CSS Drop Down Menu

Saturday, February 6, 2016

బాహుబలి దర్శకనిర్మాతల్ని అరెస్ట్ చేస్తారా?

మొదటి భాగం ఇచ్చిన ఉత్సాహంతో 'బాహుబలి2' సినిమాని డైరెక్టర్ రాజమౌళి మరింత జోష్ తో తెరకెక్కిస్తున్నాడు. ఇటీవల ఈ సినిమా షూటింగ్ కేరళలోని త్రిసూర్ లో జరిగింది.  అయితే, ఇక్కడ ఏనుగులపై షూట్ చేసిన సీన్స్ చట్టవిరుద్ధమని జంతు హక్కుల పరిరక్షకుల సంఘం పోలీసులకు ఫిర్యాదు చేసింది.

 భారత వన్యమృగ బోర్డు నుంచి ఎలాంటి అనుమతి లేకుండా ఏనుగును షూటింగ్ కోసం ఉపయోగించారని.. షూటింగ్ జరుగుతున్నంతసేపు యూనిట్‌లో ఉన్న 50కి పైగా మంది అరుపులు, కేకలతో ఏనుగు ఇబ్బంది పడిందని టాస్క్ ఫోర్స్ సెక్రటరీ వీకే వెంకటాచలం తన ఫిర్యాదులో పేర్కొన్నారు. బాహుబలి మూవీ డైరెక్టర్, ప్రొడ్యూసర్ ని అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అయితే, బాహుబలి టీం వాదన మరోవిధంగా ఉంది. కేవలం ఏనుగును గ్రాఫిక్స్ చేసి సినిమాలో చూపించేందుకే వాడినట్లు చెబుతున్నారు. 

1 comment:


  1. సరి కి సరి ! అరెస్ట్ సీన్ ని కూడా గ్రాఫిక్స్ లో జేసి పోలీసు లు చూపించేస్తే తంటా వదిలి పోతుంది :)

    జిలేబి

    ReplyDelete