మనకు తెలీకుండానే మనల్నే ప్రపంచబ్యాంకు వద్ద తాకట్టు పెడుతున్నాయి ప్రభుత్వాలు, మన ప్రమేయం లేకుండా మనల్ని రుణ గ్రస్తుల్ని చేస్తున్నాయి. మనకు తెలీకుండానే మనమీద దేశం చేసిన అప్పు 60 లక్షల 19 వేల కోట్లు. ప్రస్తుతం మన దేశ జనాభా 2011 లెక్కల ప్రకారం 129.5 కోట్లు.
ఈ దామాషా ప్రకారం ప్రతి భారతీయుడి తల మీద రూ. 46,485 అప్పు వుందన్నమాట ఇది లేటెస్ట్ ఫిగర్స్. ఐతే, 2016 మార్చి 31 నాటికి తలసరి అప్పు రూ.53,796 గా నమోదైనట్టు ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ శుక్రవారం పార్లమెంట్‌లో వెల్లడించారు. దీనిపై ఏటా చెల్లిస్తూ వస్తున్న వడ్డీ దాదాపు రూ. నాలుగు లక్షల కోట్లు. వృద్ధి సాధించడానికి ధన వ్యయం పెంచడంవల్లే అప్పు పెరిగినట్లు కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ లోక్‌సభకు తెలిపారు.
0 comments:
Post a Comment