CSS Drop Down Menu

Thursday, March 3, 2016

"10 రూపాయల"కే అద్దె బైకులు !

ఈ కాలం యువత అనుకున్నదే తడవుగా జరిగిపోవాలని చూస్తారు. లాభామో, నష్టమో ముందుకు నడవాలనేది వారి ఆలోచన. ఆలోచన నుండి పుట్టినదే రాయల్ బ్రదర్స్ సంస్థ. బైకు రైడింగ్ చేయాలనే అభిలాష అందరికీ ఉంటుంది. కాని ఊరి కాని ఊరిలో ఎవరిస్తారు చెప్పండి. అందుకే రాయల్ బ్రదర్స్ అనే ప్రముఖ ద్విచక్ర వాహనాల అద్దెకు ఇచ్చే సంస్థ ముందుకు వచ్చింది. కొత్త నగరాలకు వచ్చినపుడు ఎక్కడికైనా వెళ్లాలనుకుంటే వీరి వెబ్ సైట్‌ను సందర్శించి నచ్చిన బైకును బుక్ చేసుకుని ఎంచక్కా రైడ్‌కు వెళ్లండి. రాయల్ బ్రదర్స్ సంస్థను ఎవరు స్థాపించారు, ఇక్కడే ఏయే బైకులు అద్దెకు ఇస్తారు అనే వివరాలను ఈ  క్రింద  చూడండి. 

బైకులను అద్దెకు ఇవ్వాలనే అలోచనతో వచ్చిన ఆవిష్కరణే ఈ రాయల్ బ్రదర్స్. దీనిని మంజునాథ్ టిఎమ్, అభిషేక్ సి శేఖర్, శ్రీ కృష్ట ఎన్ మరియు గిరీష్ కుమారు ఆర్ అనే నలుగురు యువకులు స్థాపించారు. 

బెంగళూరు కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న వీరు బెంగళూరు, గోవా, మంగళూరు, మణిపాల్, మైసూర్ మరియు ఉడుపి ప్రాంతాలలో తమ సేవలు అందిస్తున్నారు.

 రాయల్ బ్రదర్స్ సంస్థ రాయల్ ఎన్ఫీల్డ్‌లోని అన్ని శ్రేణి బైకుల నుండి హోండా ఆక్టివా వంటి స్కూటర్ల వరకు అద్దె ఇస్తున్నారు.
 
రాయల్ ఎన్ఫీల్డ్‌లోని అన్ని మోడల్స్‌ను ప్రారంభ ధర రూ. 40 నుండి 50 వరకు ప్రతి గంటకు వసూలు చేస్తారు మరియు హోండా ఆక్టివా స్కూటర్ గంటకు అద్దె రూ. 10 లతో ప్రారంభం అవుతుంది.
 
రాయల్ బ్రదర్స్ నుండి మీకు నచ్చిన బైకు లేదా స్కూటర్‌ను గంటకు, రోజుకి, వారానికి మరియు నెల వరకు కూడా అద్దెకు తీసుకోవచ్చు. అయితే బాడుగకు తీసుకునే విధానాన్ని బట్టి అద్దె ధరను నిర్ణయిస్తారు.
 
అయితే పెట్రోల్ బిల్ వినియోగదారులకు చెందినది మరియు వీటితో పాటు హెల్మెట్‌కు రూ. 50, రూ. 500 వరకు రీఫండబుల్ డిపాసిట్ చేయాల్సి ఉంటుంది.
 
దక్షిణ భారత దేశంలో వ్యక్తిగత ద్విచక్రవాహనాల అద్దె కోసం ఆర్‌టిఓ అధికారుల వద్ద రిజిస్ట్రేషన్ చేసుకున్న ఏకైక సంస్థ ఈ రాయల్ బ్రదర్స్
 
అయితే ఎటువంటి అదనపు ఛార్జీలు కూడా ఇందులో ఉండవని తెలిపారు
 
వినియోగదారు రాయల్ ఎన్ఫీల్డ్ నుండి ముందుగా బైకును అద్దెకు తీసుకోవాలి అనుకుంటే ముందు వారి అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాల్సి ఉంటుంది.
 
రాయల్ బ్రదర్స్ వెబ్‌సైట్‌లో ముందుగా మీరు సైన్‌ఇన్ కావాల్సి ఉంటుంది. తరువాత పికప్ తేది, సమయాన్ని మరియు ద్రాపింగ్ తేది, సమయాన్ని నమోదు చేసిన తరువాత పికప్ ప్రాంతాన్ని ఎంట‌ర్ చేసి సెర్చ్ చేయాల్సి ఉంటుంది.
 
మీరు వీరికి చెందిన బైకును అద్దెకు తీసుకున్నట్లయితే 24/7 భద్రత కోసం ఎప్పుడూ మీతో అనుసంధానమై ఉంటారు.
 
ఇది పూర్తిగా అధికారికంగా నడపబడుతున్న సంస్థ మరియు ప్రభుత్వ నుండి పూర్తిగా అనుమతి తీసుకున్నట్లు వివరించారు.


0 comments:

Post a Comment