
బెల్లం (Jaggery)ఒక తియ్యటి ఆహార పదార్థం. దీనిని సాధారణంగా చెరకు నుండి తయారు చేస్తారు. సాదారణముగా చెరకు రసము నుంచి మొలాసిస్ ను వెలికితీసి బెల్లము తయారు చేస్తారు. ఇది సాదారణము గా ప్రతిఒక్కరు ఉపయోగించే రకము . తాటికల్లు, ఈతకల్లు, ఖర్జూరము నుంచి బెల్లము తయారుచేస్తారు . బెల్లం తయారిలో వివిధ రకాలు ఉన్నాయి. చెరకు బెల్లం, ఖర్జూర బెల్లం, తాటి బెల్లం, ఈతబెల్లం, కొబ్బరి బెల్లం ఇలా వివిధ రకాలుగా తయారు చేస్తారు. అయితే ఇళ్ళలో వాడేరకం చెరకు బెల్లం. ఇది...