CSS Drop Down Menu

Friday, January 22, 2016

కేసీఆర్ టైలర్ సెంటిమెంట్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సెంటిమెంట్లు ఎక్కువే! ఆయన సీఎం అయిన తర్వాత కూడా చిన్నిచిన్న సెంటిమెంట్లను వదులుకోలేదు. 1990 నుంచి నేటి వరకు ఆయన దుస్తులు కొనుగోలు చేసేది ఒక షాపులోనే, బట్టలు కుట్టించుకునేదీ అక్కడే! తెలంగాణ సీఎం కేసీఆర్ హైదరాబాద్ హైదర్‌గూడాలోని ఓ ఖాదీ భాండార్‌లో షాపింగ్ చేశారు.
 
క్లాత్ కొనుగోలు చేసిన సీఎం, అక్కడే కొలతలు ఇచ్చి కుట్టించుకునేందుకు ఆర్డరిచ్చారు. దీనిపై షాపు యజమాని తన ఆనందాన్ని వ్యక్తంచేశాడు. కేసీఆర్ సీఎం అయినా మర్చిపోకుండా తమ షాపులోనే షాపింగ్ చేయడం సంతోషంగా వుందన్నాడు.


0 comments:

Post a Comment