CSS Drop Down Menu

Friday, March 18, 2016

చైనాలో కొత్త ట్రెండ్‌ ? A4 నడుము !

ఇప్పటివరకూ జీరో సైజు నడుముతో తిండీ తిప్పలు మానేసి ప్రాణాల మీదకు తెచ్చుకున్న సందర్భాలు చూశాము. ఇప్పడు చైనాలో సరికొత్త పోకడ మొదలైంది. A4 నడుము పేరుతో కొందరు అమ్మాయిలు, అక్కడి సోషల్‌ మీడియాలో హల్‌చల్ సృష్టిస్తున్నారు. సాధారణంగా మనం ప్రింట్ఔట్ల కోసం వాడే కాగితాన్ని A4 కాగితం అంటాము. దీని వెడల్పు 10 అంగుళాలకంటే తక్కువే ఉంటుంది. ఈ కాగితంతో సమానమైన నడుముని సాధించామంటూ, ఓ A4 కాగితాన్ని ముందుంచుకుని అక్కడి యువతులు తెగ ఫొటోలు దిగుతున్నారట. దిగడమే కాదు, మన ట్విట్టర్‌లాగానే చైనాలో ప్రజాదరణ పొందిన ‘సైనా వీబో’ అనే సోషల్‌ మీడియా ద్వారా ప్రపంచానికి తమ ఘనతను చాటుకుంటున్నారట. చైనాలో రోజురోజుకీ వేలంవెర్రిగా పెరిగిపోతున్నా ఈ పోకడ చూసి అక్కడి పెద్దలు, వైద్యులు తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారు. ఇంత సన్నటి నడుము మున్ముందు తీవ్రమైన అనారోగ్య సమస్యలకి దారితీస్తుందనీ, ఒకోసారి ప్రాణాల మీదకే తెస్తుందనీ హెచ్చరిస్తున్నారు. అయినా పెద్దోళ్ల మాటని వినేదెవరు!


1 comment:


  1. యే ఫోర్ నడుమందపు పి
    ల్లా ఫా రెవరూ జిలేబి లాగున్నావే
    కాఫరు నిండా డబ్బుల్
    కాఫీ తాగన చటుక్కు కాంటిన్ రావే !

    ReplyDelete