CSS Drop Down Menu

Wednesday, December 23, 2015

"పాదాల పగుళ్ళ" నివారణకు చిట్కాలు !

మారుతున్న వాతావారణ పరిస్థితుల కారణంగా మానవ శరీరానికి అప్పుడప్పుడు కొన్ని సమస్యలు ఏర్పడుతాయి. అందులో ఇతర సమస్యల గురించి కాస్త పక్కనపెడితే.. సాధారణంగా చలికాలంలో పాదాల పగుళ్ల సమస్య ఎక్కువగా బాధిస్తుంది. ఇది కేవలం ఆడవాళ్లకే కాదు.. మగవాళ్లక్కూడా సంభవిస్తుంది. ఈ సమస్య మొదట్లో అంతగా ప్రభావం చూపదుగానీ.. రానురాను చాలా ప్రాబ్లమ్స్’ను క్రియేట్ చేసే అవకాశాలున్నాయి. కాబట్టి.. ఈ పగుళ్ల లక్షణాలు కనబడిన వెంటనే వాటిని నివారించుకుంటే మంచిది.

1. వంటనూనె : వంటకాల్లో ఉపయోగించే ఏ నూనెతోనైనా ఈ సమస్యను పరిష్కరించుకోవచ్చు. ముందుగా పాదాలను ప్యూమిస్‌ స్టోన్‌తో రుద్ది మృత చర్మం, మురికి వదిలించాలి. తర్వాత శుభ్రంగా కడిగి తుడిచి నూనె అప్లై చేయాలి. తర్వాత సాక్స్‌ వేసుకుని పడుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా కొన్ని రోజులపాటు చేస్తే మంచి ఫలితాన్ని పొందవచ్చు.

2. బియ్యం పిండి : బియ్యం పిండిలో కాస్త తేనె, యాపిల్‌ సెడార్‌ వెనిగర్‌ చేర్చి పేస్ట్‌లా తయారుచేయాలి. గోరువెచ్చని నీటిలో 10 నిమిషాలపాటు పాదాలను నానబెట్టిన అనంతరం ఈ పేస్ట్‌తో రుద్ది శుభ్రంగా కడగాలి. తడి లేకుండా తుడిచి నూనె పూసుకుని సాక్స్‌ వేసుకుని పడుకోవాలి.
 
3. వేపాకు : ఈ ఆకులో పాదాల పగుళ్లనుంచి రక్షణ కల్పించే యాంటీఫంగల్‌ లక్షణాలు పుష్కలంగా వుంటాయి. గుప్పెడు వేపాకుకు స్పూను పసుపు కలిపి మెత్తగా రుబ్బాలి. ఈ పేస్ట్‌ను పాదాల పగుళ్లకు అప్లై చేసి అరగంట తర్వాత శుభ్రంగా కడగాలి. తడి ఆరాక నూనెతో మర్దిన చేసుకోవాలి.

4. రోజ్‌ వాటర్‌ - గ్లిజరిన్‌ : గ్లిజరిన్‌ చర్మాన్ని మృదువుగా తయారుచేస్తే.. రోజ్‌ వాటర్‌లోని ఎ, డి, ఇ, సి, బి3 విటమిన్లు చర్మానికి పోషణనిస్తాయి. ఈ రెండిటినీ సమపాళ్లలో కలిపి రోజూ నిద్రపోవడానికి ముందు పాదాలకు అప్లై చేసి ఉదయాన్నే కడిగేసుకోవాలి.

5. ప్యారాఫిన్‌ వ్యాక్స్‌ : పారాఫిన్‌ వ్యాక్స్‌కు ఆవ నూనె లేదా కొబ్బరి నూనెలో కలిపి వేడిచేయాలి. వ్యాక్స్‌ పూర్తిగా కరిగేంతవరకూ వేడిచేసి పూర్తిగా చల్లార్చాలి. ఈ మిశ్రమాన్ని రాత్రి పడుకోవడానికి ముందు పాదాలకు అప్లై చేసి ఉదయాన్నే కడిగేయాలి.

0 comments:

Post a Comment