చాలా మందికి కిడ్నీల్లో రాళ్లు ఉన్నాయని ఆస్పత్రుల చుట్టూ తిరుగుతుంటారు. మరికొందరు ఆపరేషన్ చేయించుకుని ఆ రాళ్లను తీసేయించుకుంటారు. ఇంకొందరు ఆయుర్వేద మందులు వాడి శరీరంలోనే కరిగించుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. అయితే, తాజాగా ఓ ఆసక్తికరమైన విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది.
వైద్యులు చేసిన ప్రయోగాల్లో ఈ విషయం వెల్లడైంది. అదేమిటంటే.. కిడ్నీలో రాళ్లు తొలగిపోవాలంటే శృంగారమే బెస్ట్ మెడిసన్ అని చెపుతున్నారు. వారంలో మూడు, నాలుగుసార్లు శృంగారంలో పాల్గొంటే చిన్నసైజు రాళ్లు తొలగిపోతాయని చెబుతున్నారు.
ఈ పరిశోధనలో భాగంగా కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడుతున్న...