CSS Drop Down Menu

Tuesday, January 31, 2017

వేడి పాలలో "బెల్లం" వేసుకుని తాగితే ?

బెల్లంలో ఆరోగ్యానికి మేలు చేసే ప్రయోజనాలెన్నో వున్నాయి. రుతు స‌మ‌యంలో మ‌హిళ‌ల‌కు వ‌చ్చే వివిధ ర‌కాల స‌మ‌స్య‌లు, ప్ర‌ధానంగా క‌డుపునొప్పి త‌గ్గాలంటే... వేడి పాలలో బెల్లం వేసుకుని తాగాలి. అనీమియాను ఇది దూరం చేస్తుందట. పాలను తాగడం ద్వారా రక్తహీనతను దూరం చేసుకోవచ్చు. అందులో బెల్లం కాస్త కలుపుకుని సేవిస్తే బరువు తగ్గుతారు.

బెల్లం క‌లిపిన వేడి పాలలో స‌హ‌జ సిద్ధ‌మైన యాంటీ బ‌యోటిక్‌, యాంటీ వైర‌ల్ గుణాలు ఉంటాయి. అందువ‌ల్ల అవి అనారోగ్యాల‌ను క‌లిగించే వైర‌స్‌లు, బాక్టీరియాల భ‌ర‌తం ప‌డ‌తాయి. దీంతో ప‌లు ఇన్‌ఫెక్ష‌న్లు త‌గ్గుతాయి. శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది.

వేడివేడి పాలలో బెల్లం కలుపుకుని తాగితే బరువు తగ్గిపోతారు. ఇది శ‌రీరంలో పేరుకుపోయిన అధిక కొవ్వును త‌గ్గిస్తాయి. ఇలా చేస్తే జుట్టు కాంతివంతంగా మారుతుంది. హెయిర్ ఫాల్ ఉండదు. చుండ్రు మటాష్ అవుతుంది. కీళ్ళ నొప్పులు దూరమవుతాయని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. 

Saturday, January 28, 2017

మీ PC/LAPTOP లో CHECKING FILE SYSTEM అనే ERROR ఇబ్బంది పెడుతుందా ?

మీ PC/LAPTOP లో ఆన్ చేసిన వెంటనే CHECKING FILE SYSTEM అనే  ERROR ఈ క్రింది చూపిన విధంగా వస్తున్నట్లైతే ,
ఈ క్రింది చూపిన టిప్స్ కనుక ఫాలో అయినట్లయితే ఈ ERROR ని సులువుగా తొలగించుకోవచ్చు . 

STEP-1

ముందుగా COMMAND PROMPT (CMD) ని SEARCH BAR లో టైప్ చేయండి.  


STEP-2

ఇప్పుడు CMD మీద RIGHT CLICK చేసిన తర్వాత "RUN AS ADMINISTRATOR" ఫై CLICK చెయ్యాలి.  STEP-3

పైన చెప్పిన విధంగా చేసినట్లయితే ఈ క్రింది చూపిన ఇమేజ్ (COMMAND PROMPT) ఓపెన్ అవుతుంది.  STEP-4

ఇప్పుడు chkntfs /x D: G: అని టైప్ చేసి "ENTER" ఇవ్వాలి .STEP-5

"ENTER" ఇచ్చిన తర్వాత ఈ క్రింది చూపిన ఇమేజ్ లో లాగ వస్తుంది. అప్పుడు CMD BOX ని CLOSE చేసి "RESTART" చేసినట్లయితే మీ సమస్య  తీరిపోతుంది. 

గమనిక:- నేను పైన చూపించింది D,G DRIVE లకు సంబందించినది.  మీ PC/LAPTOP లో ERROR ఏ DRIVE యొక్క LETTER చూపించబడుతుందో అదే  LETTER ని టైప్ చేయండి.  

