CSS Drop Down Menu

Wednesday, May 31, 2017

ఇకపై "అల్పాహారం"తో "ఐస్ క్రీమ్" తీసుకోండి ! ఎందుకంటే ?

వేసవిలో ఐస్‌క్రీమ్ తినాలంటే పిన్నలు, పెద్దలు ఆసక్తి చూపుతాం. ఐస్‌క్రీమ్ అంటేనే వయోభేదం లేకుండా అందరూ ఇష్టపడి తింటుంటారు. కానీ కొంతమంది.. జలుబు చేస్తుందనే, తలనొప్పి వస్తుందనో ఐస్‌క్రీమ్ తీసుకోకుండా.. పిల్లలకు ఐస్‌క్రీములు పెట్టకుండా ఉంటారు. అవన్నీ ఉత్తుత్తి భయాలేనని ఐస్ క్రీమ్ తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుందంటున్నారు.. ఆరోగ్య నిపుణులు.
ఉదయం పూట అల్పాహారంతో ఐస్ క్రీమ్ తీసుకునే వారు రోజంతా చురుకుగా ఉంటారని ఇటీవల నిర్వహించిన పరిశోధనలో వెల్లడైంది. ఐస్‌క్రీమ్‌ను రోజూ అల్పాహారం తర్వాత తీసుకునే వారిలో మెదడు చురుగ్గా పనిచేస్తుందని.. పరిశోధకులు గుర్తించారు. ఐస్ క్రీముల్లో విటమిన్ ఎ, బీ, సీ, డీ, ఈలు వుంటాయి. థయామిన్, నియాసిన్‌లు కలిగివుండే ఐస్ క్రీమ్‌లను తీసుకంటే రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ఐస్ క్రీముల్లో ఉండే విటమిన్ కె.. శరీరంలో రక్త గడ్డకుండా చేస్తుంది. అంతేగాకుండా ఐస్ క్రీమ్ శరీరానికి కావలసిన శక్తిని ఇస్తుంది. 

వీటిలో ఉండే  పాలు వంటి ప్రోటీన్లతో కూడిన పదార్థాలే ఇందుకు కారణం. క్యాల్షియం, ఫాస్పరస్ ఐస్‌క్రీముల్లో ఉండటం ద్వారా ఎముకలు, దంతాల సంరక్షిస్తాయి. ఐస్‌క్రీముల్లోని మినరల్స్ కిడ్నీలోని రాళ్లను కరిగిస్తాయి. ఐస్ క్రీమ్‌ను తీసుకుంటే ఒత్తిడిని దూరం చేసుకోవచ్చు. ఒత్తిడికి గురిచేసే హార్మోన్లను హ్యాపీ హార్మోన్లుగా మార్చేస్తాయి. అంతేకాదండోయ్.. క్యాన్సర్‌ను తగ్గించే గుణం కూడా ఐస్ క్రీముల్లో పుష్కలంగా ఉంది. కోలన్ క్యాన్సర్‌ను ఐస్ క్రీమ్ దూరంగా ఉంచుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
Monday, May 29, 2017

మీ GMAIL లో "చదవని" Emails అన్నిటిని ఒకేసారి తొలగించడం ఎలాగో తెలుసా?


మరిన్ని వీడియోస్ :-

బాహుబలిలో పాత్రదారుల బొట్టు వెనుకనున్న అంతరార్ధం  https://youtu.be/Z2NPcyh-0uIHow To Generate New SBI ATM PIN By Sending SMS
https://youtu.be/8E3H7Z3AcYMHouses Built Around Trees Without Cutting ThemWednesday, May 24, 2017

ఫోటోలు "కదిలేలా" చేయడం ఎలాగో తెలుసా?


మీవి గాని, మీ ఫ్రెండ్స్ ఫోటోలు గాని, లేదా ఏ ఫోటో అయినా  ఈ క్రింది వీడియో లో చూపిన విధంగా చేసి "కదిలే" ఫోటోలతో  మీ ఫ్రెండ్స్ ని ఆశ్చర్యపరచండి. మీరు తయారుచేసిన  ఫోటోలు "షేర్" కూడా చేసుకోవచ్చు.


