CSS Drop Down Menu

Tuesday, June 19, 2018

Microsoft Windows లో మొత్తం ఎన్ని వెర్షన్లు ఉన్నాయో మీకు తెలుసా?


మనం  రోజు వాడే కంప్యూటర్,లాప్టాప్ లో ఉండే Windows Os (Operating System) మొత్తం ఎన్ని  వెర్షన్లు  ఉన్నాయో ? అవి ఎప్పటి నుండి వచ్చినవో తెలుసుకోవాలని ఉందా ! ఐతే ఈ వీడియో చూసి తెలుసుకోండి.
ఈ వీడియో కనుక నచ్చితే like,share చేయండి. Subscribe చేయడం మాత్రం మర్చిపోకండి.



Wednesday, June 13, 2018

డయాబెటిస్ రోగులకు దివ్యౌషధం "కొర్రబియ్యం"

సాధారణంగా మనం తినే బియ్యం తెల్లగా ఉంటే బాగా ఇష్టపడతాము. అందుకు గాను బియ్యాన్ని ఎక్కువుగా పాలీష్ చేయటం వలన దానిలో ఉన్న పోషక విలువలు తగ్గిపోతాయి. తద్వారా అనేర రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ సమస్యను అధిగమించాలంటే చిరుధాన్యాలుగా పిలువబడే కొర్రలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.



1. వీటిలో పీచుపదార్ధం ఎక్కువుగా ఉండటం వలన ఇది మలబద్దక సమస్యను తగ్గిస్తుంది.

2. దీనిలో మాంసకృతులు, కాల్షియం, ఐరన్, మాంగనీస్, మెగ్నీషియం, ధైమిన్, రైబోఫ్లేవిన్ అధికపాళ్లలో ఉంటాయి. డయాబెటిస్ రోగులకు కొర్రబియ్యం దివ్యౌషధంలా పనిచేస్తుంది. ఇది రక్తంలో చక్కెర శాతాన్ని పూర్తిగా అదుపులో ఉంచుతుంది.

3. ఉదర సంబంధ సమస్యలకు కొర్రబియ్యం చక్కటి ఉపశమనం కలిగిస్తుంది. కడుపులో నొప్పి, ఆకలి లేకపోవడం, అజీర్తి సమస్యలకు ఇది చక్కగా పని చేస్తుంది. జీర్ణ నాళాన్ని శుభ్రం చేయడంలో ఇది ప్రముఖపాత్ర వహిస్తుంది. ఇది మూత్రం పోసేటప్పుడు మంటను తగ్గిస్తుంది.

4. గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది. అనేక ఆరోగ్య సమస్యలను కలిగించే గ్లుటెన్ కొర్రబియ్యంలో ఉండదు. ఊబకాయాన్ని తగ్గిస్తుంది. ఇది కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచటంలో సహాయపడుతుంది.

5. కీళ్లనొప్పులను, జ్వరాన్ని తగ్గిస్తుంది. కాలిన గాయాలు త్వరగా మానటానికి ఉపయోగపడుతుంది. స్త్రీలలో రక్తస్రావాన్ని అదుపులో ఉంచుతుంది.

6. కొర్రలలో మాంసకృత్తులు, ఐరన్ శాతం ఎక్కువుగా ఉండటం వలన రక్తహీనతను తగ్గిస్తుంది. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.

కొర్రబియ్యం వండుకునే విధానం : ఒక గ్లాసు కొర్రలను శుభ్రంగా కడిగి రెండు గ్లాసులు నీరు పోసి ఒక గంట నానబెట్టాలి. నానబెట్టిన కొర్రబియ్యాన్ని కుక్కర్లో పెట్టి ఉడికించాలి. ఒకవేళ ఇలా తినలేకపోతే సగం బియ్యం, సగం కొర్రలు కలిపి వండుకోవచ్చు.

Monday, June 11, 2018

బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రణబ్ ముఖర్జీ ?