ఉదాహరణకి మీకు C కనుక చూపిస్తున్నట్లైతే ఈ క్రింది చూపిన విధంగా టైప్ చేయండి.
chkntfs /x C:


Wednesday, January 25, 2017

ప్రపంచంలో కొన్ని అద్భుతమైన "బ్రిడ్జిలు"


CIRCULAR LAGUNA GARZON BRIDGE, URUGUAYDRAGON BRIDGE, VIETNAMESHIMA OHASHI BRIDGE, JAPANGATESHEAD MILLENNIUM BRIDGE, ENGLANDHENDERSON WAVES BRIDGE, SINGAPORELUCKY KNOT BRIDGE, CHANGSHA, CHINAMAGDEBURG WATER BRIDGE, GERMANYMOSES BRIDGE, NETHERLANDS TWIN SAILS BRIDGE, DORSET, ENGLANDROLLING BRIDGE, ENGLAND 


Monday, January 23, 2017

"లివర్‌"ను రక్షించుకునేందుకు ఏ "డ్రింక్" తీసుకోవాలో తెలుసా?

శరీరంలోని అంతర్గత అవయవాల్లో లివర్ అత్యంత కీలకమైన అవయవం. మనిషి తీసుకునే ఆహారంలో శరీరానికి కావాల్సిన పోషకాలను గ్రహించి... మిగిలిన విష పదార్థాలతో పాటు.. చెత్తను బయటకు పంపించి వేసే అత్యంత కీలకమైన అవయవం. ఇది రక్తాన్ని కూడా శుద్ధి చేస్తుంది. అలాంటి లివర్‌కు అత్యంత ప్రమాదకరమైన వ్యాధులు సోకే సోకే ప్రమాదం ఉంది. ముఖ్యంగా.. సిరోసిస్, హెపటీస్ ఏ, బి, సితో పాటు... అత్యంత ప్రమాదకరమైన వ్యాధులు సోకుతాయి. వీటితోపాటు.. అత్యంత ప్రమాదకరమైన ఫ్యాటీ లివర్స్ కూడా సోకే ప్రమాదం ఉంది. దీనికి కారణం మారిన ఆహారపు అలవాట్లే. అలాంటి లివర్‌ను రక్షించుకునేందుకు వ్యక్తిగతంగా శ్రద్ధ చూపడమే కాకుండా... ఇంటిపట్టునే ఉంటూ ఎండు ద్రాక్ష డ్రింక్ తీసుకుంటే చాలు. ఆ డ్రింక్‌ను ఎలా తయారు చేసుకోవాలో పరిశీలిద్ధాం. ఒక కప్పు నాణ్యమైన ఎండు ద్రాక్షకు, మూడు కప్పుల నీటిని కలిపి 20 నిమిషాల పాటు ఉడికించాలి. ఆ నీటిని 24 గంటల పాటు నిల్వ ఉంచాలి. ఆ డ్రింక్‌ను వారం రోజుల పాటు తాగడం వల్ల లివర్ పూర్తిగా క్లీన్ అవుతుందని గృహవైద్య నిపుణులు చెపుతున్నారు. అయితే, ఈ డ్రింక్ తీసుకునే ముందు.. మద్యం అలవాటు ఉన్నవారు పూర్తిగా మద్యానికి దూరంగా ఉండాల్సి ఉంటుంది. 

Saturday, January 21, 2017

"LETV LE 1S" ఫోన్ లో పవర్ బటన్ నొక్కకుండా లాక్ చేయడం ఎలా ?

సింపుల్  ట్రిక్  ద్వారా "LETV LE 1S" ఫోన్ లో పవర్ బటన్ నొక్కకుండా లాక్ చేయడం ఎలాగో తెలియాలంటే ఈ క్రింది ఇమేజ్ పై క్లిక్ చేయండి . 

    

Friday, January 20, 2017

"నల్లమచ్చలు" ఉన్న అరటి పండు తింటే ?

అరటి పండు.. ఈ పండును ఇష్టపడని వారంటూ ఉండరు. భోజనం చేశాక విధిగా ఆరగిస్తారు. దీనికి కారణం ఇందులో పోషకాలు పుష్కలంగా ఉండటమే కాకుండా తీసుకున్న ఆహారాన్ని తేలికగా జీర్ణం చేసే శక్తి ఉంది. అయితే, పచ్చటి అరటిపండు మేలా... నల్లటి మచ్చలున్న అరటిపండ్లు మంచిదా అనేది ఇక్కడ పరిశీలిద్ధాం. బాగా పండిన అరటి పండు తొక్కపై నల్లటి మచ్చలు ఉంటాయి. ఎన్ని నల్లటి మచ్చలు ఉంటే ఆ పండు అంత బాగా పండిందని అర్థం. ఈ మచ్చలు ఉండే అరటిపండును ఆరగించడం వల్ల శరీరంలో చెడు కణాలను నివారిస్తుంది. 