నా యొక్క మరిన్ని వీడియోలు చూడాలనుకుంటే "బ్లాగ్" లో పైన ఉన్న 'MY VIDEOS' ని క్లిక్ చేసి చూడండి. నా యొక్క "బ్లాగ్"ను ఆదరించినట్లుగా నా "YOUTUBE CHANNEL" కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నాను. నా CHANNEL ని Subscribe చేసి ప్రక్కనే ఉన్న BELL ని క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టబోయే మరిన్ని వీడియోలని నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోగలరు.

Monday, May 22, 2017

ఫోటో తీసి సెర్చ్ చేస్తే చాలు ! "గూగుల్ లెన్స్" టెక్నాలజీలో మరో విప్లవం !!

గూగుల్ నుంచి సరికొత్త ఫీచర్లు మార్కెట్లోకి రానున్నాయి. టెక్ దిగ్గజంగా పేరున్న గూగుల్.. ఆండ్రాయిడ్ గో, కొత్త వీఆర్ హెడ్ సెట్, గూగుల్ లెన్స్ వంటి కీలకమైన వాటిని ప్రవేశపెట్టనున్నట్లు గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ కాలిఫోర్నియాలో జరిగిన గూగుల్ డెవలపర్ల సమావేశంలో ప్రకటించారు. వీటిలో గూగుల్ ఫ్యాన్స్‌ను ఎక్కువగా ఆకట్టుకున్నది గూగుల్ లెన్స్. దీన్ని టెక్నాలజీలో మరో విప్లవంగా అభివర్ణించిన పిచాయ్.. గూగుల్ లెన్స్‌ గురించి చెప్పుకొచ్చారు. 

గూగుల్‌లో ఇప్పటిదాకా సమాచారం కోసం వెతికేటప్పుడు గూగుల్ టెక్ట్స్ ఎంటర్ చేసి వెతికేవాళ్లం. ప్రస్తుతం గూగుల్ లెన్స్ ద్వారా మన స్మార్ట్ ఫోన్లో దేన్నైనా ఫోటో తీసి సెర్చ్ చేసుకోవచ్చు. అంటే మనకు సమాచారం కావాల్సిన వస్తువును లేదా సమాచారాన్ని ఫోటో తీసి ఇమేజ్ సెర్చ్ చేస్తే సరిపోతుంది. 

దాని గురించి వివరాలు తెలియవస్తాయి. ఇందుకోసం స్మార్ట్ ఫోన్లో 'గూగుల్ లెన్స్' యాప్‌ను డౌన్ లోడ్ చేసుకోవాలి. అదే పువ్వును గూగుల్ లెన్స్‌లో ఫోటో తీస్తే చాలు ఇందుకు సంబంధించిన సమాచారం మొత్తం వచ్చేస్తుంది. ఇంకా ఇతర భాషలకు చెందిన ప్రాంతాలకు వెళ్లినప్పుడు ఆ ప్రాంతం, ఆ ప్రాంతానికి చెందిన వంటకాల గురించి తెలుసుకోవాలంటే.. వాటిని ఫోటో తీసి సర్చ్ చేస్తే ఫుల్ డీటైల్స్ వచ్చేస్తాయి.

Saturday, May 20, 2017

ఒక బిడ్డ చాలు ! రెండోబిడ్డ వద్దంటున్న ఉద్యోగినులు !! ఎందుకో తెలుసా ?

