CSS Drop Down Menu

Wednesday, June 7, 2017

"రోల్స్ రాయిస్"కంపెనీకి దిమ్మతిరిగేలా షాకిచ్చిన మన ఇండియా రాజు ! ఎవరో తెలుసా?


ఈ కాలంలో అవమానాలు పడటం ప్రతిష్టను బుగ్గిపాలు చేసినా సహిచడంవంటివి సహజం అయిపోయాయి. అయితే ఒకప్పుడు ఈ ధోరణి చాలా విభిన్నంగా ఉండేది. ఏ మాత్రం అవమానించబడ్డా తిరిగి వారి చేతే క్షమాపణలు చెప్పింకునేవారు. అచ్చం అలాంటిదే ఈ కథనం ప్రపంచ వ్యాప్తంగా దిగ్గజ ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థగా పేరుగాంచిన రోల్స్ రాయిస్ చేత ఓ భారతీయ రాజు క్షమాపణలు చెప్పించుకున్నాడు.




ఓ సారి రాజస్థాన్‌లోని అల్వార్ మహారాజా అయిన జైసింగ్ రాజు లండన్ పర్యటనకు వెళ్లాడు. పర్యనటలో భాగంగా సాధారణ మానవుని వస్త్రధారణలో లండన్‌లోని బాండ్ ప్రముఖ వీధిలో నడుచుకుంటూ వెళ్లాడు.


బాండ్ వీధిలో ఉన్న రోల్స్ రాయిస్ కార్ల విక్రయ కేంద్రం మీద రాజు గారికి చూపు మళ్లింది. ఆ విక్రయ కేంద్రంలో ఉన్న కార్లను ఇష్టపడ్డ జైసింగ్ లోపలికెళ్లి వాటి గురించి విచారించడానికి ప్రయత్నించాడు. 


అయితే అప్పుడు సేల్స్‌ మ్యాన్‌గా రోల్స్ రాయిస్ విక్రయ కేంద్రంలో ఉన్న వ్యక్తి రాజు గారిని సరిగ్గా గుర్తించలేదు కాబోలు, సాధరణ ప్రజలకు రోల్స్ రాయిస్ తమ కార్లను విక్రయించదు. కాబట్టి మీరు దయచేసి వెళ్లవచ్చు అని వక్రసమాధానం ఇచ్చాడు.


పేద వాళ్లకు, సాధారణ ప్రజలకు మరియు డబ్బు లేని వాళ్లకు ఇక్కడ కార్లు అమ్మబడవు అని జైసింగ్ ను అవమానించాడు. కేవలం తన వస్త్రధారణతోనే ఇలా అవమానిస్తాడా అని తాను లండన్‌లో అద్దెకు దిగిన గదికి వెళ్తాడు రాజు.తమ సేవకులతో జరిగిన తతంగాన్నంతా వివరించి, మహారాజులా ఆ విక్రయ కేంద్రానికి వెళ్లి అక్కడున్న కార్లన్నీ కొనుగోలు చేయాలని సేవకులతో వివరిస్తాడు. జైసింగ్ మహారాజులా వస్త్రధారణతో రోల్స్ రాయిస్ విక్రయ కేంద్రానికి వెళ్లి సేల్స్‌మ్యాన్‌ను ఆశ్చర్యపరుస్తాడు.

రోల్స్ రాయిస్‌ షోరూమ్‌లో ఉన్న మొత్తం ఆరు లగ్జరీ కార్లను కొనుగోలు చేస్తాడు. వాటి మొత్తం ధరతో పాటు లండన్ నుండి ఇండియాకు ఎగుమతి చేయడానికి సరిపడా మొత్తాన్ని కూడా చెల్లిస్తాడు. కొద్ది కాలానికి అక్కడ ఆర్డర్ ఇచ్చిన కార్లు జై సింగ్ నివాసానికి చేరుకున్నాయి.

లండన్‌లో నన్ను అవమానపరిచారనే నెపంతో ఈ కార్లను చెత్తను తరలించడానికి వినియోగించండంటూ రాజు తమ సిబ్బందికి ఆదేశిస్తాడు. నిజానికి రోల్స్ రాయిస్ కారులో ప్రయాణించడాన్ని ప్రజలు గర్వంగా ఫీలవుతారు.


