జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీడియాపై యుద్దం ప్రకటించిన సంగతి తెలిసిందే. తనపై వ్యక్తిగత దూషణలు చేసినందుకుగాను ఆఖరికి ఏ సంబంధం లేని విషయంలో తన తల్లిని సైతం దూషించి దానిపై పలు ఛానళ్లలో గంటల కొద్దీ డిబెట్లు పెట్టినందుకుగాను పవన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ పలు ఛానళ్లపై మండి పడ్డారు. అంతేకాదు ఆ ఛానళ్లను బ్యాన్ చేయమని చూడొద్దని తమ అభిమానులకు సైతం పిలుపునిచ్చారు. ఆరు నెలలుగా నన్ను తిట్టీ,తిట్టీ ఇప్పుడు ఆఖరికి మా తల్లి దగ్గరకు వచ్చారా ? ఇప్పుడు నేను మీకు ఇస్తాను న్యూస్ అంటూ ఆరోజు నుండి ఈరోజు వరకూ తన ట్విట్టర్ ఖాతా ద్వారా మీడియా వార్ చేస్తున్నారు....