తెల్ల రక్త కణాలను వృద్ధి చేసి.. రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. స్ట్రాచ్‌ను చక్కెరగా మారుస్తుంది. ఇది తీసుకున్న ఆహారాన్ని తేలికగా జీర్ణం చేస్తుంది. శరీరంలో చక్కెర శాతాన్ని పెంచుతుంది. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉండటం వల్లే మచ్చలున్న అరటి పండు ఆరగించడం ఎంతోమేలని వైద్యులు సూచన చేస్తున్నారు. 


Thursday, January 19, 2017

కొడుకులు "త‌ప్పు చేస్తే వారి త‌లలు తీసేస్తాన‌న్న" బాలీవుడ్ హీరో !

అమ్మాయిల‌ు.. ఆడవాళ్లతో మ‌ర్యాద‌గా మెల‌గాల‌ని వారిని వేధించ‌కూడ‌ద‌ని చెప్పారు బాలీవుడ్ స్టార్ షారూఖ్ ఖాన్. ఈ విషయం త‌న కుమారులు ఆర్యన్‌, అబ్‌రామ్‌ల‌కు పదేపదే చెబుతాన‌న్నారు. స్త్రీల‌ను గౌర‌వించాల‌ని.. ఆడ‌వారితో మాట్లాడేట‌ప్పుడు వారిని నువ్వు, గివ్వు అని అన‌కూడ‌ద‌ని త‌మ‌ పిల్లల‌కు నేర్పుతున్నట్టు షారూఖ్ తెలిపాడు. అంతేకాదు, ఈ విషయంలో ఒక‌వేళ త‌మ కుమారులు త‌ప్పు చేస్తే వారి త‌లలు తీసేస్తాన‌ని వ్యాఖ్యానించాడు. ఇటీవ‌ల‌ బెంగళూరులో యువ‌తుల‌పై జరిపిన దాడుల‌మీద ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో  స్పందించిన‌ షారుక్ ఖాన్ పిల్లల్ని త‌ల్లిదండ్రులు హ‌ద్దుల్లో ఉంచి పెంచాల‌ని సూచించాడు.

Wednesday, January 18, 2017

మడతపెడితే ఐఫోన్ ! తెరిస్తే గన్?

ఐఫోన్ వంటి 9ఎమ్ఎమ్ డబుల్ బ్యారెల్ గన్ వస్తోంది. అచ్చు ఐఫోన్‌లా కనిపించే.. ఈ గన్‌ను ఎవరికీ అనుమానం రాకుండా చక్కగా మడతపెట్టి పాకెట్లో పెట్టుకోవచ్చు. బ్రిటన్‌లో ఇలాంటి గన్స్ కావాలని అప్పుడే ఆర్డర్లు చేసే వారి సంఖ్య భారీగా పెరిగిపోయింది. కానీ బ్రిటన్ నుంచి అమెరికాకు ఇవి స్మగుల్ అయి అమ్మకానికి పెడితే చాలా డేంజర్ అని, క్రిమినల్స్ వీటిని సంపాదించి హింసకు పాల్పడవచ్చునని భావించిన అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ గన్ ప్రచారంలోకి రాగానే 12 వేల ప్రీ-ఆర్డర్స్ వచ్చేశాయట. ఒక బటన్ ప్రెస్ చేయగానే ఈ ఐ-ఫోన్ గన్‌లా మారిపోతుంది. ఐ-ఫోన్ 7 ధరతో పోలిస్తే దీని ధర సగమేనంటున్నారు. అతి ప్రమాదకరమైన ఈ వెపన్ దుండగుల చేతిలో పడకుండా.. బ్రిటన్, యూఎస్ సరిహద్దుల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు.

కేవలం ఒక్క బటన్ ఒత్తితే చాలు.. ఇది తెరుచుకుని, ట్రిగ్గర్ బయటపడుతుంది. దీంతో ఉగ్రవాదులు, నేరస్తులు సులభంగా దీన్ని ఉపయోగించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది. యూరోపియన్ నేరగాళ్లు దీన్ని అతితక్కువ సమయంలోనే తెప్పిస్తారని అధికారులు చెప్తున్నారు. దీని ధర కూడా కేవలం రూ. 28వేల లోపే ఉండటం, అది దాదాపుగా ఐఫోన్ 7 ధరకు సమానంగా ఉండటంతో మరింత క్రేజ్ పుట్టిస్తోంది. 

