CSS Drop Down Menu

Thursday, July 10, 2014

"పైల్స్" సమస్య - చికిత్స

ఒకే చోట కదలకుండా కనీసం పది నిముషాలైనా కూర్చోకుండా, కుర్చీలో అటు ఇటూ కదిలే వారిని చూస్తే పక్క వారికి కాస్తా చిరాకుగానే ఉంటుంది. కానీ అది పైకి చెప్పలేని బాధ. ఇంతగా బాధించే వ్యాధి పేరే ‘పైల్స్‌'. ఈ సమస్యను బయటకు చెప్ప కోలేక చాలా మంది లోలోన మధనపడుతుంటారు. ప్రారంభ దశలోనే ఈ వ్యాధిని గుర్తించి చికిత్స తీసుకోవడం ఉత్తమం. పైల్స్ (హెమరాయిడ్స్‌)లను సాధారణంగా అర్శమొలలు అంటారు. పైల్‌ అంటే గడ్డ అని హెమరాయిడ్‌ అంటే రక్త స్రావం కావడం అని అర్థం. మొలలు చూడటానికి పిలకలుగా కనబడినా, రక్తంతో ఉబ్బి ఉంటాయి. ఇవి మలద్వారం వెంట బయటకు పొడుచుకొని వచ్చినట్లు కనిపిస్తాయి. ఈ సమస్యను నివారించడానికిఆయుర్వేదం గ్రేట్ గా సహాయపడుతుంది.

ఆయుర్వేదం హిందు మత సాంప్రదాయ ఔషధ వ్యవస్థగా , ఆయుర్వేదం పురాతకాలం నుంచి భారత ఉపఖండంలో స్థానికంగా ఉంది. ఆయుర్వేద ఔధ్యంతో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా అధిక ప్రయోజనాలు అందుస్తున్నాయని ప్రజల్లో నమ్మకం పెరగడంతో ఇతర ట్రీట్మెంట్స్ కు ప్రత్యామ్నాయంగా బాగా ప్రజాదరణ పొందింది. పైల్ లేదా హెమరాయిడ్స్ అనే సమస్య ఈ మద్యకాలంలో చాలా ఎక్కువగా చాలా మంది బాధిస్తున్నది . ఇక పైల్స్ కు ఆయుర్వేద చికిత్సలో చాలా వరకూ హోం రెమడీస్ నే ఎక్కువగా ఉపయోగిస్తున్నారు . పైల్స్ కు ప్రధాన కారణం జీర్ణవ్యవస్థ. తిన్న ఆహారం సరిగా జీర్ణం అవ్వక, బయటకు విసర్జింపబడక, ఫిషర్స్ గా మారుతుంది. ఆ కారణం వల్లే ఆయుర్వేదం ప్రకారం, జీవనశైలిలో మార్పులు తప్పనిసరి అని చెబుతున్నారు. ఆయుర్వేదంతో పాటు, జీవన శైలిలో మార్పులు చేసుకుంటే పైల్స్ ను నివారించడం చాలా సులభం అవుతుంది.

కారణం : తీవ్రమానసిక ఒత్తిళ్లు. మల విసర్జన సరిగా జరగక మలబద్దకం ఏర్పడటం. ఎక్కువసేపు కుర్చీలోనే కూర్చొని కదలకుండా విధులను నిర్వర్తించడం. తక్కువగా నీరు తాగడం. మద్యం అతిగా సేవించడం. ఫాస్ట్‌ ఫుడ్స్‌, వేపుల్లు అతిగా తినడం. మాంసాహారం తరుచూ తినడం వల్ల పైల్స్‌ సమస్య వస్తుంది.
 లక్షణాలు : మల విసర్జన సాఫీగా జరగక తీవ్ర నొప్పి, మంట వుంటాయి. అప్పుడప్పుడు రక్తం పడుతూ ఉంటుంది. మల విసర్జన అనంతరం కూడా కొందరిలో నొప్పి, మంట రెండు గంటల వరకు ఉంటుంది. మల విసర్జన సమయంలో మొలలు (పైల్స్‌) బయటకు పొడుచుకొని వచ్చి బాధిస్తాయి.