స్టేటస్‌ కోసం వినియోగించే కార్లను రోల్స్ రాయిస్ పేరును చెడగొట్టే విధంగా చెత్తను శుభ్రం చేయడం మరియు తరలించడానికి ఇండియాలో ఉన్న రాజు వినియోగిస్తున్నాడనే వార్త ప్రపంచం మొత్తం వ్యాపించింది.

స్టేటస్‌కు చిహ్నంగా చెప్పుకునే కార్లను ఇలా మునిసిపాలిటీ అవసరాలకు వినియోగిస్తున్నాడని ప్రపంచ మార్కెట్లో రోల్స్ రాయిస్ పేరు రోజు రోజుకీ పడిపోవడం జరిగింది. తద్వారా ఇది విక్రయాల మీద కూడా ప్రభావం చూపింది. 

జై సింగ్ చేసిన పనికి రోల్స్ రాయిస్ సంస్థకు అన్ని విధాలుగా అవమానం ఎదురైంది, మరియు విక్రయాలు మందగించడంతో ఆదాయం కూడా దాదాపు తగ్గిపోయింది. లగ్జరీ కార్లను చెత్తను తరలించడానికి వినియోగించడం పట్ల రోల్స్ రాయిస్ జై సింగ్‌ను వివరణ కోరింది.

లండన్ విక్రయ కేంద్రంలో భారతీయులను అవమానించారు, ప్రజలను ఎలా గౌరవించాలో మీకు తెలియదని పేర్కొంటూ... అందుకు ప్రపంచ మొత్తం గర్వంగా చెప్పుకునే రోల్స్ రాయిస్ కార్లను ఇందుకు వినియోగిస్తున్నాము.. ఇది మా స్టేటస్  మమ్మల్నే అవమానిస్తారా ? అని వివరణ ఇచ్చారు.

జైసింగ్ లేఖతో దిగివచ్చిన రోల్స్ రాయిస్ బృందం జైసింగ్ కు క్షమాపణలు చెప్పింది. మరియు ఆరు కార్లను ఉచితంగా ఇస్తామని తెలిపి, చెత్తను తరలించడానికి వినియోగించకండని వేడుకుంది. దీనికి అంగీకరించిన జైసింగ్ అలా చేయడం ఆపేసాడు.





Sunday, June 4, 2017

బిచ్చగాడి ఔదార్యం !

విజయనగరం జిల్లా చీపురుపల్లిలో శ్రీఉమానీలకంఠేశ్వరస్వామి ఆలయం దగ్గర 20ఏళ్లుగా భిక్షాటన చేస్తోన్న చేబోలు కామరాజు అక్కడే చిన్న గుడారం వేసుకుని బతుకుతున్నాడు. భక్తులు ఇచ్చిన దాంట్లో ఒక్కో రూపాయి దాచుకుని... బ్యాంక్ బాలెన్స్ మెయింటైన్ చేస్తున్న ఈ బిచ్చగాడు తనకు భిక్షమేసిన భక్తుల మేలు కోసం తిరిగి లక్ష రూపాయలు విరాళమిచ్చి తన పెద్ద మనసు చాటుకున్నాడు. గుడికి వచ్చే భక్తులు ఎండలో నిలబడుతూ ఇబ్బందులు పడుతున్నారని గుర్తించిన ఆలయ కమిటీ షెల్టర్లు, షెడ్లు నిర్మించాలని నిర్ణయం తీసుకుంది. ఆ విషయాన్ని తెలుసుకున్న బిచ్చగాడు కామరాజు తాను దాచుకున్న డబ్బులో నుంచి లక్షా 20వేల రూపాయలు విరాళమిచ్చాడు. అన్నదే తడువుగా బ్యాంకు నుంచి డబ్బు తీసుకొచ్చి ఆలయ కమిటీకి అందజేశాడు.



తనకెవరూ లేరంటున్న చేబోలు కామరాజు ఆ దేవుడు ఇచ్చింది తిరిగి దేవుడికే ఇచ్చేస్తున్నా అంటున్నాడు. అంతేకాదు షెల్టర్ల నిర్మాణం పూర్తయ్యాక మరో పదివేల ఖర్చుతో భక్తులకు అన్నదానం చేస్తానంటున్నాడు. 20ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నానని, కుటుంబ సభ్యులు ఉన్నా ఎవరూ పట్టించుకోలేదని కన్నీటి పర్యంతమవుతున్నాడు. తనకు భిక్షమేసిన భక్తుల సౌకర్యం కోసం తాను దాచుకున్న డబ్బుంతా విరాళమిచ్చిన చేబోలు కామరాజును స్థానికులు అభినందిస్తున్నారు. అంతేకాదు భిక్షాటన డబ్బుతోనే ఇద్దరు పిల్లల చదువుకు ఆర్ధిక సాయం చేస్తున్నాడని మెచ్చుకుంటున్నారు.




