సాధారణంగా రుణం కావాలంటే ఏదేని సెక్యూరిటీ (ష్యూరిటీ) ఇవ్వాల్సి ఉంటుంది. అది ఉద్యోగి పూచీకత్తు కావొచ్చు లేదా ఆస్తి తనాఖా కావొచ్చు. కానీ, ఆ కంపెనీ మాత్రం రుణగ్రహీతల నుంచి సెక్యూరిటీగా వారి నగ్న ఫోటోలను ష్యూరిటీగా కోరుతోంది. ఇంతకీ ఈ సంస్థ పేరు ఏంటో తెలుసా? రెకాన్ ఎంటర్‌ప్రైజెస్. మహారాష్ట్రలోని థాణె కేంద్రంగా బీపీవో సేవలు అందిస్తోంది.
ఈ సంస్థపై అనేక ఫిర్యాదులు వెల్లువెత్తడంతో రంగంలోకి దిగిన అధికారులు ఆ సంస్థ కార్యాలయంపై గడచిన రెండు రోజులుగా దాడులు నిర్వహించి పలు పత్రాలు స్వాధీనం చేసుకుని షాక్ కు గురయ్యారు. రెకాన్ ఎంటర్‌ప్రైజెస్ సంస్థ రుణాలు ఇస్తుంటుంది. అయితే 1,000 నుంచి 5000 డాలర్ల మధ్య వివిధ రకాల రుణాలిప్పించేందుకు 20 నుంచి 30 శాతం కమీషన్ తీసుకునేందుకు ఆ సంస్థ ప్రతినిధులు ముందుగానే ఒప్పందం చేసుకుంటారు.
అంతేకాకుండా, లోన్‌కు ష్యూరిటీ అంటూ పలు పత్రాలతో పాటు నగ్న ఫోటోలు, వీడియోలు పంపాలని వినియోగదారులను డిమాండ్ చేశారు. అయితే రుణం అవసరమైన పలువురు వినియోగదారులు అలా ఫోటోలు, వీడియోలు పంపడంతో తనిఖీలు నిర్వహించిన అధికారులు వాటిని చూసి, షాక్ తిన్నారు. దీనిని తీవ్రంగా పరిగణించిన పోలీసులు, ఆ సంస్థపై కేసులు నమోదు చేసి మరింత లోతుగా దర్యాప్తు చేపట్టారు.
Good Post
ReplyDeleteబైబిల్లో దేవుడు యేసా? యెహోవా?, యేసు దేవుడా? క్రీస్తా?, దేవుడు ఒక్కడా త్రిత్వమా? ఆరాధనకు అర్హుడు యేసా? యెహోవా? పౌలు దృష్టిలో దేవుడు ఎవరు యేసు ఎవరు? వగైరా ప్రశ్నలకు సమాధానంగా ఈ వెబ్ సైట్ చదువగలరు