CSS Drop Down Menu

Wednesday, January 20, 2016

ఒకే నోటుపై "రెండు సీరియల్ నెంబర్స్ "

కరెన్సీ నోట్లపై ముద్రణ చాలా జాగ్రత్తగా వుంటుంది. భారీ సెక్యూరిటీ మధ్య మింట్ సిబ్బంది ముద్రిస్తారు. ఇక నోటు అచ్చువేయడంలో ఎలాంటి పొరపాట్లు జరగవు. ఒక నోటుపై కనిపించే నెంబరు.. మరో నోటుపై అస్సలు రాదు. అంతేకాదు ఓ నోటుపై ముద్రించిన నెంబరు.. రెండు చోట్లున్నా ఒకటిగానే వుంటుంది. కానీ ఓ బిజినెస్‌మేన్‌కు రెండు నెంబర్లతో వున్న 500 రూపాయలు నోట్ వచ్చింది.





దీపావళికి ముందురోజు మూడు ఏటీఎంల నుంచి చెన్నైకి చెందిన బిజినెస్ మేన్ మోహన్‌రాజ్ కొంత డబ్బును విత్ డ్రా చేశారు. శనివారం వాటిని లెక్కిస్తుండగా అందులో ఓ నోటుకు 500 రూపాయల నోటు పైభాగంలో IBH768505 అని, దిగువ భాగంలో IBH768506 అని వుంది. దీంతో షాకైన అయిన, బ్యాంకు అధికారులకు ఫిర్యాదు చేశారు. 

Friday, January 15, 2016

"సంక్రాంతి శుభాకాంక్షలు"



Wednesday, January 13, 2016

"334" సంవత్సరాల జైలు శిక్ష పడిన నిందితుడెవరో తెలుసా ?

ప్రపంచవ్యాప్తంగా చోటు చేసుకుంటున్న ఆన్‌లైన్ దాడులకు సంబంధించి అనేక వార్తలను ఈ మధ్యకాలంలో మనం వింటున్నాం. ఇంటర్నెట్ వేదికగా సాగుతోన్న ఆన్‌లైన్ దాడుల్లో భాగంగా హ్యాకర్లు, తాము లక్ష్యంగా చేసుకున్న కంప్యూటర్‌లలోకి వైరస్ జొప్పంచి తమ ఆధీనంలోకి తెచ్చుకుంటారు. తరువాత , ఆ కంప్యూటర్‌లలోని విలువైన సమాచారాన్ని దొంగిలించి తమకు అనుకూలంగా వాడుకుంటారు.
మోసపూరిత ప్రకటనలతో భారీ హ్యాకింగ్‌కు పాల్పిడిన ఓ హ్యాకర్‌కు న్యాయస్థానం ఏకంగా 334 సంవత్సరాల జైలు శిక్షను విధించింది.టర్కీకి చెందిన Onur Kopcak (26) , మరో 11 మంది హ్యాకర్లతో కలిసి మోసపూరిత ఆన్‌లైన్ స్కామ్‌లకు పాల్పడినట్లు కోర్టు నిర్థారించింది.
ఈ కరుడుగట్టిన హ్యాకర్ బ్యాంకింగ్ ఇన్స్‌స్టిట్యూషన్స్ మాదిరిగా ఇంటర్‌ఫేస్‌ను రూపొందించించి అనేక కార్డ్ హోల్డర్‌లను మోసం చేసినట్లు న్యాయస్థానం నిర్థారించింది. ఈ నేరం క్రింద ఇతగాడికి 2013లోనే 199 సంవత్సరాల జైలు శిక్షను విధించింది. ఇతగాడి ఉచ్చులో చిక్కి నష్టపోయిన బాధితులు ఒక్కొక్కరిగా వెలుగులోకి వస్తుండటంతో కేసును మరోసారి పున: సమీక్షించన న్యాయస్థానం ప్రధాన నిందితుడైన Onur Kopcakకు ఏకంగా 334 సంవత్సరాల జైలు శిక్షను ఖరారు చేసింది.

Friday, January 8, 2016

"వింటర్ హేట్స్"








Saturday, January 2, 2016

"మర్మావయాలను కోసి" కూర వండమన్నాడు ! ఎందుకు ?

తన భార్య కన్నె తనాన్ని నాశనం చేసిన ఓ రేపిస్ట్  మర్మావయాలను కోసి కూర వండుకు తింటే గాని అతగాడి గుండె మంట చల్లారలేదు.షాక్ పుట్టించే ఈ సంఘటన రెండు నెలల కిందట ఇండోనేషియాలోని లాంపంగ్ లో జరిగింది. వివరాల్లోకి వెళితే.. అతని పేరు రూడీ ఎఫెండీ.. ఉండేది జకార్తాలో..30 ఏళ్ల రూడీకి పెళ్లయింది. ఇక్కడి దాకా బాగానే ఉంది. పెళ్ళయిన తరువాత మామూలుగా జరిగే తొలిరాత్రి నాడు తన భార్య కన్య కాదని తెలుసుకున్నాడు. పట్టరాని  కోపం తెచ్చుకున్నాడు.సంభాళించుకున్నాడు. భార్య నూరియాను అనునయించి అసలు విషయం చెప్పమన్నాడు. దీంతో నూరియా తను డేటింగ్ చేసిన ఫ్రెండ్ తోనే అత్యాచారానికి గురయ్యానని చెప్పింది. ఇది విన్న ఎఫెండి మనసులో క్రూరమైన ప్లాన్ రెడీ అయిపోయింది. సరే .. జరిగిందేదో జరిగింది. అతనితో మాట్లాడాలి. ఒక్కసారి రమ్మనమని భార్య నూరియాతో చెప్పాడు. ఆమె మాట విని తన మాజీ ప్రియుడు నూరియా తో మాట్లాడేందుకు ఇంటికి వచ్చాడు. అతను రావడమే ఆలస్యం.. ఎఫెండీ ఆ మాజీ ప్రియుణ్ని కత్తితో కసిదీరా చనిపోయిన దాకా పొడిచాడు. ఆ తరువాత అతన్ని తగులబెట్టాడు. ఈ దారుణానికి ఒడిగట్టే ముందు ఎఫెండీ ఆ వ్యక్తి  ప్రవేట్ పార్ట్ ను కోసివేసి రాత్రికి కూర వండమని భార్యకు చెప్పాడు. పైగా తనతో బాటు భార్యను కూడా తినమన్నాడు. అలా చేస్తేనే  కానీ తన కోపం చల్లారదని చెప్పాడట ఎఫెండీ.  అదీ విషయం.