Saturday, June 3, 2017

మన ఇల్లు సుఖసంతోషాలు, సిరిసంపదలతో ఉండాలంటే ?

తమ ఇంట్లో నిత్యం లక్ష్మీకళ తాండవించాలని, ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో తులతూగాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఎన్నో పూజలు, వ్రతాలు చేసినా దక్కని ఫలితం కేవలం కొన్ని చిన్న చిట్కాలతో ఎంతో తేలికగా, సులభమైన పద్దతుల్లో పొందవచ్చంటే నమ్మగలరా? దీన్ని చదివి, ఆచరించి చూడండి. వంటగదిలోని ఉత్తరం మూలలో లేదా ఈశాన్య మూలలో ఏదో రూపంలో నీరు ఉండేలా చూసుకోండి. నీటి బిందెలైనా, కుళాయిలైనా పెట్టుకోవడం మంచిది.

పడకగదిలో పరుగులెత్తే గుర్రాల బొమ్మలు, సముద్రంలోని పడవల బొమ్మలు అరిష్టం. వాటిని కాకుండా రాధాకృష్ణుల బొమ్మలను పెట్టుకుంటే ఆ ఇంట్లోని దంపతుల మధ్య కుటుంబ కలహాలు తగ్గడంతో పాటు అన్యోన్యత పెరుగుతుంది. 



హాలులోని గోడలకు ఎల్లప్పుడూ లేతరంగులు, కాంతివంతమైన రంగులనే ఎంచుకోవాలి. అలాగే హాలులో పంచముఖ ఆంజనేయస్వామి ఫోటోనైనా, విగ్రహాన్నైనా పెట్టుకుంటే ఇంట్లో గ్రహదోషాలు, అరిష్టాలు, అకాల మృత్యువులు వంటి ఏ దోషం ఉండదు. 



సాధారణంగా చాలామంది పిల్లల గదిని వారి అభిరుచి మేరకు కార్టూన్లతో నింపేస్తుంటారు. అవి పిల్లలను ఎంతగా అలరించినా చదువుకునే వయస్సులోని పిల్లల గదిలో సరస్వతిదేవి ఫోటో పెట్టుకోవడం మంచిది. అదే ఒకవేళ చదువు పూర్తి చేసిన పిల్లలైన పక్షంలో పచ్చని గడ్డి లేదా సువాసనలు వెదజల్లే పువ్వుల ఫోటోని పెట్టుకోవాలి.

Friday, June 2, 2017

"కివీ పండ్లు" చేసే మేలు గురించి తెలుసా ?

కివీ పళ్ల గొప్పదనం గురించి ఒక్కమాటలో చెప్పాలంటే డెంగీ వ్యాధి ప్రబలిన సమయంలో రోగులకు కివీ పండ్లు తినిపించాల్సిదిగా చాలామంది వైద్యులు సిఫార్సు చేశారు. ఎందుకంటే కివీ పండుతో రక్తంలోని ప్లేట్‌లెట్ల సంఖ్య పెరుగుతుంది. దీంతో రోగనిరోధక శక్తి పెరిగి రోగి త్వరగా కోలుకోవడానికి వీలుపడుతుంది. ఈ కివీ పండులో ఉండే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్స్ రోగనిరోధక శక్తిని విపరీతంగా పెంచుతాయి. కివీ పండును పళ్లలో రారాజుగా చెప్పొచ్చు. అయితే ఈ కివీ పండు కేవలం ప్లేట్‌లెట్ల సంఖ్యను పెంచడమే కాదు.. ఇతర పలు అనారోగ్యాలకు కూడా సూపర్ మెడిసిన్‌గా పనిచేస్తుంది. మధుమేహం, గుండె జబ్బులు, నిద్రలేమితో బాధపడేవారికి ఇదొక దివ్య ఔషధం. ఈ కివీ పండును తినడం వల్ల కలిగే మరికొన్ని లాభాల గురించి తెలుసుకుందాం. 



