
వెనిజులా దేశం ఆర్థిక సంక్షోభంలో కూరుకుంది. ఫలితంగా దేశ కరెన్సీకి ఏమాత్రం విలువ లేకుండాపోయింది. దీంతో రెండు కేజీల చికెన్ ధర ఏకంగా కోటి 46 లక్షలు పలికింది. అయితే, ఈ ధర మన కరెన్సీలో కాదులెండి. వెనిజులా దేశ కరెన్సీ లెక్కల్లో.
ప్రస్తుత పరిస్థితుల్లో ఆ దేశంలో రెండు కేజీల చికెన్ కొనాలంటే అచ్చంగా కోటి 46 లక్షల బాలివర్లు చెల్లించాల్సిందే. ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న వెనిజులాలో ద్రవ్యోల్బణం శ్రుతి మించడంతో లోకల్ కరెన్సీ అయిన బాలివర్లకు విలువ లేకుండా...