ఇటీవలి కాలంలో యూరోపియన్ దేశాల్లో వరుసగా ఉగ్రదాడులు జరుగుతున్నాయి. దాంతో అక్కడి పోలీసులు మరింత అప్రమత్తం అవుతున్నారు. ఈ గన్ గురించి ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటివరకు యూరోపియన్ మార్కెట్లలో కనిపించకపోయినా, అది రావడానికి ఎంతోకాలం పట్టకపోవచ్చని అంటున్నారు.

మామూలుగా చూస్తే దీన్ని ఫోన్ కాదని ఎవరూ చెప్పలేరని బెల్జియం పోలీసులు అంటున్నారు. చాలామంది వద్ద ఐఫోన్లు, ఇలాంటి స్మార్ట్ ఫోన్లు ఉంటుండటంతో అందరినీ తనిఖీ చేయడం కూడా సాధ్యం కాకపోవచ్చని వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 


Monday, January 16, 2017

"ఖైదీ నంబర్ 150" కొన్ని సీన్లపై మురుగ‌దాస్ అస‌హ‌నం !

తమిళ దర్శకుడు ఏ.ఆర్.మురుగదాస్. అటు కోలీవుడ్, ఇటు టాలీవుడ్‌లో ప్రత్యేకమైన గుర్తింపు ఉన్న డైరక్టర్. ఈ దర్శకుడు తెరకెక్కించే చిత్రాలు సూపర్ డూపర్ హిట్లు కావాల్సిందే. అలాంటిదే తమిళంలో వచ్చిన "కత్తి" చిత్రం. ఈ చిత్రంలో విజయ్ హీరోగా నటించాడు. ఈ చిత్రాన్నే మెగాస్టార్ చిరంజీవి తెలుగులో "ఖైదీ నంబర్ 150" పేరుతో రీమేక్ చేశారు. 

అయితే, ఈ సినిమా చూసిన మురుగ‌దాస్ అస‌హ‌నం వ్య‌క్తం చేశాడ‌ట‌. అందుకు మంచి కారణం ఉందట. ఈ చిత్ర ప్రదర్శనను వీక్షించిన మురుగదాస్ స్పందిస్తూ సినిమా అంతా బాగానే ఉందని అన్నాడు. అందులో క‌నిపించిన‌ కొన్ని సీన్లపై మాత్రం అభ్యంత‌రంగా ఉన్నాయన్నారు. సాధారణంగా తాను తీసే సినిమాలో కొన్ని విలువ‌లు ఉండాల‌ని కోరుకుంటానని, అందుకే తన చిత్రాల్లో ఆల్కహాల్‌ సీన్లు దాదాపుగా ఉండకుండా చూస్తానని వ్యాఖ్యానించాడట. 

అందుకే తమిళ 'కత్తి' చిత్రంలో కనీసం విలన్ కూడా ఆల్క‌హాల్ తీసుకోడు. కేవ‌లం టీ, కాఫీలను మాత్ర‌మే హీరోలు, విలన్లు సేవిస్తుంటారు. కానీ, తెలుగు 'ఖైదీ'లో మాత్రం ఏకంగా హీరోయే లిక్కర్‌ సీన్లు చేయడం ఆయ‌న‌కు నచ్చలేదట. దీంతో పాటు క‌మెడియ‌న్‌ అలీతో సినిమాలో ఆడవేషం వేయించిన తీసిన‌ కామెడీ కూడా ఆయనకు అసంతృప్తి కలిగించినట్టు తన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించినట్టు సమాచారం. 

Friday, January 13, 2017

శవయాత్రలో "బికినీ"లతో డ్యాన్సు !

