌లోని రెడ్‌లైట్ డిస్ట్రిక్ట్స్‌లో ఇదే పరిస్థితి ఏర్పడబోతుందని ఓ పత్రిక వెల్లడించిన సంగతి తెలిసిందే.
అమ్మాయిలను తలదన్నేలా ఈ రోబోలను తయారు చేస్తారట. దీని వల్ల చాలా సమస్యలు తప్పుతాయని రోబోఎక్స్‌పర్ట్‌లు అంటున్నారు. డబ్బులు అవసరైమనపుడు ఏటీఎమ్‌కి వెళ్లినట్టు.. కోరిక తీర్చుకోవడానికి ఈ ఎస్‌ఎమ్ (సెక్స్ మెషీన్స్) వద్దకు వెళ్లొచ్చట. మోడళ్లతోపాటు కావాల్సిన షేప్, రంగు, బాడీ సైజ్‌తో శృంగార ప్రియులను ఆకట్టుకునేలా తీర్చిదిద్దనున్నారు. పైగా వీటి వల్ల ఒకరి నుంచి ఒకరికి ఎలాంటి వ్యాధులూ సంక్రమించవని శాస్త్రవేత్తలు అంటున్నారు.
కాగా అభిరుచులకు అనుగుణంగా ఈ సెక్స్ రోబోలను మార్కెట్‌లో విక్రయిస్తారు. ఈ రోబోలు మనుషుల కంటే బెటర్ లవర్స్‌గా వ్యవహరిస్తాయని రోబోఎక్స్‌పర్ట్‌లు చెబుతున్నారు. బెడ్రూమ్‌లో వ్యక్తుల అభిరుచులకు అనుగుణంగా ఈ ప్రోగ్రామింగ్ జరుగుతుందనీ, వారి కోరికలు, అవసరాల మేరకు మనుషులను మించినస్థాయిలో అత్యుత్తమమైన ప్రేమికులుగా ఇవి తమ భాగస్వామి లేదా తమను కొనుక్కున్న యజమాని/యజమానురాలితో వ్యవహరించగలవని లోవాలోని కిన్‌వుడ్ కాలేజ్‌కు చెందిన రోబోటిక్ నిపుణుడు జోయెల్ స్నెల్ అంటున్నారు.
సెక్స్ చేసేటప్పుడు మనుషులతో పోలిస్తే.. ఇవి ఉత్తమంగా వ్యవహరిస్తాయని అందువల్ల రాబోయే కాలంలో రోబోలతో సెక్స్ ఒక వ్యసనంలా మారిపోతుందన్నారు. మానవ సంబంధాల్లో సాధ్యంకాని విధంగా, స్ర్తీ లేదా పురుషుడు తాము కోరిన సమయంలో, కోరినరీతిలో సెక్స్ చేయడానికి ఈ రోబో లవర్స్ సిద్ధంగా ఉంటాయన్నారు. సెక్స్ క్రైమ్‌పై పెద్ద పోరాటం చేయడానికి, సురక్షితమైన క్రియేటివ్ సెక్స్ కార్యకలాపాలకు ఇవెంతో దోహదపడతాయని బిహేవియర్ థెరపిస్ట్ నికోలస్ అజులా చెబుతున్నారు.
very Good
ReplyDelete