పిల్లల పెంపకం పట్ల నగరంలో జీవించే మహిళలు విముఖత చూపిస్తున్నారట. నగర భారతంలో ఉద్యోగాలు చేస్తున్న మహిళల్లో 35 శాతం మంది మహిళలు.. పిల్లలను పెంచేందుకు.. వారితో వెచ్చించే సమయం, ఓపిక లేకపోవడంతో ఒకే సంతానంతో సరిపెట్టుకుంటున్నారని అసోచామ్ సర్వేలో తేలింది. అసోచామ్‌ సోషల్‌ డెవలప్‌మెంట్‌ చేపట్టిన ఈ సర్వేలో దాదాపు 500 మంది ఉద్యోగినులు రెండవ సంతానాన్ని కోరుకోవడం లేదని తెలియవచ్చింది. ఒక మెటర్నిటీ లీవ్ ఓకే కానీ రెండో మెటర్నిటీ లీవులు తీసుకుని తమ ఉద్యోగాన్ని, పదోన్నతిని పణంగా పెట్టలేమని ఉద్యోగినులు వాపోతున్నారు. ఉద్యోగం ఆవశ్యం కావడంతో పిల్లల పెంపకం ఆసక్తి చూపలేని పరిస్థితి ఏర్పడుతుందని వారు చెప్తున్నారు. ఈ సర్వేను అహ్మదాబాద్‌, బెంగుళూర్‌, చెన్నై, హైదరాబాద్‌, ఢిల్లీ, ఇండోర్‌, జైపూర్‌, కోల్‌కతా, లక్నో, ముంబయి వంటి పది నగరాల్లో నిర్వహించారు. 

ఉద్యోగంలో ఒత్తిడి, ఇంట్లో పని కారణాలతో చాలామంది తల్లులు ఒకే సంతానంతో సరిపెట్టుకోవాలని భావిస్తున్నారని సర్వే తేల్చింది. ఒకే సంతానం కలిగిన 1500 మంది పనిచేసే తల్లులను అసోచామ్‌ సర్వే పలుకరించింది. ఉద్యోగం, ఇల్లును సమన్వయం చేసుకుంటూ వస్తున్నామని.. ఇలాంటి పరిస్థితుల్లో రెండో సంతానంపై దృష్టి పెట్టట్లేదని సర్వేలో తేలింది.

Friday, May 19, 2017

లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే "బీరువా"ని ఏం చెయ్యాలో తెలుసా ?

ఇంట్లో బీరువా ఏవిధంగా ఉంటే శ్రీ మహాలక్ష్మీ అనుగ్రహం లభిస్తుందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవండి. మీ ఇంట్లో ఉండే బీరువా ఏ ముఖాన వుందో తెలిస్తే.. ఆ ఇంట లక్ష్మీ కటాక్షం ఏ మేర వుందో చెప్పేయవచ్చు. మనం వాడే డబ్బును, బంగారు ఆభరణాలను, కీలక పత్రాలను బీరువాలో జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఆ బీరువా లక్ష్మీదేవి అనుగ్రహం లభించే దిశలో ఉండాలని వాస్తు నిపుణులు అంటున్నారు. బీరువా ఎప్పుడూ నైరుతిలోనే ఉండాలి. నైరుతి అంటే దక్షిణానికి పడమరకు మధ్యలో ఉన్నటువంటి ప్రదేశం. బీరువా డోర్స్ ఓపెన్ చేస్తే అది ఉత్తరం వైపు చూస్తూ వుండాలి. ఇక బీరువా తెరవగానే చక్కని సువాసన రావాలి. అంతేకానీ పాతబట్టల వాసన లేదా బొద్దింకలు గుడ్లు పెట్టిన వాసనా రాకూడదు. అలాంటివి వస్తే ఆ ఇంట లక్ష్మీదేవి నివాసం చేదు. కుబేర ముగ్గును నీలం రంగు పెన్నుతో వేసి ఆ ముగ్గును బీరువా లోపలి అరలో పెట్టుకోవాలి.

ఈ ముగ్గుకు నాలుగు వైపులా పసుపు, కుంకుమ బొట్టు పెట్టాలి. ఈ కుబేరముగ్గు మీద బంగారాన్ని, డబ్బును పెట్టుకుంటే లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. బీరువాలో పూజా సామగ్రి దుకాణంలో అమ్మే వట్టివేళ్లు (చెట్టువేళ్లు) తీసుకుని, పచ్చకర్పూరము సుగంధ ద్రవ్యాల్ని ఒక వెండి కప్పులో కానీ, రాగి కప్పులో కానీ పెట్టుకుని బీరువాలో పెట్టుకోండి. దానివల్ల ధనవృద్ధి జరుగుతుంది.