విటమిన్ ‘సి’ పుష్కలం:- సాధారణంగా నిమ్మ, నారింజ పళ్లలో విటమిన్ సి అత్యధికంగా ఉంటుందని మనం అనుకుంటాం. కానీ కివీలో నిమ్మ, నారింజల కంటే రెండింతలు విటమన్ సి ఉంటుంది. 100 గ్రాముల కివీ పండులో 154 శాతం విటమిన్ సి ఉంటుంది. ఈ విటమిన్ సి.. శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. దీని వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.

నిద్రలేమిని పోగుడుతుంది:- నిద్రలేమితో బాధపడుతున్న వారికి దీన్ని మించిన ప్రకృతి ఔషధం మరొకటి లేదు. దీనిలో ఉండే సెరోటొనిన్ నిద్రలేమిని పోగొడుతుంది. మీరు పడుకోవడానికి గంట ముందు రెండు కివీ పళ్లు తింటే హాయిగా నిద్రపోవడానికి ఇది ఎంతగానో తోడ్పడుతుంది.

నేత్ర సంబంధిత వ్యాధులు దూరం:- రోజుకు రెండు, మూడు కివీ పండ్లు తింటే నేత్ర సంబంధిత వ్యాధులు దూరమవుతాయి. వయసు పెరుగుదలతో వచ్చే కణజాల క్షీణతను ఇవి బాగా తగ్గిస్తాయి.

జీర్ణక్రియ వేగవంతం:- కివీ పండులో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది. అలాగే దీనిలో అధికంగా ఉండే యాంటీఆక్సిడెంట్లు మానసిక వ్యాధులను తగ్గించేందుకు ఉపయోగపడతాయి.

గుండెకు మేలు:- కివీ పండు గుండెకు ఎంతో మేలు చేస్తుంది. రక్తపోటును నియంత్రించేందుకు ఉపయోగపడుతుంది. గర్భిణిలు కివీ పండ్లు తింటే మంచి పౌష్టికాహారం లభించడమే కాక బిడ్డ ఎదుగుదలకు అది తోడ్పడుతుంది.

షుగర్ లెవెల్ తగ్గుముఖం:- రక్తంలోని షుగర్ స్థాయిలను తగ్గించే గుణం కివీకి ఉంది. ఇది మ‌ధుమేహం ఉన్న వారికి ఎంత‌గానో మేలు చేస్తుంది.

Thursday, June 1, 2017

పెళ్ళికి ముందే "శృంగారం"లో పాల్గొనే వింత ఆచారం !

కాంబోడియా దేశంలో ఉన్న ఆఫ్రికన్ తెగల్లో ఒకటి క్రియుంగ్. ఈ తెగలో కుటుంబ పెద్ద తమ కూతుళ్ళ కోసం ప్రేమ కుటీరాలు నిర్మించి ఇస్తాడు. యుక్త వయస్సు వచ్చినప్పటి నుంచీ ఈ కుటీరాలలోనే ఆడపిల్లలు నివాసం ఉండాల్సి ఉంటుంది. అంటే పుట్టిపెరిగిన ఇంటిని వదిలి ఈ కుటీరాల్లోనే నివశించాల్సి ఉంటుంది. అదీ కూడా సరైన జోడీ దొరికేంత వరకూ ఆడపిల్ల ఈ కుటీరంలో ఉండాల్సి.

ఈ సమయంలో తమకు నచ్చిన అబ్బాయి తారసపడితే  ఈ కుటీరానికి పిలిపించుకుని వారితో శృంగారంలో పాల్గొనవచ్చు. అదీ కూడా వివాహం జరిగేంత వరకూ వారిద్దరూ కుటీరంలోనే గడుపుతారు. కొన్ని రోజుల తర్వాత ఇద్దరిలో బేధాభిప్రాయాలు తలెత్తితే ఆడపిల్ల మగపిల్లవాడిని పొమ్మని చెప్పవచ్చు. లేదా మగపిల్లవాడే ఆ కుటీరం నుంచి వెళ్ళిపోవచ్చు. 

ఒక ఆడపిల్ల ఎంతమంది మగపిల్లలతోనైనా ఈ కుటీరంలో నివసించే అధికారం ఉంటుంది. ఒకసారి పెళ్ళి అయితే మాత్రం భర్తను వదిలే హక్కు ఆమెకు ఉండదు. ఇది కొద్దిగా సహజీవనానికి దగ్గరగా ఉండే ప్రక్రియ. పైగా, ఇది ఆ తెగ ప్రజల ఆచారమట.