CSS Drop Down Menu

Monday, August 10, 2015

" ఆ ఊరిలో ఇంటికో ఐఏయస్, ఐపీయస్"

భారతదేశ చరిత్రలో  ఏ గ్రామానికీ  లేని ప్రత్యేకతను ఆ గ్రామం సొంతం చేసుకుంది. ఇంటికో ఉద్యోగి ఉంటే గొప్పగా చెప్పుకుంటారు. ఒకే జిల్లా నుంచి ఇద్దరు ఐఏయస్ అధికారులు ఎంపిక అయ్యారంటే ఇంకా గొప్పగా చెప్పుకుంటారు. అదే మరి గ్రామంలో ఇంటికో ఐఏయస్ ఉంటే ఇంకెంత గొప్పగా ఉంటుంది? నిజంగా అసలు అలాంటి గ్రామం ఒకటి ఉందా? అనేగా మీ డౌట్. అదే ఉత్తరప్రదేశ్.. జౌన్‌పూర్ జిల్లాలోని 'మేధోపట్టి' గ్రామం. ఈ గ్రామంలో ఇంటికో ఐఏయస్ ఉన్నారు. అక్కడ ఉండే మొత్తం 75 కుటుంబాల్లో.. ప్రతి ఇంటినుంచీ ఓ ఐఏయస్ లేదా ఐపీయస్  అధికారి ఉన్నారు.
 గ్రామంలో డిగ్రీ పూర్తి చేసిన ప్రతి గ్రాడ్యుయేటూ సివిల్స్‌కు ప్రిపేర్ కావడం తమకెంతో గర్వంగా ఉంటుందంటారు ఆ గ్రామ పెద్దలు. అసలింతకీ ఇంత మారుమూల గ్రామం ఈరికార్డు  సాధించడానికి కారకుడు మొదట ముస్తఫా హుస్సేన్ అనే వ్యక్తి. తొలుత ఈ గ్రామం నుంచి 1914 లో సివిల్ సర్వీసెస్‌లో చేరడమే స్ఫూర్తి కలిగించింది. అతని తరువాత ఇదే గ్రామం నుంచి ఇందు ప్రకాష్ అనే వ్యక్తి  సివిల్ సర్వీస్‌లో రెండో ర్యాంక్ సాధించి ఐఏయస్‌కు సెలెక్ట్ అయ్యాడు. అది మొదలు సివిల్స్‌లో ర్యాంకుల పంట పండిస్తూనే ఉంది. ఈ గ్రామానికున్న మరో ప్రత్యేకత ఏంటంటే.. ఒకే ఇంటినుంచి నలుగురు అన్నదమ్ములు సెలెక్ట్ కావడం.ఈ రికార్డును కూడా   మేధోపట్టి గ్రామం సొంతం  చేసుకుంది.

Saturday, August 8, 2015

"స్మార్ట్‌ఫోన్‌" వినియోగదారులూ బహుపరాక్ !

టెలికాం విప్లవం పుణ్యమాని ప్రతి ఒక్కరి చేతుల్లో మొబైల్ ఫోన్ కనిపిస్తోంది. అయితే, ఆ ఫోన్ పని చేయాలంటే మాత్రం విధిగా బ్యాటరీ ఉండాల్సిందే. మారుతున్న టెక్నాలజీతో పాటు.. ప్రస్తుతం స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి వచ్చాయి. దీంతో ఇపుడు స్మార్ట్ ఫోన్ల హవా కొనసాగుతోంది. అయితే, ఈ ఫోన్లలో వినియోగించే బ్యాటరీలు నిగూఢ శత్రువుల్లా పని చేస్తున్నట్టు తాజా పరిశోధనలో వెల్లడైంది. 
 
ఇంటర్నెట్‌ వినియోగించే సమయంలో... ఫోన్లు చేసేటపుడు ప్రైవసీ కోసం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఈ గూఢచారి బ్యాటరీ ముందు ఆ పప్పులేవీ ఉడకవని సైబర్‌ భద్రతా నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎన్ని ప్రైవసీలు పెట్టుకున్నా స్మార్ట్‌ఫోన్‌ వాడే వ్యక్తి వివరాలన్నీ ఆ బ్యాటరీ ద్వారా ట్రాప్ చేయవచ్చని తేలింది. హెచ్‌టీఎంఎల్‌5లోని ఓ సాఫ్ట్‌వేర్‌.. ఈ బ్యాటరీ ద్వారా మొబైల్ వినియోగదారుని వివరాలను పసిగట్టేస్తుందట. 
 
నిజానికి ఈ సాఫ్ట్‌వేర్ వెబ్‌లోని కొన్ని సైట్లను ట్రాప్ చేసేందుకు ఉపయోగిస్తారు. ఇదే సాఫ్ట్‌వేర్ ద్వారా వినియోగదారుడి ఫోన్లో ఉన్న బ్యాటరీ నిడివి గురించి పలు వెబ్‌సైట్లకు సమాచారం ఇస్తుందట. ఆ సమాచారంతోనే వినియోగదారుడు నెట్‌ వాడుతున్నప్పుడు ఫోన్‌ వివరాలు, వినియోగదారుడి వివరాలను గుట్టుచప్పుడు కాకుండా ట్రాక్‌ చేసేస్తారట. 
 
