తెలుగు చిత్రపరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి పదేళ్ళ తర్వాత రీఎంట్రీ ఇచ్చారు. "ఖైదీ నంబర్ 150"వ చిత్రంతో ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిరంజీవి... నిర్మాతపై కనకవర్షం కురిపిస్తున్నారు. అయితే, తన తనయుడైన ఖైదీ చిత్ర నిర్మాత రామ్ చరణ్‌కు నాన్నపై ఉండే ప్రేమ కంటే.. డబ్బులు సంపాదించాలన్న ఆశ ఎక్కువగా ఉందనీ, అందువల్ల తనను నానా హింసలు పెట్టినట్టు చిరంజీవి తన తనయుడిపై పంచ్‌లు వేశాడు.
సంక్రాంతి పండుగ రోజున 'ఖైదీ నంబర్ 150' హీరో చిరంజీవి, నిర్మాత రామ్ చరణ్, దర్శకుడు వివి.వినాయక్‌లతో నాగబాబు కుమార్తె నీహారిక యాంకర్‌గా ఓ టీవీ ప్రత్యేక కార్యక్రమాన్ని...