సంప్రదాయాలు రకరకాలు. పుట్టినరోజు వేడుకలకు సహజంగా అందరూ ఎంతో సంతోషంగా జరుపుకుంటూ ఉంటారు. ఐతే మరణం సంభవిస్తే మాత్రం ఇంటిల్లపాదీ అంతా శోకంలో మునిగిపోతారు. ఐతే కొన్నిచోట్ల ఇందుకు భిన్నంగా కనబడుతుంది. తమిళనాడులో చనిపోయినవారికి పెద్దపెట్టున మేళం వాయిస్తూ శవం ముందు చిందులు వేస్తూ ఊరేగింపు చేస్తారు. ఇలాంటిదే తైవాన్లోనూ జరిగింది. 

 కౌన్సిలర్‌గా పనిచేసిన తంగ్ హ్సింగ్ మరణించారు. ఐతే మరణించేముందు ఆయన తన చివరి కోరిక ఒకటి చెప్పారట. అదేమిటంటే... తన మరణం కూడా పుట్టినరోజులా జరుపుకోవాలనీ, అంతా సంతోషంగా తన శవాన్ని తీసుకెళ్లాలని కోరుకున్నారట. అంతేకాదు... తన శవయాత్రలో కనీసం 50 మంది అమ్మాయిలు బికినీలు ధరించి డ్యాన్సు చేస్తూ ఉండాలని కోరుకున్నారట. 

 ఆయన గత డిసెంబరులో చనిపోయారు. దాంతో ఆయన కోరుకున్నట్లుగా శవ యాత్రలో 50 మంది అమ్మాయిలు బికినీలు ధరించి వాహనాల పైకి ఎక్కి నాట్యం చేశారు. అంతా బికినీలతో అలా డ్యాన్సులేస్తుంటే రోడ్లపై వెళ్లేవారు వారి ఫోటోలను తీసుకునేందుకు ఎగబడ్డారట. దాంతో శవయాత్ర కాస్త వినోదయాత్రలా మారిపోయింది.

Wednesday, January 11, 2017

నిమ్మకాయను నాలుగు భాగాలుగా కోసి పడక గదిలో ఉంచితే ?

సాధారణంగా నిమ్మకాయ… ప్రతి ఇంటికి ఖచ్చితంగా ఉపయోగపడే పండు. సిట్రస్ జాతికి చెందిన ఈ నిమ్మపండులోఎన్నో రకాల పోషకాలు, విటమిన్లు ఉంటాయి. నిమ్మకాయ ఆరోగ్యాన్ని ఎంతో మెరుగుపరుస్తుంది. నిమ్మకాయల తాజా సువాసన ఆరోగ్యానికి మంచిది. నిమ్మకాయ యాంటిసెప్టిక్, యాంటి బాక్టీరియల్‌గా కూడా పని చేస్తుంది. అలాంట నిమ్మకాయను నాలుగు భాగాలుగా కోసి పడక గదిలో ఉంచడం వల్ల ఏం జరుగుతుందో పరిశీలిద్ధాం. 

ఒక నిమ్మకాయను తీసుకుని దాన్ని నాలుగు భాగాలుగా కత్తిరించి ఒక పాత్రలో పెట్టి పడక గదిలో ఉంచాలి. ఇలా ఉంచడం వల్ల అది సువాసన వెదజల్లుతుంది. మనం ఉపయోగించే రూమ్ ఫ్రెష్‌నర్స్ కంటే నిమ్మకాయలు ఎంతో ఉపయోగమైనది. 

నిమ్మ సువాసనతో కూడిన గాలి పీల్చుతుంది. దీనివల్ల శ్వాస తాజాగా ఉంటుంది. ఉదయం నిద్ర లేచే సమయానికి గొంతుతో పాటు.. మెదడు తాజాగా ఉంటాయి. ఆస్తమా, జలుబుతో బాధపడుతున్నవారు కూడా ఉపశమనం పొందవచ్చు. 

ఒక బౌల్‌లో నిమ్మకాయలను ఉంచి ముఖానికి దగ్గరగా పెట్టి ఆ గాలి పీలిస్తే ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి. ఇది కాఫీ, ఎనర్జీ డ్రింకుల కంటే ఎంతో శక్తినిస్తుంది. నిమ్మకాయల తాజా సువాసన ఊపిరితిత్తులను శుభ్రపరిచి శ్వాసలో ఇబ్బంది లేకుండా చేస్తుంది. 

Monday, January 9, 2017

అర్చనను పడక సుఖం ఇవ్వమని కోరిన తెలుగు హీరో ఎవరు?

