CSS Drop Down Menu

Friday, February 5, 2016

"పొట్ట తగ్గాలంటే" నిద్రపోయేముందు ఈ డ్రింక్ త్రాగండి !

బెల్లీ ఫ్యాట్ కరిగించుకోవడం చాలా కష్టమైన టాస్క్. చాలా స్లిమ్మింగ్ ట్రిక్స్, డైటింగ్ హ్యాబిట్స్ ఫాలో అయినా ఫెయిల్ అవుతున్నాయి. వాటిని ఫాలో అయినా ఫలితం కనిపించనప్పుడు.. మధ్యలోనే వదిలేయడం కామన్ గా జరిగిపోతోంది. కానీ మెటబాలిజం ప్రక్రియ ఎలా జరుగుతుందని.. దాన్ని ఎలా సక్రమంగా సాగేలా జాగ్రత్తపడతారో.. వాళ్లకు బెల్లీ ఫ్యాట్ ఈజీగా కరిగిపోతుంది.
మెటబాలిక్ రేటు వయసు, జెండర్, మజిల్ మాస్ ని బట్టి వర్క్ అవుతుంది. మహిళల్లో కంటే.. మగవాళ్లలలో మెటబాలిజం స్థాయి ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే.. మగవాళ్లలో కండరాల సౌష్టవం బలంగా ఉంటుంది కాబట్టి. అయితే మెటబాలిజం రేటుని పెంచితే.. వయసు, జెండర్ తో సంబంధం లేకుండా.. బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోవచ్చు. అయితే మెటబాలిజం స్థాయిని పెంచడానికి ఈ సింపుల్ డ్రింక్ ప్రయత్నించండి. ఇది మీ బెల్లీ ఫ్యాట్ కరిగించడానికి బాగా సహాయపడుతుంది. రాత్రి పడుకోవడానికి ముందు దీన్ని తీసుకోవాలి.
2 గ్రేప్ ఫ్రూట్స్ , 1 టేబుల్ స్పూన్ అల్లం రసం, అర టీ స్పూన్ దాల్చిన చెక్క, అరగ్లాసు గోరువెచ్చని నీళ్లు తీసుకోవాలి. వీటన్నింటిని కలిపి బాగా మిక్స్ చేయాలి. రాత్రి నిద్రపోవడానికి ముందు ఈ జ్యూస్ తాగాలి. ఇలా 12 రోజులు తాగిన తర్వాత మూడు రోజులు గ్యాప్ ఇవ్వాలి. మళ్లీ 12 రోజులు కంటిన్యూగా తాగాలి. ఇలా ఈ జ్యూస్ ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరానికి ఎనర్జీ అందడంతో పాటు, బెల్లీ ఫ్యాట్ సులభంగా కరిగిపోతుంది.


Thursday, February 4, 2016

"పాత టూత్ బ్రష్" పడేస్తున్నారా ? ఐతే ఒక్కసారి ఇది చదవండి!

టూత్ బ్రష్ మార్చినప్పుడల్లా.. పాత టూత్ బ్రష్ పడేస్తూ ఉంటాం. ఇలా ఎన్ని టూత్ బ్రష్ లు డస్ట్ బిన్ లో చేరుంటాయో కదూ. కానీ.. ఇకపై టూత్ బ్రష్ ని పడేయకుండా.. ఇంటి క్లీనింగ్ లో భాగం చేసుకోండి. ఇల్లు శుభ్రం చేసేటప్పుడు పాత టూత్ బ్రష్ మీకు ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. టూత్ బ్రష్ ని చాలా క్రియేటివ్ గా ఉపయోగించడం తెలిస్తే.. ఇంట్లోని వస్తువులను తళతళ మెరిపించవచ్చు. పాత టూత్ బ్రష్ ఉపయోగించుకునే క్రియేటివ్ ఐడియాస్ మీకోసం.

*ట్యాప్స్ చుట్టూ పేరుకున్న మురికి వదిలించడానికి పాత టూత్ బ్రష్ చక్కటి పరిష్కారం. టూత్ బ్రష్ ని వెనిగర్ లో ముంచి ట్యాప్ చుట్టూ రుద్దడం వల్ల మురికి పోయి కొత్తవాటిలా మెరుస్తాయి. 

