నేను సైన్సు పట్టబధ్రుడునైనా నా దృష్టి అంతా
ఉద్యోగం కన్నా వ్యాపారం వైపే ఉండేది.దాంతో కాకినాడ దగ్గర భూమి కొని రొయ్యల
చెరువులు తవ్వించి రొయ్యలపెంపకం చేపట్టడం జరిగింది.దీనిలో వచ్చిన లాభం నుంచి 25శాతం
డబ్బులుతో ఒక సేవాసంస్థను స్థాపించి మంచి మార్కులు వచ్చినా ఆర్ధికభారంతో ఫైచదువులు
ఆపేసిన పిల్లలకు, వైద్యం చేయి౦చుకోలేని పేదవారికి సహాయం చేయాలని మనసులో నిర్ణయం
తీసుకొవడం జరిగింది. రొయ్యలపెంపకం చేపట్టడానికి ముందు నాకు పశుసంవర్ధకశాకలో ఉద్యోగానికీ
ఇంటర్వూ జరగడం ఉద్యోగుల ఎంపికలో అవకతవకలు జరిగాయని గవర్నమెంట్ రద్దుచేయడం
జరిగింది.ఇదంతా జరగడానికి సుమారు రెండునెలలు పట్టింది.అప్పుడు రొయ్యలపెంపకం
చేపట్టడం జరిగింది.ఆంధ్రా అంతటా ఒకేసారి వ్యాపించిన వైరస్ తో చెరువులు దెబ్బతినడము
ఆవెంటనే క్రాప్ హాలిడే ప్రకటించడం,ఆతర్వాత నాకు వెటర్నరి డిపార్టుమెంటులో ఉద్యోగం
రావడం జరిగింది.ఇంతకీ నేను చెప్పేదేమిటంటే ఉద్యోగం వద్దు వ్యాపారమే ముద్దు
అనుకుంటున్ననాకు నువ్వేమి మనుష్యులకు సేవ చేయనక్కరలేదు దానికి చాలా మంది ఉన్నారు
గాని నోరులేని మూగజీవాలకు సేవ చెయ్యమని పశుసంవర్ధకశాకలో ఉద్యోగం చేసేటట్టు చేసి
తద్వారా ఎన్నిటికో వైద్యంద్వారా సేవచేసే అదృష్టం కల్పించడం నిజంగా విధి ఆడిన వింత
నాటకం అంటే ఇదేనేమో!
U doing great job andi doctor garu....
ReplyDeleteThanks for your comment.
ReplyDelete