CSS Drop Down Menu

Saturday, March 31, 2018

"రంగులు" మారే వినాయకుడు !

మన భారతదేశంలో వున్న ఆలయాలు ఎంతో ప్రసిద్ధి చెందినవి. మన దేశంలో తమిళనాడులో చాలా ఎక్కువగా ఆలయాలు వున్నాయి. అందుకే తమిళనాడు రాష్ట్రాన్ని "టెంపుల్ స్టేట్" అంటారు. ఇందులో కేరళాపురం గ్రామం కన్యాకుమారికి దగ్గరలో వుంది. కేరళాపురం పురాతన ఆలయాలకు ప్రసిద్ధి.ఎక్కువగా శివాలయాలు వున్నాయి.

 ఈ శివాలయంతో పాటు పురాతన వినాయకుని ఆలయం వుంది. ఈ దేవాలయంలో 6నెలలకు ఒక సారి మూలవిరాట్ అయిన వినాయకుడు రంగులు మారటం ఇక్కడ విశేషం. మార్చి నుండి ఆగస్ట్ వరకు నల్లని రంగులో,ఆగస్ట్ నుండి ఫిబ్రవరి వరకు తెల్లనిరంగులో వినాయకుడు మారుతూవుంటాడు.

ఆలయంలోని ప్రాంగణంలో వున్న బావిలోని నీరు కూడా రంగు మారుతుంది. వినాయకుడు నల్ల రంగులో వున్నప్పుడు నీళ్ళు తెల్లగాను, వినాయకుడు తెల్లగా వున్నప్పుడు నీళ్ళు నల్లగానూ మారతాయి. ఇందుకు గల కారణాలు ఇప్పటి వరకూ తెలియదు.

ఏ కోరికతోనైనా భక్తులు ఈ స్వామికి కొబ్బరికాయ గానీ, బియ్యపుమూట గానీ, ముడుపుగా చెల్లిస్తే వారి కోరిక తప్పకుండా నెరవేరుతుందనేది ఎవరూ కాదనలేని నిజం.

రోడ్డు మార్గం : కన్యాకుమారి జిల్లాలోని అన్ని ప్రాంతాల నుండి 32 కి. మీ ల దూరంలో ఉన్న తక్కలై వరకు బస్సులు తిరుగుతాయి. అక్కడి నుండి సమీపాన ఉన్న కేరళపురం ఆలయం వరకు రోడ్డు మార్గం ద్వారా చేరుకోవచ్చు.

కన్యాకుమారి రైల్వే స్టేషన్ చేరుకొని, బస్సులలో లేదా టాక్సీ ఎక్కి ఆలయానికి చేరుకోవచ్చు. 


0 comments:

Post a Comment