బీరువాపై ఎప్పుడూ దేవుని  ఫోటోలు అతికించకూడదు. శ్రీశైలం, శ్రీకాళహస్తి, తిరుపతిలో అమ్మేటువంటి ఇనుప స్టిక్కర్లు బీరువాలపై అంటించకూడదు. ఎందుకంటే బీరువా పడకగదిలో ఉంటుంది కాబట్టి, పడకగదిలో ఉండే బీరువాపై దేవుడి ఫోటోలు ఉండకూడదు. 

ఎప్పుడూ కూడా బీరువాపై ఓ వైపు శుభం లాభం ఇంకో వైపు స్వస్తిక్ గుర్తు మాత్రమే ఉండాలి. ఆ స్వస్తిక్ కూడా అపసవ్య స్వస్తిక్ కాదు.సవ్య స్వస్తిక్ అని, అవి కూడా పసుపు రంగులో కుంకుమ తోటి బొట్లు పెట్టినటువంటిదై వుండాలి. ఇలా చేస్తే మీరు లక్ష్మీదేవి అనుగ్రహంతో ఐశ్వర్యాన్ని పొందవచ్చునని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు.

Thursday, May 18, 2017

"అనసూయ" ఫై "ఆలీ" ఇబ్బందికర వ్యాఖ్యలు !

వైవిధ్యమైన పాత్రలతో, తనదైన కామెడీతో ప్రేక్షకులను ఆకట్టుకొన్న సీనియర్ నటుడు ఆలీ ఇటీవల పలు వివాదాలకు కేంద్ర బిందువు అవుతున్నాడు. సినీ కార్యక్రమాలు, ప్రైవేటు ఈవెంట్లలో హీరోయిన్లు, యాంకర్లను టార్గెట్ చేసుకొని అలీ అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేయడంపై అనేక విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పలువురు అలీ తీరును తప్పుపటినా నోటి దురుసును ఆపుకోవడం లేదనే వాదన వినిపిస్తున్నది. తాజాగా అనసూయను ఉద్దేశించి ఆలీ చేసిన వ్యాఖ్యలు ఆమెకు ఇబ్బందికరంగా మారడం గమనార్హం.
ఇటీవల ఓ అవార్డు ఫంక్షన్‌కు ఆలీ, అనసూయ హోస్ట్‌లుగా వ్యవహరించారు. ఈవెంట్‌లో పలువురిని వేదికపైకి జంటలుగా ఆహ్వానించారు. ఆ క్రమంలో వేదికపైకి పిలిచే వంతు రాజ్ తరుణ్‌కు రాగా అనసూయ ఆయనను ఆహ్వానించింది. చాలా సరదాగా ఉండే రాజ్ తరుణ్ ‘నాకు తోడు ఎవరు లేరా' అని కామెంట్ చేశారు. దాంతో అనసూయ స్వయంగా వేదిక తీగి రాజ్ తరుణ్‌ను తోడ్కొని వచ్చింది.

ఈ సంఘటనను చూసిన ఆలీ మరోసారి నోటికి పనిచెప్పాడు. వేదికపైకి వస్తున్న రాజ్ తరుణ్, అనసూయను ఉద్దేశించి ఆలీ కామెంట్ చేశాడు. ‘ఎవరు తోడు కావాలన్నా వెంటనే వెళ్లిపోతావా?‘ అని వ్యాఖ్యలు చేయడంతో అనసూయ షాక్ గురైంది. ఆ సమయంలో ఆ కామెంట్‌ను ఎంజాయ్ చేసినా.. ఆలీకి ఇంకా వెటకారం తగ్గలేదు అని అనుకోవడం జరిగిందట.


Monday, May 15, 2017

"మెగాస్టార్" ఫై "మణిశర్మ" షాకింగ్ కామెంట్స్ ?

