నేలపై కూర్చుని భోజనం చేయడం:- నేలపై
కూర్చుని భోజనం చేయడం వల్ల పద్మాసనం భంగిమ వస్తుంది. దీంతో
జీర్ణక్రియ సక్రమంగా జరిగి జీర్ణాశయ సంబంధ సమస్యలు
దూరమవుతాయట.
కారమైన ఆహారం ముందు, స్వీట్లు తరువాత తినడం:- భోజనం
చేసినప్పుడు ముందుగా కారంగా ఉండే ఆహారం తినడం వల్ల జీర్ణాశయంలో
జీర్ణక్రియకు అవసరమైన ఆమ్లాలు బాగా ఉత్పత్తి అవుతాయట. దీంతో
జీర్ణక్రియ సక్రమంగా జరుగుతుందట. అయితే భోజనం మొదట్లోనే స్వీట్లు
తింటే అది మనం తిన్న ఆహారాన్ని సరిగ్గా జీర్ణం చేయనీయదట.
ఉపవాసం ఉండడం:- హిందువుల్లో
అధిక శాతం మంది వారంలో ఏదో ఒక రోజు దేవుడికి ఉపవాసం ఉంటారు కదా.
ఆయుర్వేద ప్రకారం అలా ఉపవాసం ఉండడం మంచిదేనట. ఎందుకంటే ఉపవాస
సమయంలో మన జీర్ణవ్యవస్థకు పూర్తిగా విశ్రాంతి లభించి శరీరంలో ఉన్న
పలు విష పదార్థాలు బయటకు వెళ్లగొట్టబడతాయట. దీంతోపాటు దేహం
తనకు తాను మరమ్మత్తులు చేసుకుంటుందట. ఉపవాసం ఉండటం వల్ల
డయాబెటిస్, గుండె జబ్బులు, క్యాన్సర్, బాక్టీరియా ఇన్‌ఫెక్షన్లు
రావట.
0 comments:
Post a Comment