నేను 2000 సంవత్సరంలో పొలమూరు పశువుల ఆసుపత్రిలో పనిచేస్తున్నపుడు జరిగిన
సంఘటన.సత్తి భాస్కరరెడ్డికి చెందిన జెర్సిజాతికి చెందిన 5నెలల 20రోజుల ఆవుదూడ ఎదకు
రాగా OHF జాతి వీర్యమును కృత్రిమగర్బోత్పత్తి చేయగా
అది చూడికట్టి 15నెలలకే కపిలదూడను ప్రసవించడం జరిగింది.సాదారణంగా సంకర జాతికి చెందిన ఆవులను
సక్రమంగా మేపితే 12నెలల నుంచి 18నెలల మధ్య ఎదకు వస్తాయి.అటువంటి ఈ ఆవుదూడ ఎదకు
వచ్చే సమయానికే ఈనడం జరిగి అరుదైన రికార్డ్ నెలకొల్పడం జరిగింది.దీని తల్లికి ఆసుపత్రిలో కృత్రిమగర్బోత్పత్తి చేయగా ఇది పుట్టడం జరిగింది.దీని యజమాని నే
చెప్పిన విధంగా పోషకాహారం మేపడంతో ఈ రికార్డ్ నెలకొల్పడం జరిగింది.
0 comments:
Post a Comment