*షూస్ కి పేరుకున్న బురద, దుమ్ము, ధూళిని పాత టూత్ బ్రష్ తో ఈజీగా వదిలించవచ్చు.

*ఇక కంప్యూటర్ కీ బోర్డ్స్ లో ఎంత దుమ్ము ఉంటుందో చెప్పనక్కరలేదు. దాన్ని క్లీన్ చేసినా.. సందుల్లో ఇరుక్కున్న దుమ్ము మాత్రం బయటకు రాదు. కాబట్టి.. ఈసారి పాత టూత్ బ్రష్ సహాయంతో కీబోర్డ్ దుమ్ము వదిలించండి.

*దువ్వెనల్లో పేరుకున్న మురికి తొలగించడానికి కూడా పాత టూత్ బ్రష్ చక్కగా ఉపయోగపడుతుంది.

 *మీ నగల్లో మురికి చేరుకుందా ? అయితే.. పాత టూత్ బ్రష్ తీసుకుని క్లీన్ చేసి చూడండి. కొత్తవాటిలా మెరిసిపోతాయి.

 *అంతేకాదండోయ్.. మీ పెదాలపై ఉండే డెడ్ సెల్స్ తొలగించడానికి కూడా మీ పాత టూత్ బ్రష్ ఉపయోగించవచ్చు. బ్రష్ ని నీటిలో తడిపి.. పెదాలపై రుద్దడం వల్ల డెడ్ స్కిన్ సెల్స్ తొలగిపోతాయి.

 చూశారుగా ఇకపై పాత బ్రష్ ని పడేయకుండా ఇంట్లో  వస్తువులను శుభ్రం చేసుకోవడానికి ఉపయోగించండి.

Wednesday, February 3, 2016

"రాగి పాత్రలో నీళ్ళు త్రాగడం"వల్ల శరీరం పొందే ఆరోగ్యప్రయోజనాలు!

ఆయుర్వేదం ప్రకారం నీటిని రాగిపాత్రలో నిల్వ చేయడం ద్వారా (వాత, కఫా మరియు పిత్తాశయ) వంటి ఈ మూడు దోషాలను మీ శరీరంలో సమతుల్యం చేసే సామర్థ్యంను కలిగి ఉంటుంది. అంతే కాదు ఇది మన శరీరంలో పాజిటివ్ లక్షణాలను ఎక్కువగా కలిగిస్తుంది. రాగిపాత్రలో నీటిని నిల్వచేయడం ఆయుర్వేదం ప్రకారం 'తామ్ర జలం' అంటారు మరియు ఇలా రాగిపాత్రలో నీటిని నిల్వ చేయాలనుకున్నప్పుడు కనీసం ఎనిమిది గంటల సమయం నిల్వచేయాలి. అప్పుడే మంచి ఫలితం ఉంటుంది. రాగిపాత్రలోని నీరు త్రాగడం వల్ల శరీరం పొందే కొన్ని ఆరోగ్యప్రయోజనాలు క్రింది విధంగా ఉన్నాయి.
 
రాగి ప్రకృతి పరంగా ఓలిగో డైనమిక్ అని చెప్పబడుతున్నాయి. (రాగిలో బ్యాక్టీరియా శుద్ది చేసే ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అంతే కాదు ఇది ఇంకా సాధారణ జబ్బులైన డయోరియా, డీసెంటరీ మరియు జాండీస్ వంటి వ్యాధులను నివారించడానికి సహాయపడుతుంది. కాబట్టి, మీరు నీరు కలిషిమతమైనవని మీరు కనుక భావిస్తుంటే, నీటిని రాగిపాత్రలో నిల్వచేసి త్రాగడం వల్ల ఆరోగ్య కరమైన మరియు క్లీన్ వాటర్ ను మీరు త్రాగవచ్చు.
 
నిపుణులు అభిప్రాయం ప్రకారం థైరాయిడ్ వ్యాధితో భాధపడే వారి శరీరంలో కాపర్ చాలా తక్కువ స్థాయిలో ఉంటుంది. రాగిపాత్రలోని నీరు త్రాగడం వల్ల థైరాయిడ్ గ్రంథులు పనితీరు మెరుగుపడవచ్చు.
 
