వందల కోట్లు ఆస్తులున్న సల్మాన్ ఖాన్ రెండువేల రూపాయలు లేవా? అప్పు
చేయాల్సిన పరిస్థితి ఎందుకొంచ్చింది? అని ఆలోచిస్తున్నారా….? వివరాల్లోకి
వెళ్దాం. సల్మాన్ దగ్గర రెండు వేల రూపాయలు లేవు. అందుకే తన బాడీ గార్డ్
దగ్గర అప్పు చేయాల్సి వచ్చిందట.సల్మాన్ స తన స్నేహితులు, కుటుంబ సభ్యులతో
ముంబైలోని బాంద్రా ప్రాంతంలో ఉన్న ఆలివ్ రెస్టారెంట్ కి ఎక్కువగా
వెళ్తుంటాడు.
ఈమధ్యనే అలా
ఓసారి వెళ్ళారు. సాయంత్రం 4.30 ప్రాంతంలో బయటకి వచ్చినప్పుడు రోడ్డుపై
నలుగురు పేద పిల్లలు కనిపించారు. వారికి సాయం చేయాలనీ అనిపించిందట సల్మాన్
కు. తీరా జేబులో డబ్బులు లేవు, సల్మాన్ ఎప్పుడు క్రెడిట్ కార్డ్స్, డెబిట్
కార్డ్స్ మాత్రమే వాడుతాడట. ఎవైన వాటితోనే కొంటూ ఉంటాడు. అందుకే జేబులో
ఎక్కువగా డబ్బులు పెట్టుకొడట.
దాంతో
ఆ పిల్లలకు ఎలాగైనా సాయం చేయాలనే ఆలోచనతో తన బాడీ గార్డ్ దగ్గర రెండు వేల
రూపాయలు తీసుకున్నాడట. నలుగురు పిల్లలకి చెరో 500 ఇచ్చాడు. అలనాటి హీరో
రిషి కపూర్ కూడా ఎక్కువగా ఆలివ్ రెస్టారెంట్ కి వస్తుంటాడు. అతను
రెస్టారెంట్ బయట ఉన్న పేద పిల్లలకు డబ్బులు ఇస్తుంటాడు. ఒక్కోసారి వారి
మంచి ఆహారాన్ని తినిపిస్తాడు.
0 comments:
Post a Comment