ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం పేద, మధ్యతరగతి ప్రజల నడ్డి విరిచేలా నిర్ణయాలు తీసుకోనుంది. ఇందుకోసం ఆదాయ పన్ను చట్టానికి సవరణ చేయనుంది. ముఖ్యంగా అప్పు తెచ్చుకున్నా, పెళ్ళిచేసుకున్నా, పన్ను చెల్లించేలా ఈ సవరణలు చేయనుంది. తాజా నిబంధనల ప్రకారం పెళ్లి ఖర్చులకు లెక్క చెప్పాల్సి ఉంటుంది. పెళ్లి ఖర్చులకు, మీ బ్యాంకు బ్యాలెన్స్‌కు మధ్య వ్యత్యాసముంటే వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. వారు సంతృప్తి చెందేలా వివరణ ఇవ్వకుంటే చిక్కుల్లో పడక తప్పదు.
అలాగే, అప్పు తెచ్చుకున్నా.. అది అప్పుగా నిరూపించలేకపోతే ఆ సొమ్ముపైనా పన్ను చెల్లించాల్సి...