ప్రస్తుత తెలుగు చిత్ర పరిశ్రమలో ఓ అంశంపై విస్తృతంగా చర్చ సాగుతోంది. ఫిల్మ్ నగర్ అంతటా ఇదే అంశం హాట్‌టాపిక్‌గా మారింది. నటి అర్చనకు సినిమా అవకాశం కల్పించినందుకు ప్రతిగా పడక సుఖం ఇవ్వమని అడిగిన ఆ టాలీవుడ్ హీరో ఎవరన్న అంశంపై ఇపుడు రకరకాలైన చర్చ సాగుతోంది.

నిజానికి వెండితెర వెనుక అనేక విషాద సంఘటనలు జరుగుతున్నాయన్నది బహిరంగ రహస్యం. అయితే, ఇవి ఇటీవలి కాలంలో బయటపడుతున్నాయి. తాజాగా హీరోయిన్‌ అర్చన కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించింది. ఓ యూట్యూబ్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో దీన్ని బయటపెట్టింది. తన సినిమాలో ఆమెకి ఛాన్స్ ఇచ్చిన ఓ నటుడు.. షూటింగ్‌ పూర్తయిన తర్వాత.. నీకు అవకాశం ఇచ్చాను.. నాకేమిస్తావ్‌ అని అడిగాడని, ఆ సమయంలో నాకేం చెప్పాలో తెలియలేదంటూ కంటతడి పెట్టింది.

 వెంటనే.. మీకు ఇచ్చేంతదాన్ని కాదని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయానని, ఆ సినిమాలో తన రోల్‌ని చాలావరకు కట్‌ చేశారని మనసులోని వేదనను బయటపెట్టింది. ఇక అవార్డుల ఫంక్షన్‌లో ఓ అవార్డు ఇవ్వడానికి ఓ నటుడితో కలిసి వేదిక మీదకు తాను వెళ్లాలని నిర్వాహకులు చెప్పారని, చివరి నిమిషంలో ఆ హీరో తనతో కలిసి వేదిక మీదకు రావడానికి ఇష్టపడలేదని చెప్పుకొచ్చింది. ఈ క్రమంలో హీరోకి తోడుగా మరో హీరోయిన్‌ను పంపించారని తెలిపింది అర్చన. ఇంతకీ ఆ హీరో ఎవరంటూ సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు.

అయితే, ఇపుడు అర్చన చేసిన ఆరోపణలపై చర్చ సాగుతోంది. ఆమె అవకాశాలు లేక కష్టాల్లో ఉన్నపుడు... సినీ ఛాన్సులిప్పించిన హీరో ఎవరు.. అలాగే, అవార్డుల ఫంక్షన్‌లో ఆమెతో వేదిక పంచుకునేందుకు నిరాకరించిన నటుడు ఎవరన్న అంశంపై ఇపుడు సినీ ప్రముఖులు ఆరా తీస్తున్నారు. 


Saturday, January 7, 2017

"ఆరోగ్యం"గా ఉండాలంటే ?

ఆరోగ్యంగా ఉండాలంటే జీవన శైలిని పాటిస్తూ పోషకాహారం తీసుకుంటే సరిపోతుంది.

 రోజుకు మూడు గ్లాసుల కాఫీకంటే ఎక్కువగా తీసుకోవద్దు.

 మద్యం సేవించే అలవాటుంటే.. రోజుకి ఒక్క గ్లాస్ వైన్‌తో సరిపెట్టేయాలి.

 వైట్ రైస్‌కి, వైట్ బ్రడ్‌కి, పంచదారకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. 

రోజూ నాలుగు రంగులకు చెందిన పండ్లు, కూరగాయలు తినడం మంచిది. టొమాటోలు తినడం కూడా చాలా మంచిది.


 ఎరుపు ద్రాక్షలు, డార్క్ చాక్లెట్లు, ఉల్లిపాయలు, వాల్ నట్స్ ఆరోగ్యానికి మంచిది.

 చేపలు వారానికి రెండు సార్లు తినాలి. అందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి, మీ చర్మ సంరక్షణకు చాలా మంచిది.

 అలాగే మీ జీవన శైలిని కొంత మార్చుకోండి. రోజుకు కనీసం ఏడు నుండి ఎనిమిది గంటలు నిద్రపోవడం మంచిది. 