దేశ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకునేలా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా, నాగ్‌పూర్ వేదికగా జరిగిన ఆర్ఎస్ఎస్ సమావేశానికి మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ హాజరుకావడంతో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. భారతీయ జనతా పార్టీని శాసించే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ దేశం దిగ్భ్రాంతి గొలిపే సంకేతాలను పంపినట్టు తెలుస్తోంది.

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి పూర్తి మెజారిటీ రాకుండా... కాంగ్రెస్‌ కూడా ఆధిక్యం సాధించలేకపోతే ఏం జరుగుతుంది? 'సంకీర్ణ సర్కారు' తప్పని పరిస్థితే తలెత్తితే అందరికీ ఆమోదయోగ్యమైన ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రణబ్ ముఖర్జీని బరిలోకి దించేలా ఆర్ఎస్ఎస్ వ్యూహం రచించనట్టు తెలుస్తోంది. శివసేన కూడా ఇదే అభిప్రాయం వ్యక్తంచేసింది. 

నెహ్రూ సిద్ధాంతాలను పూర్తిగా వంటపట్టించుకున్న ప్రణబ్‌కు ఆరెస్సెస్‌ ఆహ్వానం అంత సులువుగా తీసుకునే పరిణామంకాదని పేర్కొంది. దీనిపై శివసేన అధికార పత్రిక 'సామ్నా' శనివారం సంపాదకీయం రాసింది. '2019 ఎన్నికల్లో ఆధిక్యతను సాధించడంలో బీజేపీ విఫలమైతే... అందరికీ ఆమోదయోగ్యమైన అభ్యర్థిగా ప్రణబ్‌ ముఖర్జీ ప్రధాని కావొచ్చు' అని అభిప్రాయపడింది.

అలాగే, 'కాంగ్రెస్‌ ముక్త్‌ భారత్' అనే బీజేపీ నినాదంతో తాము ఏకీభవించడంలేదనే సందేశాన్ని ఆరెస్సెస్‌ పంపిందనే విశ్లేషణలు కూడా వెలువడుతున్నాయి. ప్రణబ్‌కు ఆహ్వానంలో సంకేతం ఇదేనని ఓ వార్తా చానల్‌ విశ్లేషించింది. 'కాంగ్రెస్‌ ముక్త్‌ భారత్‌ను కాకుండా... వారసత్వ సారథ్యంలేని కాంగ్రెస్‌నే ఆరెస్సెస్‌ ఆకాంక్షిస్తోంది. తాము కాంగ్రెస్‌కు వ్యతిరేకం కాదని, 'గాంధీ'ల వారసత్వానికి మాత్రమే వ్యతిరేమని ఆరెఎస్సెస్‌ సంకేతాలు పంపింది' అని పంపిందని తెలిపింది. 

అదేసమయంలో ఆరెస్సెస్‌ కార్యక్రమంలో పాల్గొనడంద్వారా ప్రణబ్‌ తాను స్వతంత్రుడినని, కాంగ్రెస్తో సంబంధాలను పూర్తిగా తెంచేసుకున్నానని చెప్పకనే చెప్పారు. ఆరెస్సెస్‌ ఆహ్వానాన్ని మన్నించడంపై కాంగ్రెస్‌ నేతలు బహిరంగంగా తప్పుపట్టినా ఆయన పట్టించుకోలేదు. కేంద్రంలో కాంగ్రెస్‌, బీజేపీయేతర ప్రభుత్వం ఉండాలని ఆకాంక్షిస్తున్న తృణమూల్‌ కాంగ్రెస్‌, తెలుగుదేశం, టీఆర్‌ఎస్‌ తదితర పార్టీలకు ప్రధానిగా ప్రణబ్‌ ఆమోదయోగ్యమైన అభ్యర్థి అవుతారని ఆ వార్తా చానల్‌ పేర్కొంది. మొత్తానికి ప్రణబ్ మరోమారు దేశ రాజకీయాల్లో కీలకంగా మారారు. 


