CSS Drop Down Menu

Monday, November 20, 2017

"సముద్రంలో తేలే నగరాన్ని" నిర్మిస్తూ సంచలనం సృష్టిస్తున్న దేశం !

ఫ్రాన్స్ సర్కారు అద్భుత సృష్టితో తమ సత్తా ఏంటో నిరూపించురోనుంది. సరికొత్త రూ. 1135కోట్లతో సముద్రంలో తేలే నగరాన్ని నిర్మించేందుకు సమాయత్తమవుతోంది. ఇప్పటికే నగర నిర్మాణం ప్రారంభమైంది. 2020 నాటికి ఈ నగర నిర్మాణం పూర్తి చేయాలని ఫ్రాన్స్ భావిస్తోంది. ఇందులో 300 మందికి నివాసాలు ఏర్పాటు చేయాలని ఫ్రాన్స్ సర్కార్ తెలిపింది.



ఈ నగరంలో వ్యవసాయం, ఆక్వాకల్చర్, హెల్త్ కేర్, మెడికల్ రీసెర్చ్ సెంటర్, విద్యుత్ ఉత్పాదక ప్రాజెక్టులు ఏర్పాటు చేయనుంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే సముద్రం మీద తేలియాడే నగరాన్ని రూపకల్పన చేసిన దేశంగా ఫ్రాన్స్ నిలబడనుంది.


2018 నుంచి పూర్తి స్థాయిలో ఈ నగరం ఏర్పాటు పనులు ప్రారంభమవుతాయి. 2050 నాటికి సముద్రంపై తేలియాడే ఇలాంటి పలు నగరాలు వేల సంఖ్యలో నిర్మితమవుతాయని ఫ్రాన్స్ ప్రభుత్వాధికారి మిస్టర్ క్విర్క్ అన్నారు. 


0 comments:

Post a Comment