జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీడియాపై యుద్దం ప్రకటించిన సంగతి తెలిసిందే. తనపై వ్యక్తిగత దూషణలు చేసినందుకుగాను ఆఖరికి ఏ సంబంధం లేని విషయంలో తన తల్లిని సైతం దూషించి దానిపై పలు ఛానళ్లలో గంటల కొద్దీ డిబెట్లు పెట్టినందుకుగాను పవన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ పలు ఛానళ్లపై మండి పడ్డారు. అంతేకాదు ఆ ఛానళ్లను బ్యాన్ చేయమని చూడొద్దని తమ అభిమానులకు సైతం పిలుపునిచ్చారు. ఆరు నెలలుగా నన్ను తిట్టీ,తిట్టీ ఇప్పుడు ఆఖరికి మా తల్లి దగ్గరకు వచ్చారా ? ఇప్పుడు నేను మీకు ఇస్తాను న్యూస్ అంటూ ఆరోజు నుండి ఈరోజు వరకూ తన ట్విట్టర్ ఖాతా ద్వారా మీడియా వార్ చేస్తున్నారు. అంతేకాదు పలు ఛానళ్ల పేర్లు ఈ రాజకీయ కుట్ర వెనుక కొంత మంది ఉన్నారంటూ వారి పేర్లు కూడా బయట పెట్టారు. ఇంకా పలు సంచలన ట్వీట్లు పెడుతూనే ఉన్నారు.
అయితే ఇప్పుడు మీడియా పవన్ పై యుద్దం ప్రకటించిందా ? అంటే అవుననే సంకేతాలే వినిపిస్తున్నాయి. తెలుగు టీవీ చానళ్లన్నీ ఆయనపై అనధికార బహిష్కరణ వేటు వేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. మీడియాపై యుద్ధం ప్రకటించి ట్విట్టర్ లో అదే పనిగా ఆరోపణలు చేస్తూ ఏవేవో వీడియోలు పెడతానంటూ బెదిరింపులకు పాల్పడుతున్న పవన్ కల్యాణ్ వ్యవహారాన్ని లైట్ తీసుకోవాలని మీడియా సంస్థలు నిర్ణయించుకున్నాయట. ఇక నుంచి పవన్ రాజకీయాన్ని, ఆయన మాటలను పట్టించుకోకూడదని డిసైడయ్యాయట. పవన్ కల్యాణ్ ను పట్టించుకోకపోతే సమస్య పరిష్కారమవుతుందని టీవీ చానళ్ల యజమానులందరూ నిర్ణయించుకున్నారట. దీంతో పవన్ కల్యాణ్ ఇక ఏ ఛానల్ లో కనపించరు ఆయన మాట ఏ ఛానల్ లో వినిపించదు అని అంటున్నారు. మరి మీడియా తీసుకున్న ఈ నిర్ణయంతో ట్విట్టర్, తన యూట్యూబ్ చానల్ లో మాత్రమే తన గురించి ప్రచారం చేసుకోవాల్సి ఉంటుంది. మరి చూద్దాం ఎన్ని రోజులు మీడియా పవన్ ను దూరం పెడుతుందో ?
0 comments:
Post a Comment