జాజికాయ మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. కామవాంఛని పెంచుతుంది. వీర్యకణాల ఉత్పత్తిని వృద్ధి చేస్తుంది. జాజికాయను కొద్దిపాటి మంటమీద నేతిలో వేయించి పొడిచేసి ఉంచుకోండి. ఈ చూర్ణాన్ని 5 గ్రాముల మోతాదుగా ఉదయం, సాయంత్రం గోరువెచ్చని ఆవుపాలతో కలిపి తాగాలి. ఇది నపుంసకత్వాన్ని తరిమి కొడుతుంది. నరాల బలహీనతని పోగొడుతుంది. వీర్యకణాల సంఖ్యను పెంచుతుంది. జాజికాయ కేవలం ఆరోగ్యానికే కాదు.. అందాన్ని ద్విగుణీకృతం చేసుకోవడంలోనూ ఉపయోగపడుతుంది.
కొంచెం జాజికాయ పొడిని తీసుకుని దానికి నీళ్లు లేదా తేనె కలిపి పేస్ట్‌లాగా తయారు చేయాలి. దీన్ని ముఖానికి స్క్రబ్‌లా రాసుకోవాలి. ఇలా తరచూ చేస్తుంటే కొన్ని రోజులకు చర్మం కాంతివంతమవడంతో పాటు చర్మంపై ఉండే మచ్చలు, మొటిమలు తొలగిపోతాయి. జాజికాయను పొడిగొట్టి, అతి స్వల్ప పరిమాణంలో వాడినట్లయితే, కొన్ని అనారోగ్యాలకు మంచి ఔషధంగా పనిచేస్తుంది.
కొంచెం జాజికాయ పొడిని తీసుకుని దానికి నీళ్లు లేదా తేనె కలిపి పేస్ట్‌లాగా తయారు చేయాలి. దీన్ని ముఖానికి స్క్రబ్‌లా రాసుకోవాలి. ఇలా తరచూ చేస్తుంటే కొన్ని రోజులకు చర్మం కాంతివంతమవడంతో పాటు చర్మంపై ఉండే మచ్చలు, మొటిమలు తొలగిపోతాయి. జాజికాయను పొడిగొట్టి, అతి స్వల్ప పరిమాణంలో వాడినట్లయితే, కొన్ని అనారోగ్యాలకు మంచి ఔషధంగా పనిచేస్తుంది.
తాంబూలంలో జాజికాయను వేసుకుని సేవిస్తే నోటి దుర్వాసనను పోగొడుతుంది. పంటిమీద నలుపునూ, గారను తొలగించి, పళ్ళు మెరిసేలా చేస్తుంది. పాలలో జాజికాయ పొడిని కలుపుని తాగితే గుండెల్లో నొప్పి, దడ తగ్గుతాయి. గోరువెచ్చని పాలల్లో, చాలా స్వల్ప పరిమాణంలో ఈ పొడిని కలుపుకుని తాగితే చర్మ కాంతి పెరగడమే కాకుండా, చర్మం ముడతలు పడవు. అధిక దాహాన్ని అరికడుతుంది. అలసటవల్ల వచ్చిన జ్వరాన్ని తగ్గిస్తుంది. మనస్సులోని ఆవేశాన్ని, ఆగ్రహాన్ని, ఉద్రేకాన్ని తగ్గించి మనస్సు ప్రశాంతంగా ఉండేలా చేస్తుంది. మలేరియా జ్వరానికి ఉపశమనాన్ని కలిగిస్తుంది. దగ్గు, జలుబు, కఫానికి ఔషధంగా పనిచేస్తుంది.
ఈ కాయలో లభించే 'మిరిస్టిసిన్' అనే పదార్థం మెదడు చురుగ్గా పనిచేసేందుకు సహకరిస్తుంది. అంతేకాక అల్జీమర్స్ తాలూకు లక్షణాలను ఆలస్యం చేయడానికి జాజికాయ ఉపకరిస్తుంది. వ్యర్థ పదార్థాలను శరీరం నుంచి పూర్తిగా తొలగించే శక్తి జాజికాయకు ఉంటుంది. అలాగే ఇది మూత్రపిండాల్లో ఏర్పడిన రాళ్లను కరిగించడంతో పాటు ఈ రెండు వ్యవస్థల పనితీరును మెరుగుపరుస్తుంది. మోతాదుకు మించి జాజికాయను ఉపయోగించడం వల్ల జీర్ణ సంబంధ సమస్యలతో పాటు ఏకాగ్రత కోల్పోవడం, ఎక్కువ చెమట పట్టడం.. వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. కాబట్టి జాజికాయ వాడకం విషయంలో కాస్త జాగ్రత్త వహించడం ముఖ్యం. గర్భవతులు దీన్ని ఉపయోగించకూడదు.
0 comments:
Post a Comment