CSS Drop Down Menu

Monday, July 14, 2014

"ఆన్ లైన్" లో వస్తువులు "తక్కువ ధరకు" కొనాలంటే ?

మీరు ఆన్ లైన్ లో వస్తువులు కొనాలంటే flipkart , amazon ,snapdeal వంటి వెబ్ సైట్ లు ఓపెన్ చేసి మీకు నచ్చిన వస్తువులు కొంటుంటారు. కానీ మీరు కొనే వస్తువు ధర కన్నా  ఇతర సైట్లలో  తక్కువ ధరకు  వస్తే మీరు బాధ పడుతుంటారు . కానీ మీరు కొనే ముందే ఏ సైట్లలో ఎంత ధర ఉందో ముందే తెలిస్తే మనీ ఎంతో సేవ్ అవుతుంది కదా !

అందుకే ఇప్పుడు నేను తెలియచేసే టిప్ మీకు ఖచ్చితంగా నచ్చితీరుతుంది   అది ఎలాగంటే మీ వెబ్ బ్రౌజరు లో ఈ క్రింది విధంగా చేయండి . 

1) ముందుగా మీరు Makkhichoose అనే addon మీ వెబ్ బ్రౌజరు లో install చేయండి.


2)  ఉదాహరణకు మీరు flipkart లో ఒక HP Notebook కొనాలనుకున్నారు. అప్పుడు కొనాలనుకునే దానిపై క్లిక్ చేస్తారు . అప్పుడు మీకు ఈ క్రింది విధంగా చూపిస్తుంది . 


3) అదే Makkhichoose addon మీ వెబ్ బ్రౌజరు లో install చేసిన తరువాత మీరు కొనే వస్తువు రేటు కన్నా ఇతర సైట్లలో తక్కువ రేటు గనుక ఉంటే అప్పుడు ఆ వస్తువు రేటు క్రింద రూపాయి సింబల్ వచ్చి ప్రక్కన  Lower price available on another site!అని వస్తుంది . ఈ క్రింది ఇమేజ్ గమనించండి . 



4) అప్పుడు  ఎడమ వైపు పైన ఉన్న రూపాయి సింబల్ పై క్లిక్ చేస్తే మిగతా సైట్లలో ఉన్న  తక్కువ రేటు కనిపిస్తుంది .



దానిని బట్టి మీకు నచ్చిన వస్తువులను తక్కువ ధరకు కొనుక్కుని డబ్బు ఆదా  చేసుకోవచ్చు. 
 

0 comments:

Post a Comment