యాంకర్ ఝాన్సీ... తెలుగు ఎంటర్టెన్మెంట్ రంగంలో సీనియర్ యాంకర్.
బుల్లితెర తో పాటు సినిమాలకు సంబంధించిన కార్యక్రమాలకు ఎన్నో వందల
ఎపిసోడ్లకు యాంకరింగ్ చేసిన అనుభవం ఉంది. అలాంటి ఝాన్సీ ఇటీవల ఓ ఆడియో
వేడుక సక్సెస్ మీట్ లో నోరు జారారు.
ఇండియాలోనే ప్రముఖుడైన సినీ నేపథ్య గాయకుడు ఏసుదాసును ఉద్దేశించి ఆమె చేసిన
కామెంట్స్ ఇపుడు హాట్ టాపిక్ అయ్యాయి. 'మనలో ఒక్కడు' అనే తెలుగు సినిమా
ఆడియో సక్సెస్ మీట్ తిరుపతిలో జరిగింది. ఈ సందర్భంగా చిత్ర సభ్యులు ఆయనకు
సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసారు.
ఈ సన్మాన సభకు వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఝాన్సీ ఏసుదాసును పొగడ్తలతో
ముంచెత్తే క్రమంలో నోటికి వచ్చిన పదాలు వాడేసింది. ఈ క్రమంలో ఆమెకు
తెలియకుండానే ఆయన్ను అవమానించింది.
ఈ కార్యక్రమంలో ఝాన్సీ మాట్లాడుతూ.... ‘అమర గాయకుడు ఏసుదాసు గారు' అంటూ సంబోధించింది. ఝాన్సీ అలా అనడంతో అంతా ఒక్కసారిగా షాకయ్యారు. చనిపోయిన వారి విషయంలో మాత్రమే ‘అమరుడు' అనే పదం వాడతారు.
ఆమె అలా వ్యాఖ్యానించడంతో సభలో ఉన్నవారి ఎక్స్ ప్రెషన్స్ ఒక్కసారిగా మారిపోయాయి, కొందరు సీరియర్ గా ఫేసు పెడితే, మరికొందరు నవ్వుకున్నారు. అయితే అప్పటికీ ఝాన్సీ తన తప్పును గుర్తించలేదు. అలాగే తన వ్యాఖ్యానం కొనసాగించింది.
అయితే సభ ముగిసిన తర్వాత ఆమె చేసిన తప్పును కొందరు ఆమెకు వివరించిన వెంటనే ఈ విషయమై ఆమె ఏసుదాసును కలిసి క్షమాపణలు చెప్పినట్లు, చిత్ర యూనిట్ సభ్యులు కూడా కొందరు ఆమెను ఈ విషయమై మందలించినట్లు సమాచారం.

amarudu ante devatalu ani kuda oka ardham undi. Jhansi aa mening lo vadi undavachchu
ReplyDeleteamaranayakudi ardhangi ann amaata oka naatakam lo vinnattu gurtu.