ఇంటర్నెట్‌ వాడే ఓ వినియోగదారుడి వివరాలను తెలుసుకునేందుకు సాధారణంగా వీపీఎన్‌, ప్రైవేట్‌ బ్రౌజింగ్‌లు చాలు. అయితే ఇప్పుడు దానికి అదనంగా బ్యాటరీ సాఫ్ట్‌వేర్‌లోని లోపాలు తోడయ్యాయి. ‘ద లీకింగ్‌ బ్యాటరీ: ఎ ప్రైవసీ అనాలసిస్‌ ఆఫ్‌ ద హెచ్‌టీఎంఎల్‌5 బ్యాటరీ స్టేటస్‌ ఏపీఐ’ అనే అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. 


Friday, August 7, 2015

పాతికేళ్ళలోపు తండ్రి అయితే ! త్వరగానే మరణిస్తారట ?

యువకులకు ఇది నిజంగానే చేదువార్తే. పాతికేళ్ళలోపు తండ్రి అయితే వారు త్వరగానే చనిపోతారని ఓ పరిశోధనలో వెల్లడైంది. ఫిన్లాండ్‌లోని హెల్సింకీ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు పురుషుల జీవనప్రమాణాలపై పరిశోధనలు నిర్వహించారు. ఈ పరిశోధనల్లో కొన్ని సంచలన విషయాలు వెలుగుచూశాయి.
 
ఈ యూనివర్శిటీకి చెందిన ఎపిడమాలజీ అండ్ కమ్యూనిటీ హెల్త్ జర్నల్‌లో ప్రచురించిన వివరాల ప్రకారం... యుక్త వయసులోనే తండ్రయితే... తొందరగా మరణించే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. 25 ఏళ్ల లోపు పిల్లల్ని కంటే దాని ప్రభావం మహిళల కంటే పురుషులపైనే ఎక్కువగా ఉంటుందని పరిశోధకులు తెలిపారు. భర్తగా, తండ్రిగా, కుటుంబ యజమానిగా తీవ్ర ఒత్తిడిని ఎదుర్కోవాల్సి ఉంటుందని, దానిని తట్టుకోలేకపోతే ఆరోగ్యం క్షీణించి, త్వరగానే మృత్యువాతపడుతున్నారని పేర్కొంది. 
 
చిన్న వయసులోనే తండ్రి కావడం వల్ల పదేళ్లలో ఒకటి నుంచి 20 మంది వరకు అర్థాయుష్కులవుతున్నారని ఈ పరిశోధన తేల్చింది. 21 శాతం మంది తీవ్ర గుండెజబ్బులు, 16 శాతం మద్యపాన సంబంధిత వ్యాధుల వల్ల మరణిస్తున్నారని తెలిపింది. 25 ఏళ్లకు ముందే తండ్రి అయితే 40 నుంచి 45 ఏళ్ల మధ్య మరణించే ప్రమాదముందని పరిశోధన వెల్లడించింది.
 


Saturday, August 1, 2015

"శృంగారం" పై" అమ్మాయిలు" ఓపెన్‌గా మాట్లాడుతున్నారా ?

సెక్స్ అనేది ఇప్పుడు అమ్మాయిలకు నిషిద్ధ పదం కాదట. 15-20 ఏళ్ల క్రితం వాళ్లు సెక్స్ అంటే బిడియపడేవారని, సిగ్గుపడేవారని.. కానీ ఇప్పుడు పరిస్థితి మారిందని అంటున్నారు ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ మహేందర్ వాత్సా. రోజులు చాలా మారిపోయాయని ఆయన ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఈయన ‘ముంబై మిర్రర్’ పత్రికలో వ్యాసాలు రాసే కాలమిస్ట్‌గా కూడా పనిచేస్తున్నారు. గతంలో ఫ్యామిలీ ప్లానింగ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగానూ వ్యవహరించారు. దేశంలో ఇంచుమించు ప్రతిసిటీలో సెక్స్ కౌన్సెలింగ్ సెంటర్స్‌ను ఏర్పాటు చేయడమేగాక మన దేశంతోబాటు బంగ్లాదేశ్, శ్రీలంక, ఈజిప్టు, ఇండోనేషియా, మెక్సికోలలో సైతం వర్క్‌షాపులు నిర్వహించారు. యువకులు సెక్స్‌ను ఎంజాయ్ చేస్తే.. లోగడ అమ్మాయిలు బిడియపడేవారు.
 కానీ.. వాళ్లిప్పుడు ఓపెన్‌గా మాట్లాడుతున్నారని ఆయన ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. వాళ్లు కేవలం కౌగిలింతలు, కిస్సింగులకే పరిమితమయ్యేవారు అని ఆయన చెప్పారు. తరాలు మారుతున్నాయన్నారు. శృంగారం అంటే కేవలం లైంగిక క్రీడ మాత్రమే కాదని, భావోద్వేగాలు (ఎమోషన్స్) కూడా కీలకపాత్ర వహిస్తాయని మహేందర్ వాత్సా స్పష్టం చేశారు. ప్రస్తుతం యువతీయువకులు ఉద్యోగాల్లో, ఇతర వ్యాపకాల్లో ఎక్కువసేపు పనిచేయడం వల్లనో.. టెన్షన్స్ పెరుగుతుండడం వల్లనో వారిలో సెక్స్ పట్ల ఆసక్తి తగ్గిపోతోందని ఆయన తెలిపారు. అందువల్లే తాము కౌన్సెలింగ్ సెంటర్స్, వర్క్‌షాపుల వంటివి నిర్వహిస్తున్నట్లు చెప్పుకొచ్చారు.