మీరు నమ్మకపోయినా ఇది నిజం. ఒక వ్యక్తి తీసుకున్న సంచలన నిర్ణయమే ఇలాంటి అరుదైన పరిస్థితి కి కారణం.
నిత్యం పేదరికంతో చాలీచాలని సంపాదనతో బాధపడుతున్న ఆ ఊరి ప్రజలు రాత్రికి రాత్రి కోటేశ్వర్లు అవ్వడంతో అక్కడఉన్న ప్రజలు ఉక్కరిబిక్కరికి గురిఅవుతున్నారు.
ఇది ఎలా సాధ్యం అని తెలుసుకోవాలి అంటే స్పెయిన్ కి చెందిన ఒక పెద్ద మనిషి గురించి మనం తెలుసుకోవాలి. అది ఎలా అంటే స్పెయిన్ లోని "కరోనా" అనే బీరు కంపెనీ యజమాని ఆంటోనినో ఫెర్నాండెజ్.
తన తల్లితండ్రుల పేదరికంతో చదువుకొనే స్తోమత లేక బడికి వెళ్లలేని బ్యాక్ గ్రౌండ్ అతనిది . స్కూల్ కి వెళ్లకపోవడంతో చిన్నతనంలోనే బీరు కంపెనీలో చేరాడు.
అనంతరం అంచెలుఅంచెలుగా ఎదిగి భారీ బీరు ఫ్యాక్టరీలు పెట్టేసాడు అలాగే భారీగా డబ్బులు సంపాధించిన తర్వాత తాను పుట్టి పెరిగిన ఊరు ఇంకా మారలేదు అని అక్కడ ప్రజలు ఇంకా పేదరికంతో మగ్గుతున్నారు అని తెలుసుకున్నాడు.
జీవితం చివరిదశలో ఉన్న అయన తాను పుట్టిన ఊరికి ఏదోకటి చేయాలి అని అనుకున్నాడు. అలా అనుకొని తాను చనిపోయిన తర్వాత తన ఆస్థిలో పెద్ద మొత్తం తాను పుట్టిన సెరెజాలెస్ డెల్ కాండడో ప్రజలకు చెందాలి అని కోరారు.
ఆలా వీలునామా రాసిన తర్వాత అయన చనిపోయాడు. అనంతరం అయన రాసిన వీలునామా ప్రకారం ఆ ఊరిలో ఉన్న 150 కుటుంబాలకు ఒక్కొక్కరి బ్యాంకు అకౌంట్లో రూ.15 కోట్లు జమ అయ్యాయి.
రాత్రికిరాత్రి తమ బ్యాంకు అకౌంట్లో ఇంత పెద్ద మొత్తంలో డబ్బు చేరడంతో అక్కడ ప్రజలు అంతా షాక్ కు గురి అయ్యారు.డబ్బులు ఎక్కడ నుంచి వచ్చాయి అని ఆరాతీస్తే అసలు విషయం బయటకి వచ్చింది.
0 comments:
Post a Comment