రాగిలో చాలా శక్తివంతమైన రోగ నిరోధక లక్షణాలను కలిగి ఉంది . ఈ కంటెంట్ ముఖ్యంగా నొప్పులను నివారించడానికి ఏకారణం చేతైనా కీళ్లవాతంతో పోరాడటానికి శక్తివంతంగా సహాయపడుతుంది. కాబట్టి, ఇటువంటి నొప్పుల నుండి తక్షణ ఉపశమనం పొందడానికి రాగిపాత్రలోని నీటిని తీసుకోవాలి.
 
 ఆయుర్వేద నిపుణుల ప్రకారం, ప్రతి రోజూ ఉదయం రెగ్యులర్ గా రాగిపాత్రలోని నీటి త్రాగడం వల్ల మొటిమలు లేని ఒక స్పష్టమైన చర్మంను పొందవచ్చునని సలహా.
 
మీ ముఖంలో మరియు శరీరం మీద చర్మంలో సన్నని చారలు, వయస్సు మీదపడుతున్న లక్షణాలు కనబడుతున్నట్లైతే రాగి పాత్రలోని నీరు  ఒక ఉత్తమ హోం రెమెడీ . ఇందులో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ మరియు కణాల ఏర్పాటు లక్షణాలు ఫ్రీరాడికల్స్ తో పోరాడే లక్షణాలు రాగిలో అధికంగా ఉన్నాయి . కొత్తకణాలు ఏర్పాటుకు ,ఆరోగ్యకరమైన చర్మం కణాలు , ఉత్పత్తి లో సహాయపడుతుంది .
 
ఎసిడిటీ , గ్యాస్ లేదా కొన్ని ఆహారాలు జీర్ణం కాకపోవడం వంటి సమస్యలను రాగిపాత్రలోని నీళ్ళు ఒక ఉత్తమ హోం రెమెడీగా సహాయపడుతుంది . ఆయుర్వేదం ప్రకారం మీ పొట్టను డిటాక్స్ ఫై చేసుకోవాలంటే, ఒక పెద్ద గ్లాసు నీళ్ళను ప్రతి రోజూ ఉదయం తీసుకోవాలి.
 
మీరు బరువు తగ్గడానికి మీ డైట్ సక్రమంగా పనిచేయకపోతే, రాగిపాత్రలో నీటిని నిల్వచేసి, రెగ్యులర్ గా త్రాగడం మొదలు పెట్టండి. మీ జీర్ణ వ్యవస్థ మరింత మెరుగ్గా పనిచేస్తుంది . ఫ్యాట్ ను కరిగించి  శరీరం నుండి బయటకు నెట్టివేయడానికి సహాయపడుతుంది .
 
రాగి మన శరీరంలో జీవక్రియలకు అత్యంత అవసరం . సెల్ ఫార్మేషన్ నుండి ఐరన్ షోషణ వరకూ సహాయపడుతుంది.  సెల్ ఏర్పాటు నుండి ఇనుము యొక్క శోషణ లో సహాయం చేస్తుంది. రాగి మన శరీరంలో జీవక్రియలు పనిచేయడానికి అవసరం అయ్యే ముఖ్య ఖనిజం. ఆ కారణం చేత మనల్ని రక్తహీనత నుండి రక్షిస్తుంది.
 
అమెరికన్ క్యాన్సర్ సొసైటీ ప్రకారం , రాగి రక్తపోటు , గుండె రేటు నియంత్రించేందుకు సహాయపడుతుందని కనుగొనబడింది మరియు కొలెస్ట్రాల్ మరియు ట్రైగ్లిజరైడ్ స్థాయిలు తగ్గిస్తుంది . ఇది కూడా ఫలకం వృద్ధి నిరోధించడానికి సహాయపడుతుంది మరియు గుండెకు మంచి రక్తం  ప్రవాహం అనుమతించడానికి రక్తనాళాలుఫై  ప్రభావం చూపుతుంది. గొప్ప ఫలితాలు కోసం రాగి పాత్రలో నిల్వచేసిన నీటినిత్రాగడానికి   ప్రయత్నించండి .
 
చాలా త్వరగా సర్వసాధారణంగా వచ్చే మరొక వ్యాధి క్యాన్సర్. క్యాన్సర్ రోగి ని  బలహీన పరిచేలా చేస్తుంది. అందుకు రాగి ఎలా సహాయం చేస్తుంది? రాగిలోని శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్స్, ఫ్రీరాడికల్స్ మరియు  క్యాన్సర్ కణాలతో పోరాడే  లక్షణాలు అధికంగా ఉన్నాయి .