సంగీత దర్శకుడు, మెలోడీ బ్రహ్మ మణిశర్మ టాప్ హీరోల నుంచి కుర్ర హీరోల వరకు సంగీతం సమకూర్చారు. తాజాగా ఆయనకు అవకాశాలు తగ్గిపోతూ వచ్చాయి. ఒకప్పుడు ఇండస్ట్రీని షేక్ చేసే సంగీతం సమకూర్చిన మణిశర్మను ప్రస్తుతం పట్టించుకునే వారు లేకపోయారు. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో మణిశర్మ మాట్లాడారు. ప్రస్తుతం వస్తున్న తెలుగు పాటలపై, ట్యూన్స్‌పై సంచలన కామెంట్స్ చేశారు.
ప్రస్తుతం పాటల స్థాయి తగ్గడానికి గల కారణం హీరోలేనని చెప్పేశారు. హీరోల నిర్ణయాలకు అనుగుణంగా పాటల్ని ట్యూన్ చేయాల్సిన పరిస్తితులు ఏర్పడటంతో నేటి సినిమాల పాటల స్థాయి దిగజారిపోయిందంటూ మణిశర్మ ఘాటుగా విమర్శించారు. ఇదే సందర్భంలో మెగాస్టార్ చిరంజీవిపై కూడా మణిశర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. 

చిరంజీవి ఆల్ టైం హిట్ పాటల్లో 'చూడాలని ఉంది' లోని 'రామ్మా చిలకమ్మా' సాంగ్ గురించి మాట్లాడుతూ ఉదిత్ నారాయణ పాడిన ఈ పాట ఆ సినిమా నుండి తొలిగించమని చిరంజీవి చెప్పినా తాను వినకుండా అదే పాటను ఆ సినిమాలో ఉంచడంతో ఆపాట అప్పట్లో బంపర్ హిట్ అయ్యిందని మణిశర్మ గుర్తు చేశారు. 

అప్పట్లో టాప్ హీరోలు సంగీత దర్శకుడు చెప్పే మాటకు గౌరవం ఇచ్చేవారని ప్రస్తుతం అలాంటి పరిస్థితులు లేవన్నారు. ఫిలిమ్ ఇండస్ట్రీలో ప్రస్తుత వాతావరణానికి ఇమడలేక తాను చాలా అవకాశాలు వదులుకున్నానని మణిశర్మ అన్నారు. తనకు కథే ముఖ్యమని.. హీరోలు చెప్పే విధంగా బాణీలు, వారి ఛాయిస్ వల్ల సంగీతానికి కథతో సందర్భాలతో పనిలేకుండా పోతోంది. దీని వల్ల సంగీత దర్శకులపై ఒత్తిడి ఎక్కువైంది. 

అందుకే తాను చిన్న దర్శకులతో పనిచేస్తున్నానని మణిశర్మ వివరించారు. చిన్న సినిమాల్లో వచ్చే పాటలే బాగున్నాయని.. ఇతరుల దగ్గర చేతులు కట్టుకుని పనిచేయలేనని.. ఎవరి దయతోనూ తాను బతకడం లేదని మణిశర్మషాకింగ్ కామెంట్స్ చేశారు.

Friday, May 12, 2017

పాదాల్లో మంటలా ?

కాలి పాదాల్లో ఇన్ఫెక్షన్లు, మంటలు వేధిస్తుంటే.. ఈ టిప్స్ పాటించండి. రెండు చెంచాల పసుపులో కాసిని నీళ్లు కలిపి మిశ్రమంలా చేసుకోవాలి. దీన్ని పాదాలకు పూతలా వేసుకోవాలి. అది ఆరాక కడిగేసుకోవాలి. ఇలా చేయడం వల్ల పాదాల్లోని రక్తప్రసరణ సక్రమంగా ఉంటుంది. నొప్పి మంట తగ్గుతాయి. పాదాలు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. 

యాపిల్‌ సిడార్‌ వెనిగర్‌ అందుబాటులో ఉంటే ఈ సమస్య నుంచి పరిష్కారం పొందొచ్చు. చిన్న టబ్బులో నీళ్లు తీసుకుని అందులో రెండు చెంచాల యాపిల్‌ సిడార్‌ వెనిగర్‌, కొద్దిగా ఎప్సంసాల్ట్‌ వేసి పాదాలను అందులో ఉంచాలి. ఇరవై నిమిషాల తరవాత కాళ్లను శుభ్రంగా కడిగేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.  

