CSS Drop Down Menu

Thursday, March 24, 2016

త్వరలో మూత పడనున్న ఏటీఎంలు ?

క్రెడిట్ కార్డు లూ, డెబిట్ కార్డ్ లూ ఒచ్చిన తరవాత ఆన్లైన్ పేమెంట్ విధానం తో పాటు రకరకాల పేమెంట్ విధానాలు మన ముంగిట్లో వాలాయి. క్యాష్ కార్డ్ ల రూపం ఒచ్చిన తరవాత నగదు రూపం లో చెల్లింపులు చాలా తక్కువగా చేస్తున్నాం అందరం. నగదు రహిత సమాజం నెమ్మది నెమ్మదిగా రూపు దిద్దుకుంటోంది. ఇప్పటికే చాలా దేశాలలో ఈ విధంగా నగదు చెల్లింపు పూర్తిగా దూరం అయ్యింది.

  కొందరు విశ్లేషకులు కొన్ని దేశాల పరిశీలన చేసిన తరవాత కొన్నాళ్ళలో నోట్లూ, నాణాలూ కనపడవు అంటున్నారు. 100 శాతం నగదు రహిత దేశాలుగా మారడానికి కొన్ని దేశాలు చాలా ముందంజ లో ఉన్నాయి . వీధికొక ఏటీఎం ఉండగా అవన్నీ త్వరలో మూత పడతాయి అంటున్నారు. బెల్జియం లాంటి దేశం లో ప్రస్తుతం చెల్లింపులు నాన్ క్యాష్ లో 93% వరకూ సాగుతున్నాయి. దేశం మొత్తం మీద ఎనభై ఆరు శాతం మందికి డెబిట్ కార్డు ఉంది. ఫ్రాన్స్ లో 92%  నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్ లే జరుగుతున్నాయి. మూడు వేల యూరోలు దాటితే నగదు లో చెల్లించ కూడదు అని గట్టి చట్టాలు ఉన్నాయి. స్వీడన్ , ఆస్ట్రేలియా , నెదర్ లాండ్స్ , అమెరికా , జర్మనే, దక్షణ కొరియా ఇలా చాలా చోట్ల నగదు లేని సమాజానికి వారు వెళుతున్నారు. 

0 comments:

Post a Comment