CSS Drop Down Menu

Tuesday, March 18, 2014

మూగ జీవి చూపిన కృతజ్ఞత

నేను పొలమూరు పశువుల ఆసుపత్రి నందు పని చేస్తున్నపుడు జరిగిన యధార్ద సంఘటన.ఒక రోజు రాత్రి మూడు గంటలకు అదే పనిగా మోగుతున్న కాలింగ్ బెల్ శబ్దానికి "ఇంత అర్ధరాత్రి ఎవర్రా? బాబు" అనుకుంటూ లేచి తలుపు తెరిచే సరికి ఒళ్ళంతా రక్తపు మరకలుతో నిండిన వ్యక్తిని చూసేసరికి ఒళ్ళు ఝళ్ళుమంది వెంటనే ఆ వ్యక్తి "నేనండి అన్నవరాన్ని మా గేదెకి గుడ్లమయ వచ్చింది మీరు వెంటనే రావాలి" అనే సరికి కావలిసిన మందులు తీసుకోని బయలుదేరి గుడ్లమయను లోపలికి నెట్టి గేదెకి ఇంజక్షన్లు చేసి పశువుల పాక నుండి రోడ్ మీదికి వచ్చి ఒళ్ళంతా కడుక్కుని అక్కడ ఉన్న రైతులుతో మాట్లాడుతుండగా జరిగిన విషయాన్ని చెబుతున్నారు ఏమని అంటే "వీడు రాత్రి పన్నెండు గంటలు నుంచి గుడ్లమయ లోపలికి గెంటుతున్నాడు గేదె చనిపోయేలా ఉందని మిమ్మలిని
తీసుకురమ్మని తిడితే" అప్పుడు మీ దగ్గరికి వచ్చాడు అప్పటికే బుధవారం తెల్లవారుజామున ద్వారపూడి  పశువుల సంతకు వెళ్ళే  బేరగాళ్ళంతా అన్నవరం బాగస్వామితో మీ గేదె చనిపాయిందని చెప్పడం జరిగిందట.కారణం ఏమిటంటే  గుడ్లమయ వచ్చిన పశువులలో నూటికి తొంబై శాతం చనిపోతాయి(గుడ్లమయ అంటే పశువు ఈనిన తరువాత కడుపు లోపల ఉన్న గర్బాశయం మొత్తం బయటకు వచ్చేస్తుంది)


  అప్పుడు జరిగిందా సంఘటన.  పశువుల పాక దగ్గర ఉన్న ఆ గేదె రోడ్ మీద ఉన్న మా దగ్గరకు వచ్చి నా ముఖం చూసి నా పాదాలను నాక సాగింది దాంతో అక్కడ ఉన్న రైతులంతా ఆశ్చర్యపోయి "డాక్టర్ గారు దాని ప్రాణాలు పోకుండా కాపాడినందుకు ఈ విధంగా కృతజ్ఞతలు చెబుతుంది" అనే సరికి మనసంతా సంతోషంతో నిండిపోయింది. ఎందుకంటే నేటి కాలంలో సాయం పొందిన సాటి మనుషులే మనం కనపడగానే తల పక్కకు తిప్పుకుని పోతున్న ఈ రోజులలో నోరు లేని ఈ మూగ జీవి తన కృతజ్ఞత ఈ విధంగా చూపే సరికి మనసంతా అదోలా అయిపోయింది.   

      

0 comments:

Post a Comment