అర బకెట్‌ నీళ్లలో కొన్ని ఐస్ ముక్కలు వేసి అందులో కాళ్లని ఉంచాలి. ఇలా చేయడం వల్ల మంట, వాపు తగ్గుతాయి. కాసేపయ్యాక మర్దన చేసుకుని మళ్లీ కాళ్లను నీళ్లలో ఉంచాలి. రోజులో ఒకటిరెండుసార్లు ఇలాచేస్తే ఉపశమనం ఉంటుంది.


Thursday, May 11, 2017

మధుమేహ రోగులు ఏ పళ్ళు తినాలో తెలుసా ?

మనం తీసుకునే ఆహారంలో ఉండే కాంపోనెంట్స్ రక్తంలో చక్కెరలు పెరగడం, తరగడాన్ని నిర్దేశిస్తాయి. అందుకే మధుమేహం బారిన పడిన వారు మందుల కంటే ముందు ఏ తరహా ఆహారం తీసుకోవాలి, దేన్ని తీసుకోరాదన్న అవగాహన పెంచుకోవాలి. కనుక వారు తీసుకోవాల్సిన ఆహారం, పండ్ల గురించి పోషకాహార, వైద్య నిపుణులు ఏం చెబుతున్నారో చూద్దాం.

దానిమ్మ పండులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షణ కల్పిస్తాయి. దీర్ఘకాలంగా వ్యాధులతో బాధ పడేవారికి దానిమ్మ చాలా మంచిది. ఇందులో చక్కెరలు స్వల్ప స్థాయిలో ఉంటాయి గనుక మధుమేహం గల వారు తీసుకోవచ్చని వైద్యులు చెపుతున్నారు. 

డయాబెటిస్ ఉన్న వారు విటమిన్ సి తీసుకోవడం ఎంతో అవసరం. విటమిన్ సి కమలా పండులో పుష్కలంగా లభిస్తుంది. అందువల్ల ప్రతి రోజుకు ఒక పండును తీసుకుంటే మచిందట. పైగా, ఈ పండు తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి పెరిగిపోతుందన్న భయం అక్కర్లేదనీ, ఎందుకంటే ఇందులో చక్కెర స్థాయులు తక్కువే.

జామ పండులో మధుమేహాన్ని నియంత్రించే గుణాలు ఉన్నాయి. సాధారణంగా షుగర్ వ్యాధిగ్రస్తులకు మలబద్దకం సమస్య వేధిస్తుంది. జామకాయలో ఉండే పీచు కారణంగా విరేచనం సాఫీగా జరుగుతుంది. జామలో విటమిన్ ఏ, సీ అధికంగా ఉంటాయి. అందువల్ల జామపండును రోజుకు ఒక్కటి తినడం ప్రయోజనదాయకం.

వేసవికాలంలో విరివిగా లభించే పుచ్చకాయను కూడా తినొచ్చట. పుచ్చకాయలో గ్లైసిమిక్ ఇండెక్స్ (జీఐ) ఎక్కువగానే ఉన్నా గ్లైసిమిక్ లోడ్ అన్నది తక్కువ. కనుక పరిమితంగా తీసుకోవచ్చని నిపుణులు చెబుతారు. పుచ్చకాయలో అధికంగా ఉండే పొటాషియం కిడ్నీల పనితీరు చక్కగా ఉండేందుకు ఉపకరిస్తుందట. షుగర్ వ్యాధి ఉన్న వారిలో కిడ్నీల వైఫ్యలం ముప్పు ఉంటుంది. ఇక డయాబెటిస్‌లో నరాలు దెబ్బతినడం కూడా దోహదపడుతుందట.

బొప్పాయిలో విటమిన్, మినరల్స్ సమృద్ధిగా ఉన్నాయి గనుక మధుమేహులకు ఈ పండు మంచి చేస్తుంది. అలాగే, నేరేడు పండ్లు మధుమేహాన్ని బాగా నియంత్రిస్తాయట. నేరేడు పండు తిన్న తర్వాత అందులో ఉండే గింజలను పౌడర్ చేసుకుని తీసుకున్నా మంచి ఫలితం కనిపిస్తుందట. 