పొగతాగే అలవాటుంటే మానుకోవాలి.

 బయిటనుండి వచ్చాక సోప్‌తో చేతులు శుభ్రం చేసుకోండి. ప్రమాదకర‌ బ్యాక్టీరీయా నుండి రక్షణ ఉంటుంది.

 మానసిక ఒత్తిడి నుండి వీలైనంతగా దూరంగా ఉండంది. కోపాన్ని అధిగమించే పద్దతులని అలవాటు చేసుకోండి. వీలైతే దానికోసం ఓ పెంపుడు జంతువును పెంచుకోండి. నవ్వే సందర్భం వస్తే వీలైనంత ఎక్కువ సేపు నవ్వడానికి ప్రయత్నించండి.

పుస్తకాలు చదవడం, నాటకాలు, సినిమాలు చూడడం, క్రాస్ వర్డ్ పజిల్స్ పూర్తి చేయ్యడం అలవాటు చేసుకోండి. దాని వల్ల ఉల్లాసంగా ఉండటమే కాకుండా మీజ్ఞాపక శక్తి మెరుగవుతుంది.

 విటమిన్ టాబ్లెట్లు, క్యాల్షియం సప్లిమెంట్స్ తీసుకోవటం మరచిపోవద్దని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.


Thursday, January 5, 2017

"జీలకర్ర"లో ఔషద గుణాలెన్నో !

జీలకర్ర ఎలర్జీ వ్యాధులకి మంచి ఔషధం. జీలకర్రను కషాయంగా కాచి తాగితే గుండెనొప్పులు రాకుండా అరికడుతుంది. అంతేకాదు బిపిని, షుగర్‌ని నియంత్రణలో ఉంచుతుంది. కడుపులో నులిపురుగులు నివారణకు జీలకర్ర ఎక్కువగా తీసుకోవచ్చు.జీలకర్ర కడుపుకి సంబంధించిన అన్ని వ్యాధులను తగ్గిస్తుంది. అజీర్ణంతో బాధపడేవారు. వికారంగా ఉన్నప్పుడు అరగక పుల్లని త్రేన్పులతో బాధపడేవారు జీలకర్రను నములుతూ రసం మింగితే వెంటనే ఉపశమనం కలుగుంది.

 స్త్రీ గర్భాశయాన్ని శుద్ధి చేసి అందులో సమస్త దోషాలను హరించి గర్భసంచిని బలసంపన్నంగా ఉంచే శక్తి జీలకర్రకి కలదు.

మొలలతో బాధపడేవారు జీలకర్ర, పసుపుకొమ్ములు సమానంగా కలిపి మెత్తగా దంచి కుంకుడు గింజంత మాత్రలు చేసుకుని రోజూ మూడుపూటలా రెండు మాత్రలు చొప్పున వాడితే మొలల బాధ తగ్గుతుంది. 

జీలకర్ర, బెల్లం కలుపుకొని చిన్న చిన్న ఉండలుగా కట్టుకుని ఉదయం, రాత్రి తింటే వీర్యపుష్టి కలుగుతుంది. 

Tuesday, January 3, 2017

"పేపర్ కటింగ్" తో అద్భుత కళాఖండాలు!


ఈ బొమ్మలు చేసిన ఆర్టిస్ట్  పేరు "PIPPA DYRLAGA"

Monday, January 2, 2017

"శివాలయంలో ప్ర‌ద‌క్షిణ‌లు" ఎలా చేయాలో తెలుసా ?

