ఏరా? తల తిరుగుతోందా? అనే ప్రశ్న మీరందరూ వినే ఉంటారు. కానీ అదే ప్రశ్న ఈ
పిల్లాణ్ని అడిగితే మాత్రం అవును. తిరుగుతోంది. అదీ 180 డిగ్రీల్లో .. అని
సమాధానం ఇస్తాడు.. ఈ తలతిరుగుడు గురించి వివరాల్లోకి వెళ్తే.. అనగనగా ఒక
బుడ్డోడు. వాడికి అందరి లాగే మెడ కాయ మీద తలకాయ ఉంది. సో వాట్ ? అని
అందరిలా రొటీన్ క్వశ్చన్ వేయకండి. వాడి తల వాడు చెప్పినట్టే వింటుంది. ఎటు
తిరగమంటే అటు తిరుగుతుంది.
కూర్చున్న చోటు నుంచి వళ్లేమాత్రం కదల్చకుండా కేవలం తల మాత్రమే
తిప్పేస్తాడు. వినడానికీ, చూడ్డానికీ ఆశ్చర్యంగా ఉన్నా...ఇది నిజంగా
నిజం..ఆ పిల్లాడి తల వేరీ ఫ్లెక్సిబుల్. ఈ పిల్లాడి వెనుక నంచి పలకరించినా,
విష్ చేసినా బాడీ కదల్చకుండా తలమాత్రం వెనక్కి తిప్పి పలకరించేస్తాడు. ఈ
సీన్ డైరెక్ట్ గా చూసిన వాళ్లు, యూట్యూబ్ లో వీడియో చూసిన వాళ్లూ షాక్.
ఇప్పటికే రెండు లక్షల మందికి పైగా చూసేశారు. హారర్ మూవీలో సీన్లను
తలపించేలా తల 180 డిగ్రీల్లో ముందుకు, వెనక్కూ, పక్కకు తిల తిప్పుతుంటే
చూసిన వాళ్ళకు నోట మాట రావడం లేదు. అయితే పొరబాటున కూడా మిగతా పిల్లలెవ్వరూ
ఈ ఫీట్ ను ట్రై చేయకండి అని వార్నింగ్ కూడా ఇస్తున్నారు.
ఈ పిల్లాడిని చూడాలనుకొంటే ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి.
0 comments:
Post a Comment