CSS Drop Down Menu

Tuesday, August 29, 2017

"కిడ్నీలో రాళ్లు" తొలగిపోవాలంటే "శృంగార"మే బెస్ట్ మెడిసన్ !

చాలా మందికి కిడ్నీల్లో రాళ్లు ఉన్నాయని ఆస్పత్రుల చుట్టూ తిరుగుతుంటారు. మరికొందరు ఆపరేషన్ చేయించుకుని ఆ రాళ్లను తీసేయించుకుంటారు. ఇంకొందరు ఆయుర్వేద మందులు వాడి శరీరంలోనే కరిగించుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. అయితే, తాజాగా ఓ ఆసక్తికరమైన విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది. 

వైద్యులు చేసిన ప్రయోగాల్లో ఈ విషయం వెల్లడైంది. అదేమిటంటే.. కిడ్నీలో రాళ్లు తొలగిపోవాలంటే శృంగారమే బెస్ట్ మెడిసన్ అని చెపుతున్నారు. వారంలో మూడు, నాలుగుసార్లు శృంగారంలో పాల్గొంటే చిన్నసైజు రాళ్లు తొలగిపోతాయని చెబుతున్నారు. 

ఈ పరిశోధనలో భాగంగా కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడుతున్న మగవారిని మూడు బృందాలుగా విభజించారు. మొదటి గ్రూప్‌లోని వారిని వారంలో మూడుసార్లు శృంగారంలో పాల్గొనాల్సిందిగా సలహా ఇచ్చారు. రెండో గ్రూప్‌లోని వారికి యూరినేషన్‌ పెంచే మందులను, మూడో గ్రూప్‌వారికి రాళ్లను కరిగించే మెడిసిన్‌ సూచించారు. 

రెండువారాల తర్వాత రెండు, మూడు గ్రూప్‌లోని వారికంటే మొదటి బృందంలోని వారిలో ఈ రాళ్ల సమస్య గణనీయంగా తగ్గిందని పరిశోధకులు గుర్తించారు. ఈ బృందంలో 31 మంది ఉండగా, 26 మందిలో కిడ్నీలో రాళ్లు పూర్తిగా తొలిగిపోయాయని వారు పేర్కొన్నారు. 

కిడ్నీలో ఏర్పడే చిన్నసైజు రాళ్లు (6 మిల్లీమీటర్ల కంటే తక్కువ మందం కలిగినవి) శృంగారం వల్ల వెలుపలకు వచ్చేసే అవకాశాలు మెరుగవుతాయని చెబుతున్నారు. మొత్తానికి కిడ్నీలో రాళ్లతో బాధపడుతున్న వాళ్లు వారంలో కనీసం మూడుసార్లు శృంగారంలో పాల్గొంటేచాలని తేల్చారు. 

BlockBuster Deals : http://amzn.to/2iLTGyY

0 comments:

Post a Comment