Tuesday, June 5, 2018

శివునికి కూడా "దశావతారము"లున్నవన్న సంగతి తెలుసా ?

పరమ శివునికి అనేక నామములు ఉన్నవన్న విషయం మనందరికి తెలిసినదే. కానీ... అడిగిన వెంటనే వరాలిచ్చే భోళా శంకరుడు అయిన పరమ శివునకు కూడా విష్ణుమూర్తి వలె దశావతారములున్నవి. ఒక్కొక్క అవతారము ఒక్కొక్క ప్రయోజనం కలిగి ఉంటుంది. శతరుద్ర సంహితాలలో నందీశ్వరుడు, సనత్కుమారునకు ఈ ఈశ్వరావతారమును వివరిస్తాడు. ఆ అవతారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

1. శివుని ప్రధమ అవతారము మహాకాలుడు. మహాకాళి ఈ మహాకాలునికి భార్య. వీరిరువురు భక్తులకు భుక్తి, ముక్తిని ఇచ్చుచు వారి కోరికలను నెరవేర్చుచుందురు.

2. ఈశ్వరుని ద్వితీయ అవతారము తారకావతారము. తారకాదేవి ఈయన అర్థాంగి. వీరిని సేవించినవారు భక్తి, ముక్తులతో పాటు సమస్త శుభములను పొందుదురు.

3. ముక్కంటి తృతీయ అవతారము బాలభువనేశ్వరావతారము. బాలభువనేశ్వరి భువనేశ్వరుని అర్థాంగి. ఈ అవతారము సత్పురుషులకు సుఖములను కలిగించును.

4. శంకరుని చతుర్థ అవతారము షోడశ విద్యేశ్వరుడు. షోడశ విద్యేశ్వరి ఇతని ధర్మపత్ని. భక్తులకు సర్వ సుఖములను ప్రసాదించుట ఈ అవతార ప్రాశస్త్యము.

5. మహేశ్వరుని పంచమ అవతారము భైరవావతారము. భైరవి ఇతని భార్య. ఈ భైరవుడు ఉపాసనాపరులకు సర్వ కామ్యములను ఒనగూర్చును.

6. మంజునాధుని ఆరవ అవతారము భిన్నమస్త. ఈతని అర్థాంగి భిన్నమస్తకి. వీరీరువురు భక్తకామప్రదులు.

7. భోళా శంకరుని సప్తమ అవతారము ధూమవంతుడు. ధూమవతి ఇతని భార్య. వీరిరువురు భక్తకాభీష్టప్రదులు.

8. పరమ శివుని అష్టమావతారము బగళాముఖుడు. ఇతని అర్థాంగి బగళాముఖి. ఈమెకే మహానంద అని మరియొక పేరు కూడా కలదు. వీరు భక్తవాంఛాప్రదులు.

9. ఉమామహేశ్వరుని నవమావతారము మాతంగుడు. మాతంగి ఇతని భార్య. వీరీరువురు భక్తుల సర్వకాంక్షలను ఈడేర్చుచుందురు.

10. కైలాసవాసుని దశమావతారము కమలుడు. కమల ఇతని భార్య. వీరిరువురు భక్తపాలకులు. ఈ దశమావతారములు శివశక్తి మతోరభేదః అన్న సిద్ధాంతమును మనకు తెలియబరుచుచున్నవి. వికార రహితులై ఏకాగ్రతతో సేవించినవారికి సమస్త సుఖములు కలిగి సమస్త కోర్కెలు సిద్ధించును. 

ఈ అవతారములన్నియు తంత్ర శాస్త్ర గర్భితములు. ఈ దేవతా శక్తులు దుష్టులను దండించుచూ భక్తులకు బ్రహ్మతేజోభివృద్ధిని కలిగించుచుండును. శివ పర్వ దినములందు ఈ అవతారములను స్మరించినచో భక్తులు బ్రహ్మ వర్చస్సు కలవారైన విజయవంతులు, ధనాడ్యులు సుఖవంతులు అవుతారని నందీశ్వరుడు పలికెను.