CSS Drop Down Menu

Thursday, March 23, 2017

Tuesday, March 21, 2017

శరీరానికి నీరు పట్టిందా? ఐతే ఇవి వాడండి !

ఒంట్లో నీరు చేరిందని డాక్టర్లు చెప్పారా? అయితే మందులు వాడటం చేస్తున్నారా? అయితే కాస్త ఆపండి. మనం తీసుకునే ఆహారం ద్వారానే ఒంట్లోని నీటిని బయటికి పంపించేయవచ్చు. ఒంట్లో ఉప్పు శాతం తక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఉప్పులోని సోడియం శరీరంలో అధికంగా నీరుండేలా చేస్తుంది.


శరీరంలోని నీటిని వెలివేయాలంటే.. విటమిన్ బీ6 తప్పకుండా కావాలి. ఈ విటమిన్ పప్పు, చేపలు, డ్రై ఫ్రూట్స్, పాలకూరల్లో పుష్కలంగా ఉన్నాయి. వీటితో పాటు అర‌టి పండ్లు, అవ‌కాడోలు, బీన్స్‌, పాల‌కూర వంటి ఆహార ప‌దార్థాల‌ను తీసుకుంటే శ‌రీరంలో అధికంగా ఉన్న నీరు బ‌య‌టికి పోతుంది.

నట్స్, ఆకుపచ్చని కూరగాయలు తీసుకోవడం మంచిది. నీటిని కూడా తగిన మోతాదులో తీసుకోవాలి. పంచదార, పిండి పదార్థాలు, ఉప్పు తీసుకోకూడదు. ఇంకా వెల్లుల్లిని ఆహారంలో భాగం చేసుకుంటే శ‌రీరంలో నిల్వ అయ్యే అధిక నీటి స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. 

జీల‌క‌ర్ర‌ను నిత్యం ఏదో ఒక రూపంలో తీసుకుంటున్నా అధిక నీరు శ‌రీరం నుంచి బ‌య‌టికి వెళ్లిపోతుంది. జీలకర్రను రోజూ మీరు తాగే నీటిలో అరస్పూన్ లేదా ఒక స్పూన్ వేసి నానిన తర్వాత ఆ నీటిని తాగితే.. ఒంట్లోని నీరు బయటికి వెళ్తుంది. తద్వారా బరువు తగ్గుతారని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 

Saturday, March 18, 2017

ఈ ఏటీఎం కార్డుతో రోజుకు ఎన్నిసార్లు నగదు డ్రా చేసుకున్నా సర్వీస్ ఛార్జీలు పడవు!

బ్యాంకులు విధిస్తున్న నిబంధనలతో ఏటీఎం కేంద్రాల వైపు, బ్యాంక్ బ్రాంచిలవైపు చూసేందుకే వినియోగదారులు జంకుతున్నారు. ఈ పరిస్థితిని తపాలా శాఖ తనకు అనువుగా మార్చుకుంటోంది.
పోస్టాఫీసులో రూ.50తో అకౌంట్ ప్రారంభిస్తే చాలు.. వెంటనే ఏటీఎం కార్డు కూడా అందజేస్తామని, తమ ఏటీఎం కార్డు ద్వారా జరిపే లావాదేవీలపై ఎలాంటి సేవా రుసుములు విధించమని ప్రకటించుకుంటోంది.
దీని ప్రకారం.. కనిష్టంగా రూ.50 చెల్లించి తపాలా కార్యాలయాల్లో ఎవరైనా ఖాతా ప్రారంభించవచ్చు. పాస్ బుక్, ఏటీఎం కార్డు సౌకర్యం కలిగిన ఈ ఖాతాల ద్వారా సులభంగా నగదును తీసుకునే పథకాన్ని ప్రకటించింది.
 తపాలాశాఖ అధికారి ఒకరు మాట్లాడుతూ.. తపాలా ఏటీఎం కార్డును ఉపయోగించి ఏ పోస్టాఫీసు, ఏ బ్యాంకులకు చెందిన ఏటీఎంల నుంచైనా నగదు తీసుకోవచ్చని తెలిపారు.
ఈ ఏటీఎం కార్డుకున్న సౌలభ్యం ఏమిటంటే.. ఒకేరోజు ఎన్నిసార్లయినా నగదు డ్రా చేసుకోవచ్చు.. ఎన్నిసార్లు తీసుకున్నా ఎలాంటి సర్వీస్ ఛార్జీలు పడవు. బ్యాంకుల మాదిరిగానే తపాలా పొదుపు ఖాతాలకు 4 శాతం వడ్డీని అందిస్తున్నారు. పోస్ట్ పేమెంట్ బ్యాంకింగ్ అనే కొత్త పథకంలో డిపాజిట్లపై 4.5 నుంచి 5.5 శాతం వడ్డీని అందిస్తారు.

Thursday, March 16, 2017

"వేసవి కాలం"లో ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసా ?

వేసవి కాలం వచ్చేస్తోంది. అప్పుడే ఎండలు భగ్గుమంటున్నాయి. ఈ కాలంలో ఎక్కువ ద్రవ పదార్థాలు తీసుకోవాలి. అలాగే ఆరోగ్యంపై అధిక శ్రద్ధ పెట్టాలి. ప్రతిరోజూ కొబ్బరి నీళ్లు, పళ్లరసాలు, మంచినీళ్లు, మజ్జిగ, తాటిముంజెలు తీసుకోవాలి.
ముఖ్యంగా ఉదయం పూట తీసుకునే టిఫిన్స్ కానీ, సాయంత్రం పూట తీసుకునే స్నాక్స్ కానీ నూనె లేనివి తీసుకోవడం ఉత్తమం. బార్లీ గింజల్లో నీరు పోసి ఉడికించి.. ఆపై అందులో ఉప్పు లేదా బెల్లం, నిమ్మరసం కానీ వేసుకుని తాగితే చలవ చేస్తుంది. ఈ నీరు పిల్లల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. 

ఎండాకాలంలో చెర్రీ, బెర్రీలు.. బొప్పాయి, యాపిల్ వంటి పండ్లతో పాటు నిమ్మజాతి పండ్లు.. ఎండు ద్రాక్షలు, ఉల్లిపాయ ఎక్కువగా తీసుకోవాలి. తద్వారా అలసటను తగ్గించుకోవచ్చు. రోజూ ఒక గ్లాసుడు నిమ్మరసంలో పుదీనా చేర్చి తీసుకోవడం ద్వారా నీరసం తగ్గిపోతుంది. ఇంకా కాలేయం పనితీరు మెరుగుపడుతుంది.


మెటబాలిజం మెరుగుపడుతుంది. అలాగే వాటర్‌మెలాన్ జ్యూస్ రోజూ తీసుకోండి. 90 శాతం ఇందులో నీటి శాతం ఉండటం ద్వారా శరీరానికి ఉత్తేజాన్నిస్తుంది. శరీర ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరిస్తుంది. వేసవిలో పుచ్చకాయను తీసుకోవడం ద్వారా చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. వృద్ధాప్య ఛాయలు తగ్గిపోతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.