CSS Drop Down Menu

Tuesday, July 29, 2014

"పంచదార" కంటే "బెల్లమే" మంచిది !!!





బెల్లం (Jaggery)ఒక తియ్యటి ఆహార పదార్థం. దీనిని సాధారణంగా చెరకు నుండి తయారు చేస్తారు. సాదారణముగా చెరకు రసము నుంచి మొలాసిస్ ను వెలికితీసి బెల్లము తయారు చేస్తారు. ఇది సాదారణము గా ప్రతిఒక్కరు ఉపయోగించే రకము . తాటికల్లు, ఈతకల్లు, ఖర్జూరము నుంచి బెల్లము తయారుచేస్తారు . బెల్లం తయారిలో వివిధ రకాలు ఉన్నాయి. చెరకు బెల్లం, ఖర్జూర బెల్లం, తాటి బెల్లం, ఈతబెల్లం, కొబ్బరి బెల్లం ఇలా వివిధ రకాలుగా తయారు చేస్తారు. అయితే ఇళ్ళలో వాడేరకం చెరకు బెల్లం. ఇది భారతీయ వంటలలో బెల్లం ఒక ముఖ్యమైన పదార్థం. చెరకు బెల్లము గోల్డ్ బ్రౌన్‌ కలర్ నుంచి డార్క్ బ్రౌన్ కలర్ లో ఉంటుంది . ఈ బెల్లంను చెరకు రసాన్నిబాగా కాయడం ద్వారా తయారుచేస్తారు . భారతీయ ఇళ్ళలో వాడే రకము ఇది.   స్వీట్స్(తియ్యని పిండివంటలు)తయారీలో కొంత మంది పంచదార కంటే బెల్లంనే ఎక్కువగా ఉపయోగిస్తారు. తీపిపదార్థం అంటే బెల్లంతో తయారు చేసినవి మాత్రమే అనేవారు మనపెద్దలు. పంచదార వచ్చి బెల్లంతో చేసిన తీపి వంటలలకు ఉనికిని వెనక్కి నెట్టేసింది. ఒకప్పుడు బెల్లం మరమరాలు, బెల్లం కలిపిన ఉండలు, నువ్వులు బెల్లం కలిపిన బూంది, బెల్లం కలిపిన జీడీలు వంటి చిరుతిండ్లు పిల్లలకు ఎక్కువగా పెట్టేవారు. ఇప్పటికీ పల్లెటూళ్ళలో బెల్లంతో చేసిన అరిసెలు, బూరెలు, పూర్ణాలకే డిమాండ్ ఉన్న సంగతి తెలిసినదే. అందుకే వంటకాలలో బెల్లం వాడకం పెంచడం మంచిది. పంచదార లేదా చక్కెర కంటే బెల్లం ఆరోగ్యపరంగా చాలా మంచిది. ఎందుకంటే బెల్లంలో ఐరన్(ఇనుము ) అధికంగా ఉంటుంది. ఖనిజాలు అధికమే. అంతే కాదు ఇది ఒక మంచి పోషక పదార్థం కూడా . దీనిలో ఉండే గ్లూకోజ్, సుక్రోజ్ లు పంచదారలో ఉండే వాటికన్నా మంచివి. అందుకే ఆయుర్వేద వైద్యశాస్త్రంలో కూడా బెల్లాన్ని చాలా రకాల మందుల్లో వాడుతారు. అందుకే దీన్నిమెడిసిన్ చక్కెర అంటారు.
 ప్రతి వంద  గ్రాముల బెల్లంలో 2.8 మినరల్ సాల్ట్ లు ఉంటాయి. అంటే ఒక కేజీకి 28గ్రాములన్నమాట. అదే పంచదారలో అయితే ఒక కేజికి 300మిల్లీ గ్రాములు కూడా ఉండదు. ప్రతి వందగ్రాముల బెల్లం నుండి 383కేలరీల శక్తిని 95గ్రా కార్బోహైడ్రేట్స్ ను, 80మిల్లీగ్రాముల కాల్షియంను, 40మిల్లీ గ్రాముల ఫాస్పరస్ ను 2.6గ్రాముల ఇనుమును పొందవచ్చు.
 బెల్లం వల్ల కీళ్ళ ఇబ్బందులు రావు. రక్తంలో చేరిన విషపూరిత పదార్థాలను తొలగించే శక్తి బెల్లానికి ఉంది. ఇంకా బెల్లంలోని మెగ్నీషియం నాడీ వ్యవస్థను క్రమబద్దం చేస్తుంది. ఇందులో ఉన్న పొటాషియం అయితే కణాల్లోని ఆమ్లాలని నియంత్రిస్తుంది. కాబట్టి బెల్లం వాడకం పెంచడం మంచిది.
 తరచూ పొడిదగ్గు ఇబ్బంది పెడుతుంటే కనుక... గ్లాసు బెల్లం పానకంలో కొద్దిగా తులసి ఆకులు వేసి బాగా నానిన  తర్వాత రోజుకు రెండు మూడు సార్లు తీసుకుంటే ఉపశమనం కలుగుతుంది. 
చాలా మందిని అజీర్తీ సమస్య ఇబ్బంది పెడుతుంటుంది అటువంటి వారు భోజనం చేశాక చిన్న  బెల్లం ముక్క నోట్లో వేసుకుంటే జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. అజీర్ణ సమస్యలు ఉండవు. జీవక్రియను వేగవంతం చేస్తుంది.
 నెయ్యిలో బెల్లం ముక్క వేసి వేడి చేసి శరీరంలో నొప్పి ఉన్న చోట పట్టు వేస్తే ఆ నొప్పిని నివారిస్తుంది. 
నెయ్యి, బెల్లం.. సమపాళ్ళలో కలిపి తింటే 5-6 రోజుల్లో మైగ్రేన్ తలనొప్పి తగ్గిపోతుంది.
 కాకరకాయల ఆకులు, వెల్లుల్లి రెబ్బలు నాలుగు, మిరియాలు నాలుగు, చిన్న బెల్లం ముక్క వేసి గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని రోజుకి రెండు సార్లు వారం రోజుల పాటు     తీసుకుంటే లేదా గ్లాసు పాలల్లో పంచదారకి బదులుగా బెల్లం వేసి రోజు త్రాగిన నెలసరి (బహిష్టు )సమస్యలు ఉండవు.
 అసిడిటిని తగ్గించే అద్భుతమైన ఔషదం బెల్లం, కడుపులో మంటగా ఉన్నప్పుడు బెల్లం చిట్కాను ప్రయోగించవచ్చని పోషక నిపుణులు సూచిస్తున్నారు. బెల్లంలో పొటాషియం సమృద్ధిగా ఉంటుంది కాబట్టి ఇది కణాల్లో ఆమ్లాలు, అసిటోన్లపై దాడి చేసి ఆమ్ల సమతౌల్యాన్ని క్రమబద్దం చేస్తుంది. భోజనం చేసిన తర్వాత ప్రతి సారీ చిన్న బెల్లం ముక్క తినటం ద్వారా అసిడిటీని తగ్గించుకోవచ్చు. 
ఇన్ని అద్భుతమైన ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలిగి ఉంటడం వల్ల బెల్లంను ‘మెడిసినల్ షుగర్' గా వ్యవహరిస్తారు.


0 comments:

Post a Comment