హీరో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు బుధవారం నాడు హైదరాబాదులోని
తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వద్ద ఆందోళనకు దిగారు.
జూనియర్ ఎన్టీఆర్‌కు తెలంగాణ రాష్ట్ర బాధ్యతలు అప్పగించాలని వారు ఆందోళన
చేయడం గమనార్హం.
వారసుడి విషయంలో నాలుగేళ్ల క్రితం టిడిపిలో వివాదం తలెత్తింది. నారా లోకేష్
వర్సెస్ జూనియర్ ఎన్టీఆర్‌లా నాడు మారింది. దీనిపై జూనియర్ ఎన్టీఆర్
తండ్రి నందమూరి హరికృష్ణ పలుమార్లు అసంతృప్తి వ్యక్తం చేశారు కూడా. ఆ
తర్వాత జూనియర్ రేసు నుంచి తప్పుకోవడం, లోకేష్ తెరపైకి రావడం జరిగిపోయాయి.
ఇప్పుడు మళ్లీ, జూనియర్ ఎన్టీఆర్ పేరు టిడిపి వారసుడిగా తెరపైకి రావడం
గమనార్హం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలు రెండు
అయ్యాయి. ఈ నేపథ్యంలో టిడిపి జాతీయ అధ్యక్షులు చంద్రబాబు తనయుడు నారా
లోకేష్‌ను ఏపీకి వారసుడిగా చాలామంది భావిస్తున్నారు.
తెలంగాణాకి జూనియర్ ఆంధ్రాకి లోకేష్ ఆలోచన బాగానే ఉంది.అభిమానుల గొడవే కానీ జూనియర్ సినిమాలు వదులుకుని రాజకీయాల్లోకి వస్తాడా ? లోకేష్ కి వేరే వృత్తి లేదు కాబట్టి రాజకీయాల్లో ఉన్నారు.
ReplyDelete