తెలుగు సినీపరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ పైన తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. శ్రీరెడ్డి అనే నటి క్యాస్టింగ్ కౌచ్‌ను తెరపైకి తీసుకువచ్చి తెలుగు సినీపరిశ్రమ మొత్తాన్ని రోడ్డుపైకి లాగిన విషయం తెలిసిందే. సినిమాల్లో అవకాశాలు రావాలంటే డైరెక్టర్లు, నిర్మాతలతో పడుకోక తప్పదంటూ శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి.
ఆ తరువాత శ్రీరెడ్డి వ్యవహారంపై ఒక్కొక్కరు ఒక్కో విధంగా మాట్లాడారు. ఇదే విషయంపై తాజాగా నటుడు ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారుతున్నాయి. అవకాశాల కోసం డైరెక్టర్లు, నిర్మాతలు నటీమణులను పడుకోమని...