CSS Drop Down Menu

Tuesday, December 8, 2015

బిస్కట్లు తింటే "జ్ఞాపకశక్తి " తగ్గిపోతుందా?

బిస్కట్లు తింటే బుర్ర పనిచేయదా? అవుననే అంటున్నాయి కొత్త పరిశోధనలు. అదేపనిగా బిస్కట్లు, కేకులు తింటే మెమొరీ దెబ్బతినే ప్రమాదముందంటున్నారు. దీనికి కారణం బిస్కట్లు, కేకుల ప్రాసెసింగ్ సమయంలో బిస్కట్లు  కరకరలాడేందుకు, కేకులకు మంచి ప్లేవర్ రావడానికి వాడే ట్రాన్స్‌ఫ్యాట్స్ అనే కొన్నిరకాల కొవ్వు పదార్దాలే. దీనితో బాటు హైడ్రోజెనేటెడ్ ఆయిల్స్ వాడటం వల్ల ఆరోగ్యంపై చెడుప్రభావం చూపుతుందని సైంటిస్టులు తేల్చారు.
 ట్రాన్స్‌‌‌‌ఫ్యాట్స్ అధికంగా ఉండే బిస్కట్లు, కేకులు ఎక్కువగా తినేవారిలో మెమొరీ పవర్ తగ్గి పోయే ప్రమాదముందంటున్నారు సైంటిస్ట్‌లు. బిస్కట్లు, కేకుల్లో ఉండే ట్రాన్స్ ఫ్యాట్స్ ప్రభావం గురించి యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, శాండియాగో స్కూల్ ఆఫ్ మెడిసిన్‌కు చెందిన శాస్ర్తవేత్తలు 45 ఏళ్లలోపు వయసున్న వెయ్యిమందిపై పరిశోధనలు చేశారు. ట్రాన్స్‌ఫ్యాట్స్‌తో కూడిన బిస్కట్లు, కేకులు అధికంగా తిన్నవారిలో జ్ఞాపకశక్తి తగ్గిపోవడాన్ని గమనించారు. మరికొంతమందిలో అధిక బరువు, గుండె సంబంధిత వ్యాధులు బయట పడ్డాయి. బ్రిటన్‌లో ఈ ఫ్యాట్స్ వాడకాన్ని దాదాపు నిషేధించినంత పని చేశారు.

0 comments:

Post a Comment