దేవాల‌యానికి మాన‌వ దేహానికి అవినాభావ సంబంధం ఉంది. దేవాల‌యానికి వెళ్తే మ‌న‌స్సుకు ప్ర‌శాంత‌త క‌ల‌గ‌డ‌మే కాదు, ఆ ప‌రిస‌రాల్లో ఉండే పాజిటివ్ శ‌క్తి మ‌న‌లోకి ప్ర‌వేశిస్తుంది. దీంతో కొత్త ఉత్సాహం వ‌స్తుంది. ఏ దేవాలయానికి వెళ్లినా దైవాన్ని ద‌ర్శించుకునే ముందు గుడి చుట్టూ ప్ర‌ద‌క్షిణ‌లు చేస్తారు. కొంద‌రు త‌మ వీలునుబ‌ట్టి ఎక్కువ ప్ర‌ద‌క్షిణ‌లు చేస్తే కొంద‌రు 3 ప్ర‌ద‌క్షిణ‌లే చాల‌ని చెప్పి అనంత‌రం దైవద‌ర్శ‌నం కోసం వెళ్తారు. ఈ క్ర‌మంలో వేరే ఏ దేవుడి గుడికైనా వెళ్లిన‌ప్పుడు భ‌క్తులు అలా త‌మ వీలును బ‌ట్టి ప్ర‌ద‌క్షిణ‌లు చేయ‌వ‌చ్చు, కానీ శివుడి గుడికి వెళ్లిన‌ప్ప‌డు ఒక క్ర‌మ ప‌ద్ధ‌తిలోనే ప్ర‌ద‌క్షిణ‌లు చేయాల‌ట‌. గ‌ర్భ గుడిలో ఉన్న శివుడికి ఎదురుగా నంది ఉంటుంది కదా. ప‌క్క‌నే లింగాన్ని అభిషేకించిన జ‌లం వెళ్తూ ఉంటుంది. దాని కిందే చండీశ్వ‌రుడు కొలువై ఉంటాడు. శివాలయంలోకి వెళ్ల‌గానే నేరుగా శివుని గ‌ర్భ‌గుడి చుట్టూ ప్ర‌ద‌క్షిణ‌లు చేయ‌కూడ‌ద‌ట‌. ముందుగా నందీశ్వ‌రుని వ‌ద్ద ప్ర‌ద‌క్షిణ ప్రారంభించి చండీశ్వ‌రుని వ‌ద్ద‌కు వెళ్లి ఆయ‌న్ను ద‌ర్శించుకుని మ‌ళ్లీ వెన‌క్కి రావాలి. 

ఒకసారి చండీశ్వ‌రుని ద‌ర్శించుకుని వెన‌క్కి వ‌చ్చి నందీశ్వ‌రుని వ‌ద్ద ఆగి అటు నుంచి గర్భ‌గుడి మీదుగా లింగాన్ని అభిషేకించే జ‌లం వ‌ద్ద‌కు రావాలి. అక్క‌డి నుంచి వెన‌క్కి తిరిగి నందీశ్వ‌రుని వ‌ద్ద‌కు వ‌చ్చి ప్ర‌ద‌క్షిణ పూర్తి చేయాలి. ఇలా 3 సార్లు చేస్తే చాలు దాంతో ఎంతో ఫ‌లితం క‌లుగుతుంద‌ట‌.

సాధార‌ణంగా భ‌క్తులు దేవాల‌యాల్లో 3 సార్లు ప్ర‌ద‌క్షిణ‌లు చేస్తారు. ఇందులో ఒక‌టి గుడిలో దేవుడికి, రెండోది పూజారికి, మూడోది గుడి క‌ట్టిన విశ్వ‌క‌ర్మ‌కు.

 కానీ పైన చెప్పిన విధంగా శివాల‌యంలో ప్ర‌ద‌క్షిణ చేస్తే అది 10 వేల ప్ర‌ద‌క్షిణ‌ల‌తో స‌మాన‌మ‌ట‌. దీని గురించి లింగ పురాణంలో చెప్పారు. అయితే పైన చెప్పిన‌ట్టుగా కాక శివుని గ‌ర్భ‌గుడి చుట్టూ గుండ్రంగా ప్ర‌ద‌క్షిణ చేయ‌కూడ‌ద‌ట‌. ఎందుకంటే లింగాన్ని అభిషేకించిన జ‌లం వెళ్లే దారి వ‌ద్ద ప్ర‌మ‌ధ గ‌ణాలు కొలువై ఉంటాయ‌ట‌. వాటిని దాటి ప్ర‌ద‌క్షిణ చేయ‌కూడ‌ద‌ట‌. అలా చేస్తే త‌ప్పు చేసిన‌ట్టు అవుతుంద‌ట‌. కొద్దిగా ప్ర‌య‌త్నిస్తే పైన చెప్పిన‌ట్టుగా ప్ర‌ద‌క్షిణ చేయ‌డం సుల‌భ‌మేన‌ని పండితులు చెబుతున్నారు.