Tuesday, February 2, 2016

ఆ లింక్ పై క్లిక్ చేస్తే, మీ ఫోన్ నాశనమే ?

స్మార్ట్‌ఫోన్ యూజర్లను టార్గెట్ చేస్తూ ఓ మోసపూరిత వైరస్ ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోంది. ఆకర్షణీయమైన ఆఫర్ల ముసుగులో CrashSafari.com అనే అడ్రస్‌తో వస్తున్న ఈ లింక్ పై క్లిక్ చేసినట్లయితే స్మార్ట్‌ఫోన్ ప్రోగ్రామింగ్ మొత్తం దెబ్బతింటుంది.


వెంటనే ఫోన్ రీస్టార్డ్ ఆప్షన్‌లోకి వెళ్లిపోతోంది. దీంతో మీ స్మార్ట్‌ఫోన్‌లోని వ్యక్తిగత డేటా ఇంకా యాప్స్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోతాయి. CrashSafari లింక్ వ్యక్తిగత కంప్యూటర్ల కంటే స్మార్ట్‌ఫోన్‌ల పై వేగంగా ప్రభావం చూపుతుందని నిపుణులు అంటున్నారు. కాబట్టి ఫ్రెండ్స్.. అర్థంకాని భాషలో వచ్చే మెసేజ్ లింక్స్ పై క్లిక్ చేయకండి.




Monday, February 1, 2016

"దోమ" దెబ్బకు "2018 వరకూ స్త్రీలు గర్భధారణకు దూరం"గా వుండాలంటున్నదేశాలు ?

ఒకప్పుడు ఎబోలా వైరస్ ప్రపంచాన్ని ఎలా వణికించిందో ఇప్పుడు ఇంకో వైరస్ పేరు చెబితేనే వణికిపోతున్నారు బ్రెజిల్ దేశస్థులు. అదే జైకా వైరస్. రోజు.. రోజుకీ ఈ వైరస్ ప్రభావం ఎక్కువతుందే కానీ తగ్గడంలేదు. అసలు ఈ జైకా వైరస్ కు కారణం ఎజెపి దోమ. ఈ దోమ కుట్టడం ద్వారా వైరస్ వ్యాపించి.. జ్వరంతోపాటు డెంగీ, చికున్‌ గున్యా, యెల్లో ఫీవర్‌ వంటి వ్యాధులు కూడా విస్తరిస్తాయి. అంతేకాదు అత్యంత ప్రమాదకరమైన విషయం ఏంటంటే.. గర్భిణీ స్త్రీలకు ఈ వైరస్ రావడం వల్ల పుట్టే పిల్లలకు జన్యుపరమైన లోపాలు రావడం.. పిల్లలకు శారీరక పెరుగుదల ఉండకపోవడం.. చిన్నచిన్న తలలుగా పుట్టడం వంటివి జరుగుతున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే చాలా కేసులు నమోదయ్యాయి. మరోపక్క ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపడుతున్నా అవి విఫలమవుతున్నాయి. దీంతో చేసేది లేక ఈ సమస్య పూర్తిగా సమసిపోయేంత వరకూ గర్భధారణకు దూరంగా వుండాలని.. 2018 వరకూ స్త్రీలు గర్భం దాల్చకుండా చర్యలు తీసుకోవాలని ఎల్‌సాల్వడార్‌, కొలంబియా, బ్రెజిల్‌ ప్రభుత్వాలు మహిళలకు సూచిస్తున్నాయి. అంతేకాదు ఈ వైరస్ చిన్నచిన్నగా బ్రెజిల్‌తో పాటు పలు లాటిన్‌ అమెరికా దేశాలలో ఈ వైరస్‌ విస్తరించటంతో ఇది అంతర్జాతీయ సమస్యగా మారింది. ఇప్పుడు ఇండియాలో కూడా ఈ వైరస్ వచ్చే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. మరి అధికారులు తొందరగా మేల్కొని దీనికి తగిన చర్యలు తీసుకొని ఇప్పుడే అరికట్టకపోతే భవిష్యత్తులో చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్త్తుంది.