పైల్స్ కు ఆయుర్వేదంలో చికిత్స: పైల్స్ వల్ల ఇన్ఫ్లమేషన్ ఎక్స్ టర్నల్ గాను లేదా ఇంటర్నల్ గా ఉండవచ్చు . ఇది డ్రైగాను లేదా బ్లీడింగ్ కూడా ఉండవచ్చు. అంతర్గత పైల్స్ తో పోల్చితే, బాహ్యంగా కనిపించే పైల్స్ తక్కువ బ్లీడింగ్ కలిగి ఉంటుంది .ఈ రెండు సందర్భాల్లోనూ జీర్ణవ్యవస్థతో సమస్య ఉంటుంది . 
ఫైబర్ అధికంగా ఉన్న ఆహారాలు తీసుకోవాలి: ఫైబర్ అధికంగా ఉన్న ఆహారాలు జీర్ణక్రియకు గొప్పగా సహాయపడుతాయి. ఆయుర్వేద చికిత్స మొదలు పెట్టగానే అందులో ముందుగా చేయాల్సిన పని ఫైబర్ ఫుడ్ ను అధికంగా తీసుకోవడం . ఫైబర్ ఫుడ్స్ అంటే తాజా పండ్లు, వెజిటేబుల్స్, చిరుధాన్యాలు.పండ్లు జ్యూసులను నివారించి , పండ్లను అలాగే తినడం వల్ల పీచు ప్రేగులను శుభ్రం చేస్తుంది, తిన్న ఆహారం సులభంగా జీర్ణం అయ్యేందుకు సహాయపడతుంది. 

కిచెన్ మెడిసిన్ : పైల్స్ లక్షణాలున్నప్పుడు ఈ హోం రెమెడీస్ ఉపయోగించడం వల్ల చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి.

 1. మజ్జిగలో కొద్దిగా ఉప్పు మరియు కొద్దిగా నిమ్మరసం పిండి తీసుకోవాలి. 

2. అల్లం, తేనె, స్వీట్ లైమ్ మరియు పుదీనాను నీళ్ళలో మిక్స్ చేసి తీసుకోవాలి.

 3. అరటీస్పూన్ జీలకర్ర పొడిని ఒక గ్లాస్ వాటర్ లో వేసి తీసుకోవాలి. 

4. ఉల్లిపాయ రసం మరియు పంచదార నీటిలో వేసి మిక్స్ చేసి త్రాగాలి.

5. వేపఆకులతో తయారుచేసిన డికాషన్ లో తేనె మిక్స్ చేసి, అరకప్పు మజ్జిగలో మిక్స్ చేసి తీసుకోవాలి.

 6. తులసి ఆకులను నానబెట్టిన నీటిని తీసుకోవాలి.

 బహిర్గత పైల్స్ కు : బహిర్గత పైల్స్ కు ఆయుర్వేదంలో ఇంటర్నల్ గా తీసుకొనే హోం రెమడీస్ తో పాటు, బహిర్గతంగా కొన్ని ఆయిట్మెంట్స్ ను కూడా అప్లై చేయాల్సి ఉంటుంది. 

1. నువ్వుల నూనెను ఎక్సటర్నల్ గా అప్లై చేయవచ్చు

 2. అలాగే బేకింగ్ సోడా వాపున్న ప్రదేశంలో అప్లై చేయాలి. 

వీటితో పాటు... నీల్ళు ఎక్కువగా తీసుకోవాలి. శరీరం డీహైడ్రేషన్ కు గురికాకుండా ఎక్కువగా నీళ్ళు త్రాగడం వల్ల కూడా పైల్స్ ను నివారించవచ్చు . ఇది శరీరంకు ఎక్కువ ప్రయోజనం మరియు జీర్ణవ్యవస్థను మెయింటైన్ చేయడానికిక సహాయపడుతుంది.

 కారం తగ్గించాలి: కారంగా ఉన్న ఆహారాలను సాధ్యమైనంత వరకూ తినడం తగ్గించాలి లేదా మానేయాలి .

 వేడినీటితో కడుక్కోవడం: వేడినీటితో కడుక్కోవడం వల్ల తక్షణ ఉపశమనం కలిగిస్తుంది.

 వ్యాయామం: వీటన్నింటితో పాటు రెగ్యులర్ వ్యాయామం వల్ల మలబద్దకాన్ని నివారించవచ్చు . వ్యాయామం వల్ల చురుకైన జీవనశైలి హెల్తీ డైజెస్టివ్ సిస్టమ్ తో పైల్స్ బారిన పడుట చాలా తక్కువగా ఉంటుంది.





0 comments:

Post a Comment