CSS Drop Down Menu

Tuesday, March 22, 2016

ప్రైవేట్ ప్లేస్‌లో ఎలా గడిపినా నేరం కాదని బాంబే హై కోర్టు చిత్రమైన తీర్పు !

ప్రైవేట్ ప్లేస్‌లో అసభ్యంగా వ్యవహరిస్తే అది నేరం కాదని బాంబే హై కోర్టు చిత్రమైన తీర్పునిచ్చింది. భారత శిక్షా స్మృతి (ఇండియన్ పీనల్ కోడ్) సెక్షన్ 294 ప్రకారం ఓ అపార్ట్ మెంట్‌లోనో లేదా ఓ వ్యక్తికి చెందిన స్థలంలోనో అసభ్యంగా ప్రవర్తిస్తే అది నేరం కిందకు రాదని న్యాయమూర్తులు ఎన్.హెచ్.పాటిల్, ఎ.ఎం.బాదర్‌లతో కూడిన ధర్మాసనం తీర్పునిచ్చింది.

ముంబై అంధేరీలోని ఓ ఫ్లాట్‌లో 13 మంది వ్యక్తులు కొందరు అమ్మాయిలతో కలిసి మద్యం తాగుతూ చిందులు వేస్తున్నారని ఓ జర్నలిస్టు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు ఆ ఫ్లాట్ మీద దాడి చేసి వారిపై కేసు పెట్టి కస్టడీలోకి తీసుకున్నారు. అయితే ఆ వ్యక్తులు తమ లాయర్ ద్వారా దీనిపై కోర్టుకెక్కారు. ఈ అపార్ట్‌మెంట్ పబ్లిక్ ప్లేస్ కాదని, ప్రైవేట్ ప్లేస్ అని, ఇలాంటి చోట ఎవరైనా తమ ఇష్టం వచ్చినట్టు వ్యవహరించవచ్చని ఆ లాయర్ వాదించాడు. ఈ వాదనను కోర్టు సమర్థిస్తూ కేసును కొట్టివేసింది.

0 comments:

Post a Comment