CSS Drop Down Menu

Monday, April 17, 2017

"ఒక నిమ్మకాయ" ఖరీదు రూ."27 వేలు" !

నిమ్మకాయ ధర రూ.2 లేదా 3 ఉంటుంది. మహా అయితే రూ.5 పలకడం కూడా చూశాం. అయితే తమిళనాడులో తొమ్మిది నిమ్మకాయలు ఏకంగా రూ.68 వేలు పలికాయి! అందులో కేవలం ఒక్క నిమ్మకాయతోనే రూ.27 వేలు వసూలయ్యాయి. తమిళనాడులోని విల్లుపురంలో 11 రోజుల పాటు అట్టహాసంగా జరిగే పంగుని ఉతిరం ఉత్సవాల్లో నిమ్మకాయలకు ప్రత్యేక విశిష్టత ఉంది. ప్రతియేటా ఉత్సవాల చివరి రోజున ఆలయ యాజమాన్యం పూజలో వాడిన పవిత్రమైన నిమ్మకాయలను వేలం వేస్తుంది.
 
ఈ ఉత్సవాల్లో తొలి తొమ్మిది రోజుల్లో రోజుకో నిమ్మకాయ చొప్పున శూలాలకు గుచ్చుతారు. ఈ నిమ్మకాయలు సొంతం చేసుకుంటే తమకు శుభం కలుగుతుందని స్థానికుల గట్టి నమ్మకం. పిల్లలు లేని వారికి ఈ నిమ్మకాయలు సంతాన భాగ్యం తీసుకొస్తాయని కూడా భావిస్తారు. అందునా మొదటి రోజు నిమ్మకాయకు ‘‘అత్యంత శక్తి ఉంటుందన్న’’ నమ్మకంతో దానికి మరింత డిమాండ్ ఉంటుంది. దీంతో ఒట్టనంథాల్‌కి చెందిన దంపతులు రూ.27 వేలు వెచ్చించి ఈ ఏడాది తొలిరోజు నిమ్మకాయను సొంతం చేసుకున్నారు. గతేడాది ఇదే తొలిరోజు ఉత్సవం నాటి నిమ్మకాయ రూ.39 వేలు పలికింది. మొత్తం మీద గతేడాది నిమ్మకాయలకు రూ.57,722 సమకూరగా... ఈ ఏడాది రూ.68 వేలు వచ్చినట్టు ఆలయ వర్గాలు తెలిపాయి.


0 comments:

Post a Comment