CSS Drop Down Menu

Monday, January 25, 2016

మనసుకు హత్తుకునే ఆ "శునక విశ్వాసం"

ఒక కుక్క.. యజమాని కారులో వెళుతోంది. అయితే సడన్ గా కార్ విండో నుంచి బయటకు దూకింది. అది గమనించని యజమాని కారుతో ముందుకు సాగిపోయాడు. చాలా దూరం వెళ్లాక కారులో కుక్క లేకపోవడాన్ని గమనించాడు. అయ్యో.. తాను ఎంతో అల్లారుముద్దుగా పెంచుకుంటున్న కుక్కేమైందోనని వెతికాడు. కుక్క ఆచూకీ కనిపెట్టలేకపోయాడు. ఈ క్రమంలో నెలలు గడిచిపోయాయి. కుక్కగురించి యజమాని మరచిపోయాడు. అయితే, ఆకుక్క మాత్రం కారునుంచి ఉరికిన చోటే వెయిట్ చేసింది. ఇలా..రోజు..వారం..నెల.. 6నెలలు... ఏకంగా ఏడు నెలలపాటు నిరీక్షించింది.




ఆదారి గుండా ప్రయాణిస్తోన్న మోటారిస్టులు, వాహనదారులు కుక్కను రోజూ గమనించసాగారు. ఎవరి కోసమే తదేకంగా కుక్క ఎదురుచూస్తుందన్న విషయాన్ని గ్రహించారు. కొందరైతే కుక్క సేతతీరేందుకు గొడుగులు, బిస్కెట్లు తదితర సామాగ్రి కుక్కదగ్గర ఉంచసాగారు. తర్వాత కూడా కుక్క అక్కడే ఉండటాన్ని చూసి విషయాన్ని మీడియాకు చెప్పారు. ఇది ఆనోటా ఈ నోటా యజమాని దగ్గరకు చేరింది. దీంతో తమ కుక్క కోసం హుటాహుటీన ఆ ప్రాంతానికి వెళ్లి కుక్కను తెచ్చుకుని కన్నీటిపర్యంతమయ్యారు యజమాని అతని కుటుంబసభ్యులు. మనసుకు హత్తుకునే ఈ ఘటన థాయ్ లాండ్ లో జరిగింది. ఆ విశ్వాసానికి మారుపేరైన ఆ శునకరాజం పేరు బిగ్ బ్లూ..  బిగ్ బ్లూ నీకు శతకోటి వందనాలు.  

0 comments:

Post a Comment