ఉసిరిలో పుష్కలంగా విటమిన్ సి, ఫైబర్ ఉంటాయి. కనుక మధుమేహం ఉన్న వారు ఉసిరితో చేసిన వంటలు తీసుకోవడం మంచిదని వైద్యులు చెపుతున్నారు. అలాగే, యాపిల్‌లో ఉండే జీఐ వేల్యూ 20. కొన్ని రకాల యాపిల్స్‌లో ఇంతకంటే తక్కువే ఉంటుంది. కనుక రోజూ యాపిల్‌ను నిక్షేపంగా తీసుకోవచ్చు. బ్లూ బెర్రీస్ లేదా ద్రాక్ష పండ్లతో కలిపి యాపిల్ తినడం వల్ల టైప్ 2 డయాబెటిస్ రిస్క్‌ను తగ్గుతుందని అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్ పేర్కొంది.

Thursday, May 4, 2017

రాసలీలల "పడకగదులు"గా మారుతున్న విమానాశ్రయాలు !

"కాదేది కవిత కనర్హం" అని అన్నారు మన పెద్దలు. ఈ సామెతను అక్షరాలా నిజం చేస్తున్నారు ఆ దేశ విమాన ప్రయాణికులు. ఎలాగంటారా? తమ శృంగార కార్యకలాపాల కోసం ఏకంగా విమానాలు, ఎయిర్‌పోర్టులు, మరుగుదొడ్లు, ఎయిర్‌పోర్టులోని వీఐపీ లాంజ్‌లను వాడేసుకుంటున్నారు. పైగా, ఏమాత్రం కాస్తంత సమయం చిక్కినా.. తమ భార్యలతో ఎంజాయ్ చేస్తున్నారట. తాజాగా నిర్వహించిన ఓ అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. ఈ వివరాలను పరిశీలిస్తే... 

అమెరికా దేశంలో ప్రతి 10 మంది ప్రయాణికుల్లో ఒకరు విమానాశ్రయాల్లోనూ రాసలీలలు సాగిస్తున్నారని తాజా అధ్యయనంలో వెల్లడైంది. విమానాశ్రయాలే కొందరికి పడకగదులుగా మారుతున్న విషయం అమెరికాలో సంచలనం రేపింది. 

విమానం ఎక్కేందుకు 3 గంటలు ముందుగా విమానాశ్రయానికి వస్తుండటంతో ఉన్న ఖాళీ సమయంలో విమానాశ్రయం మరుగుదొడ్లు, వీఐపీ లాంజ్‌లే కాదు విమానాల్లోనూ రాసలీలలు సాగిస్తున్నారని అధ్యయనంలో తేలింది. 

విమాన ప్రయాణికుల్లో ఎక్కువ భాగం తమ భాగస్వాములతోనే రాసలీలలు సాగిస్తున్నారట. మరో ఐదు శాతం మంది మాత్రం  విమానాశ్రయాల్లో కనిపించిన అపరిచితులు, విమానయాన సిబ్బందితో కూడా లైంగిక చర్యలకు దిగుతున్నామని ప్రయాణికులే సర్వేలో అంగీకరించడం కొసమెరుపు. 


Tuesday, May 2, 2017

SBI ATM PIN మరిచిపోయారా ? ఐతే ఇలా చేసి సులువుగా కొత్త పిన్ పొందండి !

మీ యొక్క "స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా ఎ టి యం కార్డు పిన్" మరిచి పోతే ఎలాగని కంగారు పడుతున్నారా ? బ్యాంకుల చుట్టూ తిరగనవసరం లేకుండా సులువుగా మీరు కొత్త పిన్ పొందడానికి ఈ క్రింది వీడియో  క్లిక్ చేసి అందులో చూపిన విధంగా చేయండి. అందరికి ఉపయోగపడే  ఈ వీడియో  మీరు చూసి మీ మిత్రులకు కూడా షేర్ చెయ్యండి.