CSS Drop Down Menu

Monday, September 26, 2016

ప్రస్తుతం బూమ్మీద ప్రాణాలతో ఉన్న వ్యక్తులు ఎవరూ ఈ సినిమా చూడలేరు ?

మీరు చదివిన టైటిల్ నిజమే... ప్రస్తుతం బూమ్మీద ప్రాణాలతో ఉన్న వ్యక్తులు ఎవరూ ఆ సినిమా చూడలేరు. ఒక వేళ మీరు వందేళ్లు మించి బ్రతికితే మాత్రం ఆ సినిమా చూసే అవకాశం దక్కుతుంది. ఎందుకంటే.... 100 ఏళ్ల తర్వాతే ఆ సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి. హాలీవుడ్‌ దర్శకుడు రాబర్ట్‌ రోడ్రిగే తెరకెక్కించిన '100 ఇయర్స్‌: ద మూవీ యు విల్‌ నెవర్‌ సీ' చిత్రం 2115వ సంవత్సరం నవంబర్‌ 18న విడుదల చేస్తామని చిత్ర బృందం ప్రకటించింది. రచయిత జాన్‌ మాల్కొవిచ్‌ ఈ సినిమాకి కథను అందించడంతోపాటు ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. లూయి-8 కాగ్నక్‌ అనే సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పుడున్న వారెవరూ చూడలేని, ఇప్పట్లో విడుదల కాని ఈ సినిమాను తీయడం ఎందుకు? అనే డౌట్ మీకు రావొచ్చు.... వెర్రి వేయి విధాలా అంటే ఇదే. రికార్డుల కోసం కూడా ఇలాంటి సినిమా తీయొచ్చు.




అసలే పైరసీ రాజ్యమేలుతున్న ఈ ఆన్ లైన్ కాలంలో ...... అన్నేళ్లు ఆ సినిమా బయటకు లీక్ కాకుండా ఎవరు కాపాడతారు? అంటే అందుకు సంబంధించిన తగిన ఏర్పాట్లు చేసామని అంటున్నారు. ఈ సినిమా ప్రిటును బుల్లెట్‌ ప్రూఫ్‌ లాకర్‌లో పెట్టి 18 నవంబర్‌ 2115 తేదీన మాత్రమే ఆటోమెటిక్‌గా తెరుచుకునేలా లాకర్‌కు టైం సెట్‌ చేశారు. వందేళ్ల తర్వాత విడుదలయ్యే ఈ సినిమా ప్రీమియర్‌ షోకి ప్రపంచవ్యాప్తంగా వెయ్యి మంది అతిథులను ఆహ్వానిస్తారట. ఈ సినిమా దర్శకుడు రాబర్ట్‌కి 48 ఏళ్లు. రచయిత, నటుడు జాన్‌కు 62 ఏళ్లు వీళ్లు కూడా ఈ సినిమా చూడలేరు. వారి వారసులే ఈ సినిమాను రిలీజ్ చేసే అవకాశం ఉంది. మరి ఈ సినిమా ద్వారా జనాలకు ఏం చెప్పదలుచుకున్నారు? సినిమాలో ఏం చూపించారు? తెలియాలంటే మరో వందేళ్లు ఆగాల్సిందే.

0 comments:

Post a Comment