ఆ పాప రెస్టారెంట్లో పుట్టింది. అంతే ఇక బంపర్ ఆఫర్ కొట్టేసింది. జీవితాంతం ఆ రెస్టారెంట్‌లో ఉచితంగా భోజనం చేసే అవకాశాన్ని కొట్టేసింది. అంతేకాదు ఆ హోటల్ ఆ బుజ్జిపాపకు ఉద్యోగం ఆఫర్ కూడా ఇచ్చింది. వివరాల్లోకి వెళితే.. ఈ నెల 17వ తేదీన టెక్సాస్‌లోని శాన్ ఆంటోనియోలో ఉన్న చిక్ ఫిల్ ఎ రెస్టారెంట్‌కు రాబర్ట్ గ్రీఫిన్, మ్యాగీ దంపతులు వచ్చారు. వీరికి ఇద్దరు పిల్లలు.
అదే సమయంలో మ్యాగీకి పురిటి నొప్పులు రావడంతో రెస్ట్ రూమ్‌కు వెళ్లారు. తన స్నేహితుడి కారులో పిల్లలను ఇంటికి పంపించిన రాబర్ట్... రెస్ట్ రూమ్‌లో భార్యపక్కనే ఉండి సపర్యలు చేశాడు....