CSS Drop Down Menu

Saturday, June 3, 2017

మన ఇల్లు సుఖసంతోషాలు, సిరిసంపదలతో ఉండాలంటే ?

తమ ఇంట్లో నిత్యం లక్ష్మీకళ తాండవించాలని, ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో తులతూగాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఎన్నో పూజలు, వ్రతాలు చేసినా దక్కని ఫలితం కేవలం కొన్ని చిన్న చిట్కాలతో ఎంతో తేలికగా, సులభమైన పద్దతుల్లో పొందవచ్చంటే నమ్మగలరా? దీన్ని చదివి, ఆచరించి చూడండి. వంటగదిలోని ఉత్తరం మూలలో లేదా ఈశాన్య మూలలో ఏదో రూపంలో నీరు ఉండేలా చూసుకోండి. నీటి బిందెలైనా, కుళాయిలైనా పెట్టుకోవడం మంచిది.

పడకగదిలో పరుగులెత్తే గుర్రాల బొమ్మలు, సముద్రంలోని పడవల బొమ్మలు అరిష్టం. వాటిని కాకుండా రాధాకృష్ణుల బొమ్మలను పెట్టుకుంటే ఆ ఇంట్లోని దంపతుల మధ్య కుటుంబ కలహాలు తగ్గడంతో పాటు అన్యోన్యత పెరుగుతుంది. 



హాలులోని గోడలకు ఎల్లప్పుడూ లేతరంగులు, కాంతివంతమైన రంగులనే ఎంచుకోవాలి. అలాగే హాలులో పంచముఖ ఆంజనేయస్వామి ఫోటోనైనా, విగ్రహాన్నైనా పెట్టుకుంటే ఇంట్లో గ్రహదోషాలు, అరిష్టాలు, అకాల మృత్యువులు వంటి ఏ దోషం ఉండదు. 



సాధారణంగా చాలామంది పిల్లల గదిని వారి అభిరుచి మేరకు కార్టూన్లతో నింపేస్తుంటారు. అవి పిల్లలను ఎంతగా అలరించినా చదువుకునే వయస్సులోని పిల్లల గదిలో సరస్వతిదేవి ఫోటో పెట్టుకోవడం మంచిది. అదే ఒకవేళ చదువు పూర్తి చేసిన పిల్లలైన పక్షంలో పచ్చని గడ్డి లేదా సువాసనలు వెదజల్లే పువ్వుల ఫోటోని పెట్టుకోవాలి.

0 comments:

Post a Comment