సాధారణంగా మన వంటగదిలో ఉండే ఆహారాపదార్థాలేన్నో మనకు తెలియకుండానే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. అలాంటి ఆహార పదార్థాల్లో శెనగలు ఒకటి. శెనగపిండిని మనం ఎన్ని రకాల వంటల్లో ఉపయోగిస్తామో తెలుసు కదా.. మిర్చి బజ్జీలు మొదలుకొని పకోడి, మంచూరియా వంటి అనేక వంటల్లో ఉపయోగిస్తుంటాము. అయితే ఇవన్నీ నూనెతో వండే పదార్థాలు. వీటి వల్ల మనకు ఎలాంటి ప్రయోజనాలుండవు,. అదనంగా మరికొంత కొవ్వు చేరడం తప్ప. శెనగపిండితో చేసిన వంటల సంగతి పక్కన పెడితే, శెనగలను పొట్టు తీయకుండా డైరెక్ట్‌గా అలాగే ఉడకబెట్టో, నానబెట్టో, మొలకల రూపంలోనో తింటే మనకు ఎన్నో రకాల ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయి. ఇక బాదం పప్పు అంటే అందరికి తెలిసిందే, డ్రై నట్స్ లో అత్యధిక పోషక విలువలు కలిగినది బాదం. దీనికి సమాన పోషక విలువలు శెనగల్లో కూడా ఉన్నాయి. వును మీరు విన్నది నిజమే. ఈ క్రమంలో వారానికి కనీసం రెండు, మూడు సార్లైనా శెనగలను పైన చెప్పిన విధంగా ఏదో ఒక రూపంలో తీసుకుంటే దాంతో మనకు ఎన్నో లాభాలు కలుగుతాయి. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
శెనగల్లో పీచు పదార్థం అధికంగా ఉంటుంది. ఇది శరీరంలో కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. హార్ట్ సమస్యలను నివారిస్తుంది.
మాంసాహారం తినలేని వారికి శెనగలు ఒక వరమని చెప్పొచ్చు. ఎందుకంటే మాంసాహారంలో ఉండే ప్రోటీన్లన్నీ శెనగల్లో పుష్కలంగా ఉన్నాయి.
శెనగల్లో పొటాషియం, మెగ్నీషియం, క్యాల్షియం, వంటి ఎన్నో రకాల మినిరల్స్ ఉన్నాయి. ఇవి బిపిని కంట్రోల్ చేస్తాయి.
ఇవి రక్తం కల్తీ లేకుండా చేస్తుంది. అనీమియా వారికి ఇది చాలా మంచిది.
శెనగల్లో అమైనో యాసిడ్లు, ట్రిప్టోఫాన్, సెరొటోనిన్ వంటి ఉపయోగకరమైన పోషకాలు సమృద్ధిగా ఉంటాయి.ఇవి మంచిగా నిద్రపట్టడానికి సహాయపడుతాయి. దాంతో నిద్రలేమి సమస్య దూరమవుతుంది. స్ట్రెస్, ఆందోళ వంటి సమస్యలను దూరం అవుతాయి.
శెనగల్లో ఆల్ఫా లినోలినిక్ యాసిడ్, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్ తగ్గించి, హార్ట్ హెల్త్ ను మెరుగుపరుస్తాయి.
శెనగలోలో ఐరన్, ప్రోటీన్లు, మినిరల్స్ సమృద్ధిగా ఉండడం వల్ల శెనగలు శరీరానికి మంచి శక్తిని ఇస్తాయి.
శెనగల్లో ఫాస్పరస్ అధికంగా ఉండటం వల్ల, శరీరంలో ఉండే ఉప్పును బయటకు పంపుతుంది. దాంతో కిడ్నీల పనితీరు మెరుగుపడుతుంది.
పచ్చకామెర్లు ఉన్నవారు శెనగలు తింటే త్వరగా కోలుకుంటారు.
పాలలో ఉండే కాల్షియంకు దాదాపు సమానమైన కాల్షియం శెనగల్లో మనకు లభిస్తుంది. ఈ క్యాల్షియంతో ఎముకలకు పుష్టి కలుగుతుంది.
0 comments:
Post a Comment