వాడెంత? వెంట్రుక సమానమని వెంట్రుకలను తేలిగ్గా తీసి పారేయకండి. దానికున్న స్పెషాలిటీ గురించి తెలిస్తే వామ్మో అనాల్సిందే! మనిషి నెత్తిమీద వుండే వెంట్రుక రెండు ఏనుగులను కట్టి వేసేంత బలం ఉందంటే మీరు నమ్ముతారా? కానీ నమ్మితీరాల్సిందే. రీసెంట్‌గా వెంట్రుక స్ట్రెంగ్త్‌పై జరిగిన పరిశోధనలో దాని పవర్ బయటపడింది.
సుమారు 3 ఔన్సుల బరువుండే ఒక్కో వెంట్రుక డజన్ పెన్నీల బరువును మోస్తుందట. ఈ లెక్కన అసలు వెంట్రుక కథేంటో తేలుద్దామని రంగంలోకి దిగిన సైంటిస్టులు రిజల్ట్స్ చూసి ఆశ్చర్యపోయారు. అసలు విషయం తెలిస్తే మీరు అవాక్కవడం గ్యారంటీ! ఒక్కో తల మీదుండే వెంట్రుకల మొత్తంతో 12 టన్నుల బరువున్న రెండు ఏనుగులను కట్టివేయవచ్చని తేలింది. మనుషుల వెంట్రుకలు కెరటీన్‌తో తయారైతే, గుర్రాలు వంటి జంతువుల కాళ్ల చర్మం నుంచి పుట్టే వెంట్రుకలకు మనకు తెలియనంత స్ట్రాంగ్‌నెస్ ఉందట. అంతే బలంగావుండే మనిషి వెంట్రుకలను తేలిగ్గా తీసి పారేయుకుండా వాటికి తగిన పోషక పదార్ధాలు అందించి జాగ్రత్తగా చూసుకుంటే మంచిదని సైంటిస్టులు సెలవిస్తున్నారు. వెంట్రుకలు చిట్లిపొకుండా విటమిన్లు, ప్రొటీన్లు తీసుకుని వాటిని జాగ్రత్తగా చూసుకుంటే మంచిదంటున్నారు. అంతేకాకుండా ఆరు నుంచి ఎనిమిది వారాల గ్యాప్‌లో క్రాఫ్ చేయించుకుంటే హ్యపీహెయిర్ మీ సొంతం.
ReplyDeleteవెంట్రుకలలో ఉన్న బలము తెలుసా ?
తెలుసు
పేను కొరుకుడు :)
జిలేబి